Janaki Kalaganaledu Weekly Roundup: సూసైడ్ ఆలోచనలతో అఖిల్ ప్రేమ.. నిజం కోసం జానకి పోరాటం!

టెలివిజన్ సీరియల్స్ లలో ఇటీవల కాలంలో మంచి గుర్తింపు అందుకుంటున్న సీరియల్స్ లో జానకి కలగనలేదు ఒకటి. ఈ సీరియల్ రేటింగ్ కూడా రోజురోజుకు మరింత ఎక్కువగా పెరుగుతోంది. మొదట్లో ఈ సీరియల్ కాస్త నిరాశకు గురి చేసినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది.

ఇక గత వారం మొత్తం కూడా అంటే సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి. అలాగే జానకి, అఖిల్ జెస్సి ప్రేమ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం..

సెప్టెంబర్ 12వ ఎపిసోడ్

సెప్టెంబర్ 12వ ఎపిసోడ్

జెస్సి మరొకరిని ప్రేమించిందని అతను వెళ్లిపోయాక తనను మోసం చేయాలని అనుకుంటున్నట్లు అఖిల్ లేనిపోని అబద్ధాలు చెబుతాడు. ఆ మాటలకు జానకి కూడా షాక్ అవుతుంది. అయితే ఈ విషయంలో జ్ఞానాంబ అఖిల్ ను మరోసారి అడుగుతుంది. అంతే కాకుండా తన మీద ఒట్టు వేసి చెప్పాలని అంటుంది. అయినప్పటికీ అఖిల్ జెస్సితో తనకు సంబంధం లేదని అంటాడు. ఇక జానకి అఖిల్ మాటలకు ఆశ్చర్యపోయి వీరు ప్రేమించుకున్నప్పుడు దిగిన ఫొటోలు ఉన్నాయి అని అన్నప్పుడు మళ్ళీ అఖిల్ ఆమె వేరే వ్యక్తి తో ఉన్న ఫొటోలను తల్లికి చూపిస్తాడు.

ఆ ఫొటోలు మార్ఫింగ్ చేసి తనను మోసం చేయాలనీ అనుకుంటుంది అని తను చెప్పిన మాటలు జానకి వదిన కూడా నమ్ముతుంది అని అంటాడు. దీంతో జ్ఞానాంబ కొడుకు మాటలు నమ్మి జానకి ని హెచ్చరిస్తోంది.

సెప్టెంబర్ 13వ ఎపిసోడ్

సెప్టెంబర్ 13వ ఎపిసోడ్

ఇక అఖిల్ తో రామచంద్ర మాట్లాడాలని కూడా అనుకుంటాడు. కానీ అతను దొరక్కుండా తిరుగుతూ ఉంటాడు. చివరికి అఖిల్ తన తల్లి దగ్గరికి వెళ్లి ఒడిలో పడుకుంటాడు. ఈ సమయంలో అన్నయ్యకు ఒంటరిగా దొరికితే ఏదో ఒకటి అనుమానం వ్యక్తం చేసేలా మాట్లాడుతాడు అని అందుకే అమ్మ దగ్గరే ఉండాలి అని అనుకుంటాడు. కానీ రామ మాత్రం ఆ విషయంలో చాలా సీరియస్ గానే ఉంటాడు.

సెప్టెంబర్ 14వ ఎపిసోడ్

సెప్టెంబర్ 14వ ఎపిసోడ్

అప్పుడే వచ్చిన లీలావతి ఇంట్లో ఏదో జరుగుతోంది కదా అని అనుమానం వ్యక్తం చేస్తుంది. ఊర్లో అందరూ కూడా జెస్సి అనే అమ్మాయికి మీ వల్ల ఏదో జరిగింది అని అనుకుంటున్నారు అని అంటుంది. ఆ విషయంలో జ్ఞానాంబ మరోసారి కోప్పడుతుంది. మా ఇంట్లో విషయాలు నీకు అవసరం లేదు అని చెబుతుంది.

ఇక ఆ తర్వాత మల్లిక మాట్లాడుతూ.. లీలావతిని నోరు మూయించినంత మాత్రాన ఊర్లో వాళ్ళ అందరి నోళ్ళు ముగించలేం కదా అని అనుమానం వ్యక్తం చేస్తుంది. దీంతో మళ్ళీ జ్ఞానాంబ ఆలోచనలో పడుతుంది.

సెప్టెంబరు 15

సెప్టెంబరు 15

అఖిల్ ఆ టెన్షన్ తట్టుకోలేక పర్మినెంట్ సొల్యూషన్ ఆలోచించాలి అని జెస్సి కి ఫోన్ చేస్తాడు. నువ్వు వెంటనే అబార్షన్ చేయించుకోవాలి అని లేకపోతే జీవితంతో మన పెళ్లి జరగదు అని.. ఇలానే మొండిగా ప్రవర్తిస్తే మర్చిపోతాను అని కూడా అంటాడు.

దీంతో జెస్సి తన తల్లిదండ్రులకు బాధ పెట్టలేక తను ఏదైనా చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక తర్వాత జెస్సీ తల్లిదండ్రులు వెంటనే జానకికి ఫోన్ చేస్తారు. అప్పుడే పరీక్షా హాల్ లోకి వెళ్లాలని అనుకుంటున్న జానకి జెస్సి తల్లిదండ్రులు చెప్పిన మాటలకు షాక్ అవుతుంది.

సెప్టెంబర్ 16వ ఎపిసోడ్

సెప్టెంబర్ 16వ ఎపిసోడ్

ఇక మల్లిక మాటలకు జానకి మరింత అసహనం వ్యక్తం చేస్తుంది. ఇక జ్ఞానాంబ మాత్రం మల్లికా మాటలో ఎలాంటి తప్పులేదు అంటూ జానకి పై సీరియస్ అవుతుంది. నువ్వు నీ చదువుని అలాగే ఇంటి బాధ్యతలను వదిలిపెట్టకుండా నిజం నిరూపించాలి.. అంతేకానీ అనవసరంగా పరీక్షలను వదిలేసి వేరోకరి కోసం ఆలోచించకూడదు అని అంటుంది.

మరోసారి పొరపాటు జరిగితే క్షమించను అని చెప్పడంతో జానకి ఏమే మాట్లాడలేకపోతుంది. ఇక మరోవైపు రామచంద్ర అఖిల్ ను గట్టిగా అడిగే ప్రయత్నం చేస్తాడు కానీ అతను అదే పనిగా అబద్దం చెబుతూ ఉంటాడు నీకు అఖిల్ ఈ విషయం సీరియస్ గా అవడంతో కాస్త భయపడతాడు దింతో అతను కూడా విషం తాగి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X