Janaki Kalaganaledu Weekly Roundup: పూజలో జెస్సి తప్పులు.. రామ, జానకి రొమాంటిక్ లవ్

జానకి కలగనలేదు సీరియల్ రేటింగ్ రోజురోజుకు మరింత ఎక్కువగా పెరుగుతోంది. మొదట్లో ఈ సీరియల్ కాస్త నిరాశకు గురి చేసినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే సెప్టెంబర్ 26 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి. అలాగే జానకి, అఖిల్ జెస్సి ప్రేమ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం..

సెప్టెంబర్ 26వ ఎపిసోడ్

సెప్టెంబర్ 26వ ఎపిసోడ్

జానకి ప్రత్యేకంగా అట్లతద్ది పండగ సందర్భంగా గోరింటాకు సిద్ధం చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన జెస్సి పండగ విశేషాల గురించి అడుగుతుంది. అలా అడుగుతుంటే పక్కనే ఉన్న జ్ఞానాంబ కూడా చూస్తుంది. ఇక ప్రత్యేకంగా పూజ జరుగుతుండగా ఆ సమయంలోనే హారతికి ఒకరి చీర అంటుకుంటుంది. ఇక ఆ సమయంలో మిగతా వాళ్ళు వాయనం తీసుకోవడానికి నిరాకరిస్తారు. ఈ ఇంట్లో వాయనం తీసుకుంటే మన పసుపు కుంకుమాలకు కూడా మంచిది కాదు అని వెళ్లిపోవాలని అనుకుంటారు.

సెప్టెంబర్ 27వ ఎపిసోడ్

సెప్టెంబర్ 27వ ఎపిసోడ్

పూజ కోసం అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత అప్పుడే లీలావతి కూడా అక్కడికి వస్తుంది. ముందుగానే లీలావతి చేత మల్లికా ఒక ప్లాన్ చేస్తుంది. ఈ పూజను ఎలాగైనా చెడగొట్టాలని జానకిని అత్తగారి చేత తిట్టించాలి అని అనుకుంటుంది. అందుకోసం ఆమె పూజలో చిన్నపాటి మంటలు వచ్చేలా ప్లాన్ వేస్తుంది. ఇక మరోవైపు పూజ జరుగుతున్న సమయంలో జెస్సి తడబడుతుంది. మొదట జెస్సిని చూసిన మహిళలు కొందరు ఆమె ఎవరు అని అడుగుతారు. ఇక వారి ప్రశ్నలకు సమాధానం చెప్పక ముందే జానకి వాళ్ళందరినీ పూజకు సిద్ధం చేస్తుంది. ఆ తర్వాత పూజ జరుగుతూ ఉండగా హఠాత్తుగా జాకెట్ ముక్కలపై మంట అంటుకుంటుంది. ఇక ఈ అపశకునం మనకు కూడా తగిలే అవకాశం ఉంటుంది అని లీలావతి తన మాటలతో బాధపెడుతుంది. తోటి మహిళలు వాయినాలు తీసుకోకుండానే అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుంటారు.

సెప్టెంబర్ 28వ ఎపిసోడ్

సెప్టెంబర్ 28వ ఎపిసోడ్

జానకిని కలవడానికి వస్తున్నాను అంటూ రామతో జానకి ప్రిన్సిపల్ మాట్లాడుతుంది. మీ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయేమో కానీ జానకి ఈ మధ్య పరీక్షలు రాయడం లేదు క్లాసులకు కూడా సరిగా రావడం లేదు ఇప్పుడు ఆమెకు చాలా ముఖ్యమైన సమయం అని ప్రిన్సిపల్ అంటారు. ఇక తప్పకుండా జానకి క్లాసులకు రావాలి అని అలాగే ఐపీఎస్ కావాలి అంటే తప్పనిసరిగా ఫిట్నెస్ విషయంలో కూడా శిక్షణ తీసుకోవాలని ప్రిన్సిపల్ చెప్తారు. దీంతో రామచంద్ర జానకి కోసం ప్రత్యేకంగా ఒక ప్లాన్ వేస్తాడు. బయట ఒక మొబైల్ ఫోన్ దొంగతనం చేస్తున్నట్లుగా రామచంద్ర ముసుగులో పరిగెడుతూ ఉంటాడు.

సెప్టెంబరు 29

సెప్టెంబరు 29

ఉదయం నుంచే మీరు వాకింగ్ చేయాలి అని రామచంద్ర జనకితో చెబుతాడు. ఇక కొద్దిసేపు పరిగెత్తిన తర్వాత జానకి ఇంట్లో ఆలోచనలే గుర్తు చేసుకుంటూ అలసిపోతుంది. ఇక జానకిని అలర్ట్ చేసేందుకు రామచంద్ర ఒక ప్లాన్ వేస్తాడు. ముసుగులో ఒక వ్యక్తి ఫోన్ లాక్కొని వెళ్లిపోతాడు. ఇక అది చూసిన జానకి అతను దొంగ అనుకొని పరిగెడుతుంది. ఇక తీరా చూసేసరికి రామచంద్ర అని తెలిసాక ఆశ్చర్య పోతుంది. మీకోసమే ఇలా చేశాను అని మీ కర్తవ్యం మీకు గుర్తు రావాలి అని అంటాడు. అంతే కాకుండా జానకి కాలు నొప్పిగా ఉండడంతో ఆమెను ఎత్తుకొని తీసుకువెళ్తాడు.

సెప్టెంబర్ 30వ ఎపిసోడ్

సెప్టెంబర్ 30వ ఎపిసోడ్

తల్లి జ్ఞానాంబ , అఖిల్ ఇప్పుడు చిన్నపిల్లాడు కాదు మీరు మంచి చెడ్డ చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది. వాడు పెద్ద పెద్ద పనులు చేస్తున్నాడు అని అనవసరంగా మీ సమయం వృధా చేసుకోవద్దు అని రామచంద్రను షాప్ కు వెళ్లమని చెబుతుంది. ఇక జానకిని చదువుకోమని అంటుంది. దీంతో అఖిల్ తల్లి దగ్గర తన పప్పులు ఉడకవని మరొక విధంగా ఆలోచించాలని అనుకుంటాడు. ఇక రామచంద్ర షాప్ కు వెళ్లిన తర్వాత జానకి చదువుకుంటుందో లేదో అనే టెన్షన్లో ఉంటాడు. కానీ జానకి మాత్రం చదువుపై దృష్టి పెడుతుంది. మరి జానకి వచ్చే పరీక్షల్లో ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X