Janaki Kalaganaledu Weekly Roundup: మరింత ఒత్తిడిలో జానకి.. అఖిల్ - జెస్సి లవ్ స్టోరీలో న్యూ ట్విస్ట్
టెలివిజన్ సీరియల్స్ లలో మంచి క్రేజ్ అందుకుంటున్న సీరియల్స్ లో జానకి కలగనలేదు టాప్ లిస్ట్ లో ఉంది అని చెప్పవచ్చు. ఈ సీరియల్ రేటింగ్ కూడా రోజురోజుకు మరింత ఎక్కువగా పెరుగుతోంది. మొదట్లో ఈ సీరియల్ కాస్త నిరాశకు గురి చేసినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి. అలాగే జానకి చదువు విషయంలో జ్ఞానాంబ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం..

సెప్టెంబర్ 5వ ఎపిసోడ్
అఖిల్ ప్రేమించిన జెస్సి గర్భవతి అవుతుంది. మరోవైపు జెస్సి ఇంట్లో వాళ్ల పేరెంట్స్ మరింత ఒత్తిడి పెంచుతూ ఉంటారు. అసలు నువ్వు ప్రెగ్నెంట్ కావడానికి ఎవరు కారణం అని పదేపదే అడుగుతూ ఉంటారు. నువ్వు ఇప్పుడు అతను ఎవరో చెప్పకపోతే మేము చచ్చిపోతాను అని. మాకు పరువు కంటే ప్రాణాలు ఎక్కువ కాదు అని తల్లిదండ్రులు తెగించి చెబుతారు. ఇక ఆ తర్వాత జెస్సి ఏమీ అనలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులకు అఖిల్ గురించి చెబుతుంది. అయితే అఖిల్ జ్ఞానాంబ కొడుకు అని చెప్పగానే వాళ్లు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక మరోవైపు అఖిల్ ఫోటోలు డిలీట్ చేసిన విషయాన్ని కూడా జానకి కనిపెడుతుంది.
వెంటనే సాయంత్రం లోపు నీ నిర్ణయం ఏమిటో చెప్పాలి అని హెచ్చరిస్తుంది. దీంతో అఖిల్ భయపడతారు. ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు అని బయటకు వెళ్లిపోవాలి అని అనుకుంటాడు. మరి ఈ విషయంలో జానకి ఇంకా ఏ విధంగా ఆలోచిస్తుందో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

సెప్టెంబర్ 6వ ఎపిసోడ్
ఇక అప్పుడే జెస్సి పేరెంట్స్ కూడా వస్తారు. ఇక వారిని ఇంట్లోకి రానివ్వకుండా బయట ఆపేసిన జానకి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మాట్లాడితే అనవసరంగా గొడవలు జరుగుతాయి.
తరువాత మాట్లాడుకుందాం అని అంటుంది. కానీ జెస్సి పేరెంట్స్ మాత్రం ఇప్పుడే ఏదో ఒకటి తెలుచుకుంటాం అని పెళ్లి కాకముందే నా కూతురుని తల్లి చేసిన అఖిల్ ని నిలదీసే వెళతాం అని అంటారు. అలాగే పెళ్లి కూడా చేసుకోవాలి అని అంటారు. తప్పకుండా వారిద్దరికీ పెళ్లి అవుతుంది అని అయితే ఇప్పుడు మాట్లాడితే మాత్రం పెళ్లి జరగదు అని జానకి చెబుతుంది.

సెప్టెంబర్ 7వ ఎపిసోడ్
నా మాటను నమ్మి ఇప్పుడు వెళ్లిపోండి తప్పకుండా అఖిల్ , జెస్సిలకు పెళ్లి అవుతుంది అని తను నా చెల్లి లాంటిది అంటూ జానకి భరోసా ఇస్తుంది. ఇక జానకి మాటలకు విలువ ఇచ్చి జెస్సి పేరెంట్స్ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇక అఖిల్ విషయంలో ఏదో ఒకటి తేల్చాలి అని జానకి సీరియస్ గా అఖిల్ ను అడుగుతుంది. అయితే అమ్మకు భయపడి నేను జెస్సికి పెళ్లి చేసుకొనని చెప్పాను అని జానకికి చెబుతాడు. ఇక ఆ తరువాత ఈ విషయం ఎలాగైనా అత్తకు తెలియాల్సిందే అని అంటుంది. కానీ అఖిల్ మాత్రం తన తల్లికి చెప్పొద్దని బ్రతిమాలుతాడు.

సెప్టెంబర్ 8వ ఎపిసోడ్
ఆ తర్వాత మరుసటి రోజు వినాయక చవితి ఉండడంతో అందరూ కూడా ఏర్పాట్లలో బిజీగా ఉంటారు. అయితే చిన్న కోడలు మల్లిక మాత్రం ఎలాంటి పనులు చేయకుండా అరటిపళ్ళు తింటూ ఉంటుంది. అయితే జానకిని ఈ పూజా సమయంలో ఏదో ఒక తప్పులో ఇరికించాలి అని కూడా అనుకుంటుంది. అయితే పూజకు సంబంధించిన పూలు తెస్తూ ఉండగా జానకి ముందు అరటి తొక్క వేయాలి అని మల్లిక అనుకుంటుంది. అప్పుడు ఆ పూలు పడిపోతే అత్తగారి చేత తిట్టించాలని కూడా అనుకుంటుంది.
అయితే ఆ పూలు కింద పడినప్పటికీ కూడా ఏమీ అనదు. అంతే కాకుండా రామచంద్ర జానకి కింద పడిపోకుండా పట్టుకుంటాడు. దీంతో ప్లాన్ వేసిన మల్లిక ఒక్కసారిగా మళ్లీ షాక్ అవుతుంది. మరోవైపు జ్ఞానాంబ తను ఇంటి ఇంటి బాధ్యతలను అప్పగించినందుకు టెన్షన్లో ఉన్నావా అని అడుగుతుంది. అలాంటిదేమీ లేదు అని ఎదో కాలు జారింది అని అంటుంది.

సెప్టెంబర్ 9వ ఎపిసోడ్
జెస్సి పేరెంట్స్ పోలీస్ స్టేషన్ కు వెళుతూ ఉండడంతో జానకి వాళ్ళను మార్గం మధ్యలోనే ఆపేసి ఇంకాస్త టైమ్ కావాలని అడుగుతుంది. పూజలో బిజీగా ఉండడం వలన మీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను అని తప్పకుండా కొంత సమయం తీసుకుని మా అత్తగారితో అఖిల్ విషయం గురించి మాట్లాడతాను అని అంటుంది.
అందుకు జెస్సీ పేరెంట్స్ ఇప్పుడే మా అమ్మాయిని మీ ఇంటికి తీసుకువెళ్లి మీ అత్తగారికి పరిచయం చేయాలి అని పెళ్లి గురించి కూడా మాట్లాడాలి అని షరతు పెడతారు. అందుకు జానకి కూడా ఒప్పుకుంటుంది. మరి జ్ఞానాంబ ఎలా రియాక్ట్ అవుతుందో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.


Click it and Unblock the Notifications











