Janaki Kalaganaledu Serial Weekly Roundup: జనకిపై అత్త ఆగ్రహం.. మరోవైపు డ్యూటీలో ఛాలెంజ్!
జానకి కలగనలేదు సీరియల్ ఏప్రిల్ మొదటి వారం మరింత ఆసక్తికరంగా కొనసాగింది. ఈ సీరియల్ మొదట్లో కాస్త బోరింగ్ గా అనిపించినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది.
ఇక గత వారం మొత్తం కూడా అంటే ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 15 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయి? అలాగే జానకి ఫ్యామిలీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం పదండి..

ఏప్రిల్ 11వ ఎపిసోడ్: విష్ణు కూడా తన భార్య మాట ప్రకారం మాట్లాడాలని అనుకుంటాడు. రామచంద్ర పిలిచి అడగగానే అతను తన దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు అని అంటాడు. అయితే వారం లేదా పది రోజుల సమయం తీసుకొని డబ్బు సమకూర్చే పని చేయాలి అని అంటాడు. కానీ తన దగ్గర లేవు అని కుదరదు అని సమాధానం ఇస్తూ ఉంటాడు.
అలాగే మల్లికా కూడా మరో మాటతో డబ్బులు లేవు అని చెబుతుంది. ఇక ఇంతలో కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి వస్తారు. అయినా పోయిన షాపును ఎలా వెనక్కి తీసుకురావాలో అని ఆలోచించకుండా ఇప్పుడు మా వెనకాల డబ్బు కోసం పడితే ఏం బాగుంటుంది అని మల్లిక ఊహించని విధంగా మాట్లాడుతుంది. దీంతో రామచంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు.
ఏప్రిల్ 12వ ఎపిసోడ్: మెల్లగా మల్లికా అత్తగారి దగ్గరికి వెళ్లి ఎలాగైనా విషయాన్ని చెప్పాలి అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక సందర్భం రావడంతో జానకి ఇంట్లో లేదు అనే విషయాన్ని ఆమె చెబుతోంది. దీంతో అత్తగారు గోవిందరాజులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఉంటారు. మల్లిక చెప్పిన మాటలు వాళ్లు మొదట నమ్మరు. జానకి ఉందా లేదా అని తెలుసుకోవడానికి వాళ్ళు లోపలికి వెళ్తారు. అయితే రామచంద్రను విషయం అడగడంతో చిన్న పని ఉంది అని పోలీస్ స్టేషన్కు వెళ్ళింది.
మళ్ళీ వెంటనే అరగంటలో తిరిగి వస్తానని చెప్పింది అని అతను అంటాడు. దీంతో జ్ఞానాంబ కొంత అప్సెట్ అవుతుంది. ఇక మరోవైపు జానకి మర్డర్ కేసు విషయంలో ఎస్సై మనోహర్ పై తీవ్ర స్థాయిలో టెన్షన్ పడుతూ ఉంటాడు. దీంతో అతను జానకిని ఈ కేసులో ఇన్వాల్వ్ లేకుండా చేయాలి అని నేరస్తులేని తప్పించుకునేలా చేయాలి అని అనుకుంటాడు. కానీ జానకి మాత్రం పట్టు విడవకుండా ఆ విషయాన్ని ఎలాగైనా ఉన్నతాధికారులతో చర్చించాలి అని అంటుంది.

ఏప్రిల్ 13వ ఎపిసోడ్: రామ తప్పు లేదని నిరూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇప్పుడు రామచంద్ర ఇంటికి వెళ్లి ఒకసారి సెర్చ్ చేయాలి అని జానకితో అంటాడు. దీంతో ఎస్సై మనోహర్ మాటలకు జానకి ఆశ్చర్య పోతుంది. తప్పని పరిస్థితుల్లో అందరితో కలిసి జానకి వారి ఇంటికి వెళ్లడానికి ఒప్పుకుంటుంది.
అయితే మరోవైపు ఇంట్లో వాళ్ళందరూ కూడా శ్రీరాముల ఉత్సవాలకి వెళ్లడానికి సిద్ధంగా ఉంటారు. ఇక అప్పుడే జానకి పోలీస్ జీప్ నుంచి దిగుతూ ఉంటుంది. ఇక ఎస్సై మనోహర్ వారి కుటుంబం దగ్గరికి వచ్చి రామచంద్ర మదకద్రవ్యాలు అమ్ముతున్నాడు అని ఇతను చెప్పాడు అని అది ఎంతవరకు నిజమనే విషయం తెలుసుకోవాలని అనుకున్నట్లుగా ప్రశ్నిస్తాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ ఆవుతారు.
ఏప్రిల్ 14వ ఎపిసోడ్: ఒక్కసారిగా అత్తగారు ఆ విషయంలో సీరియస్ అవుతారు. అసలు ఈ సమస్యలన్నీ వచ్చింది నీ వల్లే నువ్వు ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుంటే ఇవన్నీ అసలు మాకు ఉండేవి కావు. అయినా నువ్వు ఐపిఎస్ చదువుతున్నావు కదా ఏం ఉపయోగం. అసలు ఏ నేరం చేయనటువంటి రామచంద్రను కూడా విడిపించలేకపోతున్నావు అతను నేరం చేయలేదు అనే విషయం నీకు బలంగా తెలుసు.
అయితే ఇప్పుడు జానకి మాటలు పట్టించుకోవద్దు అని ఎవరైనా లాయర్ ని చూస్తే బెటర్ అని జ్ఞానం చెబుతుంది. ఇక ఆ విషయంలో జానకి మామ గారితో మాట్లాడుతూ లాయర్ ను మాట్లాడుకుంటే మనకు కలిగే నష్టం ఎక్కువ అని నేను తప్పకుండా నా భర్తను బయటకు తీసుకొస్తాను అని చెబుతుంది.

ఏప్రిల్ 15వ ఎపిసోడ్: ఇక మరోవైపు ఇంట్లో జ్ఞానాంబ తన కొడుకును తలచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక గోవిందరాజులు వచ్చి జానకి విషయంలో నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని తను ఎన్నడూ కూడా తప్పు చేయదు అని మొన్నటి వరకు కూడా మన కుటుంబం కలిసే ఉండాలి అని అనుకున్న జానకిని నువ్వు తప్పు పట్టడం కరెక్ట్ కాదు అని చెబుతూ ఉంటాడు.
అంతేకాకుండా గతంలో నీ కిడ్నీ సమస్య ఎదురైనప్పుడు తన కిడ్నీ ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చింది అని చెబుతాడు. అయితే గతంలో అలా జరిగి ఉంటే కనుక నేను బ్రతికే ఉండే దాన్ని ఇంత విషయం తాగి చచ్చిపోయేదాన్ని అని జ్ఞానాంబ చెబుతూ ఉంటుంది. అంతేకాకుండా తన కిడ్నీ తనకు ఇవ్వండి అంటూ డాక్టర్లను వెళ్లి అడిగేదాన్ని అని జ్ఞానాంబ మరింత సీరియస్ అవుతుంది. మరి ఈ విషయంలో జానకి అత్త గారితో ఎలా ముందుకు సాగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











