Janaki Kalaganaledu Serial Weekly Roundup: ఉద్యోగం వలన మరింత ఇబ్బందుల్లో జానకి.. మరో షాకింగ్ ట్విస్ట్!
జానకి కలగనలేదు సీరియల్ ఏప్రిల్ మొదటి వారం మరింత ఆసక్తికరంగా కొనసాగింది. ఈ సీరియల్ మొదట్లో కాస్త బోరింగ్ గా అనిపించినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 21 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయి? అలాగే జానకి ఫ్యామిలీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం పదండి..
ఏప్రిల్ 17వ ఎపిసోడ్: ఇక జానకి కూడా వారిని చూసి లోపలికి వెళ్ళిపోతుంది. జానకి వారు అన్న మాటలను గుర్తుచేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక రామచంద్రను తలుచుకుంటూ ఉండడంతో అప్పుడే రామచంద్రం వచ్చినట్లుగా ఆమె ఊహిస్తుంది. రామచంద్ర తోనే ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ సరదాగా ఉన్నట్లుగా గ్రహిస్తుంది.

అయితే ఆ కలలో ఆమె రామచంద్ర ఒక ప్రశ్న అడుగుతాడు. నేను ఇష్టమా ఐపీఎస్ ఇష్టమా? అని అడగడంతో జానకి రెండు ఇష్టమే అని అంటుంది. కాదు ఒకటే చెప్పాలి అని రామ అడగడంతో అయితే రెండు చీటీలు వేస్తాను అని అప్పుడు సమాధానం మీరే ఒకటి తీసి సమాధానం చెప్పాలి అని జానకి అంటుంది. మరి రామచంద్ర ఎలాంటి సమాధానం చెబుతాడో చూడాలి.
ఏప్రిల్ 18వ ఎపిసోడ్: మీరు తప్పు చేస్తున్నారా అనే విషయం మీకు అర్థం కావడం లేదా అని అడగడంతో.. నా ప్రాణం మీదికి వస్తే నేను ఎంతవరకైనా వెళ్తాను అని నువ్వు వెంటనే మీ నిర్ణయాన్ని చెప్పకపోతే మరింత సీరియస్ అవుతాను అని అంటాడు. ఇక జానకి మళ్ళీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటుంది ఇంకా నువ్వు ఇచ్చిన టైం అయిపోలేదు అని చెప్పి ఆమె ఫోన్ పెట్టేస్తుంది.
ఇక మరోవైపు అఖిల్ భార్య జెస్సి అనుకున్నట్లే తన భర్తకు బుద్ధి చెప్పాలని అనుకుంటుంది. కానీ అఖిల్ మాత్రం ఇదంతా జానకి వల్లే జరుగుతోంది అని ఇంట్లో నాకు ప్రశాంతత లేదు అని అసలు నేను మా అమ్మ కడుపులోనే పుట్టానా లేదంటే బయట నుంచి తీసుకొచ్చారా అంటూ మాట్లాడుతాడు. మరి ఈ విషయంలో జానకి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.

ఏప్రిల్ 19వ ఎపిసోడ్: దీంతో ఎస్సై మనోహర్ మరింత కోపానికి లోనై రామచంద్ర మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మరొక కానిస్టేబుల్ కు చెబుతాడు. ఇక జానకి అప్పుడే పోలీస్ స్టేషన్ లోకి వస్తుంది. విషయం తెలుసుకోగానే మరి కొంత సమయం కావాలి అని ఎస్ఐ మనోహర్ ను బ్రతిమాలుతుంది. అంతేకాకుండా డ్రగ్స్ విషయంలో రామచండ్రను ఇరికించిన మరో నేరస్తుడిని కూడా ఆమె బ్రతిమాలుతుంది. నువ్వు నిజం చెప్పు.. నాకు టైం లేదు రామచంద్ర గారు మళ్ళీ మరింత కష్టాల్లో పడతారు అని అతనిని బ్రతిమాలుకుంటుంది.
ఇక మనోహర్ వచ్చి ఇలా బ్రతిమాలుకుంటే పనులు అవ్వవు అని నేను చెప్పినట్లుగా చేస్తే రామచంద్ర బయటకు వస్తాడు అని బిల్డర్ మనోహర్ చెప్పినట్లుగా కేసును వదిలేసి మీ పోలీసు యూనిఫాంలో కూడా వదిలేసి వెళ్ళిపోతే బాగుంటుంది అని చెబుతాడు. ఇక ఆ విషయంలో జానకి మరోసారి ఆలోచనలో పడుతుంది. ఇక ఇంట్లో మల్లిక విష్ణు మధ్యలో కూడా కొంత గొడవలు జరుగుతాయి. మరి ఈ పరిస్థితుల నడుము జానకి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఏప్రిల్ 20వ ఎపిసోడ్: మల్లిక అనుమానం: అయితే ఈ కేసు విషయంలో మీ పెద్ద కోడలు గట్టిగా పూజలు చేయాలి అని అర్థమైందా జానకి అంటూ మనోహర్ ఇన్ డైరెక్ట్ గా చెబుతూ ఉంటాడు. ఇక తండ్రి ఎక్కువసేపు అక్కడ ఉండడం మంచిది కాదు అని రామచంద్ర ఆయనను ఇంటికి వెళ్ళిపోమని చెబుతూ ఉంటాడు. అలాగే జానకిని కూడా తీసుకు వెళ్ళమని అంటాడు. ఈ క్రమంలో ఇంట్లో మరోవైపు భర్త కోసం జ్ఞానాంబ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది.
అయితే పోలీస్ స్టేషన్లో జరిగిన విషయం గురించి అసలు ఏమాత్రం మీ అత్తయ్య గారికి చెప్పకు అని కోడలు జానకి దగ్గర గోవిందరాజులు మాట తీసుకుంటాడు. ఇక రాగానే జ్ఞానాంబ కొడుకు విషయం గురించి ఏం మాట్లాడారు అని? రామచంద్ర ఇంకా రాలేదా అని అడుగుతుంది. అయితే గోవిందరాజులు అసలు నిజం చెప్పకుండా ఎస్ఐ గారు రాగానే బాగా మర్యాద చేశారు అని మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే మల్లిక వచ్చి వీరు మాట్లాడుతున్న విధానం చూస్తుంటే అక్కడ పని జరగలేదని అనిపిస్తుంది అని అనుమానం వ్యక్తం చేస్తుంది. మరి ఆమె మాటలకు జానకి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

ఏప్రిల్ 21వ ఎపిసోడ్: ఇక జానకి విషయం ఎంతవరకు వచ్చింది అని బిల్డర్ మధుకర్ ఎస్ఐ మనోహర్ కు ఫోన్ చేస్తూ ఉంటాడు. అంతా సెట్ అయిపోయింది అని మనోహర్ చెప్పినప్పటికీ కూడా ఆమె అంత ఈజీగా లొంగదు అని అనడంతో తప్పకుండా నేను ఇంకో డోస్ ఇస్తాను అని ఎస్ఐ చెబుతాడు.
ఇక జానకి తన భర్త కోసం భోజనం తీసుకుని రాగానే ఎస్సై మనోహర్ అడ్డుపడి ఇదేమైనా మీ బెడ్ రూమ్ అనుకుంటున్నావా నీ ఇష్టం వచ్చినప్పుడు భోజనం తీసుకొచ్చి పెట్టడానికి అనే కామెంట్ చేస్తూ ఉంటాడు. ఇక ఆ విషయంలో రామచంద్ర కూడా ఎస్ఐ మాటలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. మరి ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.


Click it and Unblock the Notifications











