Janaki Kalaganaledu Serial Weekly Roundup: మర్డర్ కేసుతో జానకి ఒంటరి పోరాటం.. అత్తింట్లో అవమానాలు!

జానకి కలగనలేదు సీరియల్ ఏప్రిల్ మొదటి వారం మరింత ఆసక్తికరంగా కొనసాగింది. ఈ సీరియల్ మొదట్లో కాస్త బోరింగ్ గా అనిపించినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది.

ఇక గత వారం మొత్తం కూడా అంటే ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 7 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయి? అలాగే జానకి ఫ్యామిలీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం పదండి..

Janaki Kalaganaledu Weekly Roundup: 2023 april 3rd to april 7th Episode

ఏప్రిల్ 3వ ఎపిసోడ్: జానకి అలా చేయడంతో మల్లిక ఇంట్లో వాళ్లకి కోపం వచ్చేలా మాట్లాడుతూ ఉంటుంది. నేను అప్పటికి చెబుతూనే ఉన్నాను ఈ పోలీస్ ఉద్యోగం కూడా వద్దు అని కానీ జానకి ఇంట్లో కూడలి బాధ్యతలు మర్చిపోయి ప్రవర్తిస్తుంది అన్నట్లుగా ఆమె మాట్లాడుతూ ఉంటుంది. ఇక వెంటనే జానకి రాగానే ఏదో ఒకటి తేల్చేలా మాట్లాడాలి అని తన మామగారికి అత్తగారికి చెబుతూ ఉంటుంది.

ఇక జానకి రాగానే అత్తగారు కూడా నువ్వు చేసిన పని ఏమాత్రం బాగోలేదు. పరువు పోయే అవకాశం ఉంది అని చెబుతుంది. దీంతో జానకి మొదట ఆ తిట్టిన వ్యక్తికి హెచ్చరిక ఇవ్వాలి అని అనుకుంటుంది. కానీ అత్తగారు చెప్పిన మాటలకు ఏమి మాట్లాడకుండా తప్పు జరిగిందని క్షమించండి అంటూ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది.

ఏప్రిల్ 4వ ఎపిసోడ్: మల్లికా ఎంత చెప్పినా కూడా విష్ణు ఆమె మాటలు పట్టించుకోకుండా పిల్లలు ఉండి ఏం లాభం అని ఇప్పుడు మా అమ్మ నాన్నలను మేము ఏమైనా సరిగ్గా చూసుకుంటున్నామా అని ఆమెకు సమాధానం చెబుతాడు. దీంతో మల్లికా వెంటనే అందరి పరిస్థితిలు అలా ఉండవు అని చెబుతుంది.

ఇక ఆ తర్వాత విష్ణు మాటలకు ఆమె పట్టించుకోకుండా బయటకు వెళ్ళిపోతుంది. అయితే మరోవైపు చిన్న కోడలు జెస్సి తన బాబును ఇంట్లో ఆడిస్తూ ఉంటుంది. ఇక బాబు ఏడుస్తూ ఉండడంతో లోపలికెళ్ళి పాలు తీసుకురావాలని అనుకుంటుంది. అయితే ఆమె ముందుగా డబ్బాలో పూసుకొచ్చిన పాలు విరిగిపోతాయి.

Janaki Kalaganaledu Weekly Roundup: 2023 april 3rd to april 7th Episode

ఏప్రిల్ 5వ ఎపిసోడ్: మరోవైపు జానకి తన పోలీస్ డ్యూటీలో చాలా బిజీగా ఉంటుంది. ఇక మొత్తానికి ఎస్ఐ మనోహర్ చెప్పిన చోటికి ఫైల్ తీసుకొని వెళుతుంది. పక్కనే ఉన్న బిల్డింగ్ పై ఫ్లోర్ కి రావాలి అని చెప్పడంతో జానకి మెట్లు ఎక్కుకుంటూ పైకి వెళుతుంది. జానకి మూడో ఫ్లోర్ కి రాగానే అక్కడ ఒక మర్డర్ జరుగుతుంది. ఒక వ్యక్తి కత్తితో మరో వ్యక్తిని పొడవడం జానకి చూస్తుంది.

వెంటనే ఎస్ఐ కి ఫోన్ చేసి అసలు విషయం చెబుతుంది. అయితే మర్డర్ చేసిన వ్యక్తిని తాను చూసాను అని అతను మరెవరు కాదు అని మీకు బాగా తెలిసిన వ్యక్తి బిల్డర్ మధు అని జానకి చెబుతుంది దీంతో ఒక్కసారిగా మనోహర్ కూడా షాక్ అవుతాడు. అయితే ఈ విషయాన్ని బయటకు ఎవరికి చెప్పవద్దు అని వెంటనే ఆంబులెన్స్ కి ఫోన్ చేసి అతన్ని హాస్పిటల్ కు తీసుకు వెళ్లాలని అంటాడు. అంతే కాకుండా ఈ విషయం ఎక్కడ లీక్ చేయకూడదని అంటాడు

ఏప్రిల్ 6వ ఎపిసోడ్: జానకి కూడా ఆ భార్య పిల్లలకు ఏదైనా న్యాయం చేయాలి అని ఎస్ఐ మనోహర్ కు చెబుతుంది. తప్పకుండా విషయాలన్నీ నేను చూసుకుంటాను అని నువ్వు స్టేషన్ కి వెళ్ళు అని మనోహర్ చెబుతాడు. దీంతో జానకి సైలెంట్ గా నడుచుకుంటూ బయటకు వస్తుంది. ఇంతలో రామచంద్ర వచ్చి అసలు విషయం తెలుసుకుంటాడు. అయితే ఒక కానిస్టేబుల్ గా నేను వాళ్లకు ఏమి చేయలేను అని ఎస్ఐ గారు సపోర్ట్ చేస్తేనే వారికి న్యాయం జరుగుతుంది అని జానకి చెబుతుంది.

ఇక మీకు మాత్రం నేను ఏ విషయంలోనైనా సరే అండగా ఉంటాను అని రామచంద్ర చెబుతాడు. ఇక జానకి హత్య చేసిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అనుకుంటుంది కానీ మనోహర్ మాత్రం అందుకు ఒప్పుకోవడం పోలీస్ సాక్ష్యం ఎంత మాత్రం చెల్లదు అని ఏదైనా బలమైన సాక్షాదారాలు కావాలి అని అంటాడు

Janaki Kalaganaledu Weekly Roundup: 2023 april 3rd to april 7th Episode

ఏప్రిల్ 7వ ఎపిసోడ్: విష్ణు కూడా తన భార్య మాట ప్రకారం మాట్లాడాలని అనుకుంటాడు. రామచంద్ర పిలిచి అడగగానే అతను తన దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు అని అంటాడు. అయితే వారం లేదా పది రోజుల సమయం తీసుకొని డబ్బు సమకూర్చే పని చేయాలి అని అంటాడు. కానీ తన దగ్గర లేవు అని కుదరదు అని సమాధానం ఇస్తూ ఉంటాడు. అలాగే మల్లికా కూడా మరో మాటతో డబ్బులు లేవు అని చెబుతుంది. ఇక ఇంతలో కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి వస్తారు.

అయినా పోయిన షాపును ఎలా వెనక్కి తీసుకురావాలో అని ఆలోచించకుండా ఇప్పుడు మా వెనకాల డబ్బు కోసం పడితే ఏం బాగుంటుంది అని మల్లిక ఊహించని విధంగా మాట్లాడుతుంది. దీంతో రామచంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X