Janaki Kalaganaledu Serial Weekly Roundup: జానకి ఆలోచనతో మళ్ళీ సెట్టయిన ఫ్యామిలీ.. రామ రొమాన్స్!
జానకి కలగనలేదు సీరియల్ ఫిబ్రవరి మూడవ వారం మరింత ఆసక్తికరంగా కొనసాగింది. ఈ సీరియల్ మొదట్లో కాస్త బోరింగ్ గా అనిపించినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే ఫిబ్రవరి 13 నుంచి ఫిబ్రవరి 18 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయి? అలాగే జానకి ఫ్యామిలీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం పదండి..

ఫిబ్రవరి 13వ ఎపిసోడ్
జానకి మరుసటి రోజు కాలేజీకి వెళ్లి అక్కడ దేవుడిని తలుచుకుంటూ ఈ బాధలు అన్నీ కూడా తొందరగా తొలగిపోయి అందరూ మళ్ళీ కలిసి ఉండేలా చూడాలని ఆ భగవంతుడిని కోరుకుంటుంది. ఇక ఇంతలోనే జానకి స్నేహితురాలు వచ్చి ఆమెతో మాట్లాడుతూ ఉంటుంది.
అలాగే తన అన్నయ్యకు ఒక ఉద్యోగం వచ్చింది అని సంతోషంగా చెబుతూ 20 లక్షలు కడితే మూడు నెలల్లోనే ఆ డబ్బు వెనక్కి వచ్చేలా చేస్తారని ఆఫర్ ఇచ్చారని ఆమె అంటుంది. అంతే కాకుండా భాగస్వామ్యలుగా చేసుకుంటారు అని కూడా చెప్పడంతో వెంటనే జనకికి, రామచంద్రకు జరిగిన మోసం గురించి తెలుస్తుంది.
అఖిల్ విషయంలో రామచంద్ర కూడా అలాగే డబ్బు కట్టి మోసపోయాడు. బహుశా ఆ మోసం చేసిన వ్యక్తి అయ్యి ఉంటాడు అని జానకి గ్రహిస్తుంది

ఫిబ్రవరి 14వ ఎపిసోడ్
మరోవైపు మల్లిక యూట్యూబ్లో వంటలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేయగా వాటికి వచ్చిన కామెంట్స్ గురించి మలయాలంతో చెబుతూ ఉంటుంది. అయితే అతనికి అన్ని అబద్ధాలు చెబుతూ ఉండడంతో ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే చక్రాల బండి తీసుకొని రామ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక మల్లిక, రామచంద్రను అవమానించే విధంగా మాట్లాడుతూ ఉంటుంది.
జానకి కూడా ఆమెకు కౌంటర్ గట్టిగానే ఇస్తుంది. ఇక రామచంద్ర ఇంట్లోకి రాగానే తండ్రిని ఒక ప్రశ్న అడుగుతాడు. మీరు మళ్ళీ గుమస్తాగా పనిచేయడానికి ఒప్పుకున్నారా అని అడుగుతాడు. ఖాళీగా ఉంటే ఏమి తోచడం లేదు అని అందుకే ఏదైనా ఒక పని చేద్దామని అనుకుంటున్నాట్లుగా చెబుతాడు. అందుకు జానకి మీరు ఏ పని చేయకూడదు అని మీ కష్టాలను తీర్చడంతో పాటు మిమ్మల్ని ఆనందంగా చూసుకోవడం కూడా మా బాధ్యతని జానకి మాట్లాడుతుంది.

ఫిబ్రవరి 15వ ఎపిసోడ్
ఇంట్లో ఎవరు వెళ్ళిపోకుండా మా కళ్ళ ముందు ఉంటే చాలు అని ఆమె కోరుకుంటుంది. అయితే తల్లి అలా చెప్పడంతో రామచంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. అందరూ కలిసి ఉండాలని ముందు అనుకున్నాము కదా అని తల్లిని అడుగుతాడు. కానీ నా నిర్ణయం ఈ విషయంలో మారదు అని చెప్పేసి ఆమె వెళ్ళిపోతుంది.
ఇక తల్లి ఆ విధంగా ఎందుకు మాట్లాడింది అని రామచంద్ర ఆలోచనలో పడతాడు. జానకి కూడా అత్తగారిని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని కోరుతుంది. కానీ ఆమె వినకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక అత్తగారు ఇలా ఎందుకు చేశారు అనే విషయంలో జానకి ఆలోచిస్తుంది.

ఫిబ్రవరి 16వ ఎపిసోడ్
మరోవైపు మూడవ కొడుకు విష్ణు మళ్ళీ పాత ఇంట్లోకి వచ్చినందుకు చాలా బాధపడుతూ ఉంటాడు. కరెక్ట్ సమయంలో బయటకు వెళ్లిపోతూ ఉండగా ఈ జానకి వదిన కారణంగా మళ్ళీ ఇంట్లో వచ్చి పడాల్సి వచ్చింది అని కోపంతో ఉంటాడు. ఇక అతని భార్య జెస్సి మాత్రం వదిన ఏం చేసినా కూడా మనం మంచి గురించి ఆలోచించి చేస్తుంది కదా ఎందుకు అలా మాట్లాడతావు అని అంటుంది. కానీ అఖిల్ మాత్రం మొదటినుంచి కూడా జానకి పై కోపం తెప్పించుకుంటూ ఉంటాడు.
ఆమె ఇంట్లో కాలు పెట్టినప్పుడు నుంచి కూడా నాకు మనశ్శాంతి లేకుండా పోయింది ఇష్టం లేకపోయినా నాకు ఈ పెళ్లి చేసింది ఇక అప్పటినుంచి నేను సంతోషంగా లేను అని భార్యతో చెబుతాడు. నువ్వు చేసిన తప్పు కారణంగా అక్కను తిట్టడం కరెక్ట్ కాదు అని జెస్సి కూడా అంటుంది

ఫిబ్రవరి 17వ ఎపిసోడ్
ఇప్పుడే మన కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది. ఇప్పుడు మళ్ళీ అనవసరం ఖర్చులు ఉండకూడదు అని చెబుతతుంది. మనకు ఉన్నతలో బాగా చేసుకుందామని జానకి చెబుతుంది. అదే తరహాలో ముగ్గురు కొడుకులు కూడా తండ్రికి చెబుతూ ఉంటారు. ఇక మొత్తానికి ముగ్గురు మాటలతో ఒప్పిస్తుంటారు. తల్లిదండ్రులు పిల్లల ప్రేమకు ఎదురు సమాధానం చెప్పలేక మొత్తానికి ఒప్పుకుంటారు.
ఇక ఆ విషయంలో మేమే గెలిచాము అంటూ జానకి తో పాటు మల్లికా కూడా వారి భర్తలపై నెగ్గేందుకు మాట్లాడుతూ ఉంటారు. విష్ణు తో పాటు అఖిల్ కూడా చెబుతూ ఉంటాడు. మొత్తానికి మళ్ళీ అందరూ సంతోషంగా ఉండడంతో రామచంద్ర హ్యాపీగా ఫీల్ అవుతాడు.

ఫిబ్రవరి 18వ ఎపిసోడ్
ముందుగా మల్లికా ఆమె భర్త విష్ణు ఇద్దరు కూడా డాన్స్ చేయాలి అని అందరూ చెబుతారు. ఇక వారి కోరిక మేరకు ఆ దంపతులు డాన్స్ చేస్తూ ఉంటారు. ఇక తర్వాత గోవిందరాజులు జ్ఞానాంబ ఇద్దరూ కలిసి ఆనందంగా డాన్స్ చేస్తూ ఉంటారు. ఇక డాన్స్ చేసిన అనంతరం అందరూ ఒకే దగ్గర కూర్చుని ఆనందంగా భోజనాలు చేస్తూ ఉంటారు.
ఇక భోజనాలు చేసిన తర్వాత జానకి చేయి కడుక్కోవడానికి వెళుతూ ఉండగా ఒక్కసారిగా ఆమె కళ్ళు తిరిగి పడిపోబోతుంది. అయితే వెనకాలే ఉన్న అత్తగారు ఆమెను పట్టుకుంటారు. అంతా హఠాత్తుగా జానకి ఎందుకు పడిపోతుంది. అసలు ఏం జరిగింది అనే వివరాలు తెలియాలి అంటే తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.


Click it and Unblock the Notifications











