Janaki Kalaganaledu Serial Weekly Roundup: అతిపెద్ద నిజాన్ని దాస్తున్న జానకి.. గుండెల్లో బాధను బరిస్తూ..

జానకి కలగనలేదు సీరియల్ ఫిబ్రవరి 4వ వారం మరింత ఆసక్తికరంగా కొనసాగింది. ఈ సీరియల్ మొదట్లో కాస్త బోరింగ్ గా అనిపించినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది.

ఇక గత వారం మొత్తం కూడా అంటే ఫిబ్రవరి 20 నుంచి ఫిబ్రవరి 24 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయి? అలాగే జానకి ఫ్యామిలీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం పదండి..

ఫిబ్రవరి 20వ ఎపిసోడ్

ఫిబ్రవరి 20వ ఎపిసోడ్

మరోవైపు మల్లిక యూట్యూబ్లో వంటలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేయగా వాటికి వచ్చిన కామెంట్స్ గురించి మలయాలంతో చెబుతూ ఉంటుంది. అయితే అతనికి అన్ని అబద్ధాలు చెబుతూ ఉండడంతో ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే చక్రాల బండి తీసుకొని రామ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక మల్లిక, రామచంద్రను అవమానించే విధంగా మాట్లాడుతూ ఉంటుంది.

జానకి కూడా ఆమెకు కౌంటర్ గట్టిగానే ఇస్తుంది. ఇక రామచంద్ర ఇంట్లోకి రాగానే తండ్రిని ఒక ప్రశ్న అడుగుతాడు. మీరు మళ్ళీ గుమస్తాగా పనిచేయడానికి ఒప్పుకున్నారా అని అడుగుతాడు. ఖాళీగా ఉంటే ఏమి తోచడం లేదు అని అందుకే ఏదైనా ఒక పని చేద్దామని అనుకుంటున్నాట్లుగా చెబుతాడు. అందుకు జానకి మీరు ఏ పని చేయకూడదు అని మీ కష్టాలను తీర్చడంతో పాటు మిమ్మల్ని ఆనందంగా చూసుకోవడం కూడా మా బాధ్యతని జానకి మాట్లాడుతుంది.

ఫిబ్రవరి 21వ ఎపిసోడ్

ఫిబ్రవరి 21వ ఎపిసోడ్

ఆ విషయాన్ని రామచంద్ర కు అలాగే ఇంట్లో ఎవరికి కూడా చెప్పకూడదని డాక్టర్ దగ్గర ను ఆమె బ్రతిమాలుతుంది. అయితే మీరే మెల్లగా చెప్పండి అని డాక్టర్ చెప్పడంతో జానకి ఈడ్చుకుంటూ ఇంటికి వెళుతుంది. అయితే అక్కడ ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. మళ్ళీ ఆ రిపోర్ట్స్ ఎవరి కంట పడకూడదు అని జానకి జాగ్రత్త పడుతుంది. అత్తగారు రిపోర్ట్స్ గురించి అడిగినప్పటికీ కూడా ఏమీ లేదు అని అంత సవ్యంగానే ఉంది అని జానకి అబద్ధం చెబుతుంది. ఇక రామచంద్రను గదిలోకి తీసుకువచ్చి జానకి నిజం చెప్పాలని అనుకుంటుంది.

కానీ అతను తల్లి పై ఉన్న ప్రేమను ఎమోషనల్ గా చూపించడంతో జానకి మళ్ళీ వెనుకడుగు వేస్తుంది. తన స్నేహితుడి వాళ్ళ అమ్మ ఇటీవల చనిపోయింది అని అతని స్థానంలో నేను ఉంటే ఎప్పుడో చనిపోయే వాడిని అని చెబుతాడు. దీంతో జానకి ఆ విషయాన్ని చెప్పడానికి మళ్లీ వెనకడుగు వస్తుంది.

ఫిబ్రవరి 22వ ఎపిసోడ్

ఫిబ్రవరి 22వ ఎపిసోడ్

ఇంట్లో మలయాళం అందరికీ పనిచేస్తున్నాడు కాబట్టి అతడికి డబ్బులు మీరు కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అని చెబుతాడు. కానీ మల్లిక మాత్రం మేము అతన్ని తీసుకురాలేదు అని మీరే తీసుకువచ్చారు అని అయినా మా పనులు మేమే చేసుకుంటున్నాము అన్నట్లుగా మాట్లాడుతుంది. ఇక గోవిందరాజులు మాత్రం ఈ ఇంట్లో ప్రతి దాంట్లో కూడా అందరికీ భాగం ఉంది కాబట్టి ప్రతి నెల కూడా అందరూ కలిసి 20,000 ఇవ్వాల్సిందేనని గోవిందరాజులు చెబుతాడు. ఇక అఖిల్ విష్ణు మల్లికా అలోచిస్తారు.

అలా కాకుంటే ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకుంటే మరింత ఎక్కువ ఖర్చు వస్తుంది అని గోవిందరాజులు భయపెట్టడంతో ఆ తర్వాత మళ్ళీ అతని మాటలకు ఒప్పుకుంటారు. ఇక రామచంద్ర మాత్రం మేము అప్పులు పంచుకోమని ప్రేమను మాత్రమే పంచుకుంటాము అని చెబుతాడు. దీంతో ఆ మాటలకు తల్లి ఎంతగానో ఆనందపడుతుంది. ఇక ఆ తర్వాత జానకి రామచంద్ర తో కలిసి బయటకు వెళుతూ ఉండగా డాక్టర్ ను కలవాలని అనుకుంటుంది.

ఫిబ్రవరి 23వ ఎపిసోడ్

ఫిబ్రవరి 23వ ఎపిసోడ్

జ్ఞానాంబకు మాత్రం ఆ విషయం చాలా క్లారిటీకి అర్థమవుతుంది. నువ్వు ఇష్టమొచ్చింది చేసుకొని తినవచ్చు అని ఇక్కడ నిన్ను ఎవరు ఏమీ అనరు అని అంటుంది. దీంతో మల్లిక వెళ్లి హ్యాపీగా దాన్ని తినాలని అనుకుంటుంది. కానీ తిలోత్తమ వచ్చి ఆమెను తిననీయకుండా చేస్తుంది. ఏదో ఒక పని చెప్పి తీవ్ర స్థాయిలో కష్టపెడుతూ ఉంటుంది. ఇక మరోవైపు రామచంద్ర తన స్వీట్ బండి దగ్గర ఉండగా ఒక బ్యాంక్ రికవరీ వ్యక్తి వచ్చి మీ తమ్ముడు ఇంకా షాప్ డబ్బులు కట్టలేదు అని చెబుతాడు. దీంతో రామచంద్ర ఆశ్చర్యపోతాడు.

అసలు తమ్ముడికి షాపు లేదు కదా ఇప్పుడు ఉన్నది కూడా సొంతం కాదు అని చెప్పాడు. మరి బ్యాంక్ రికవరీ అతను ఇలా అంటాడు ఏమిటి అని ఆశ్చర్యపోతాడు. ఇక తర్వాత సొంతంగానే వాళ్ళు షాప్ పెట్టుకున్నట్లు గ్రహిస్తాడు.

ఫిబ్రవరి 24వ ఎపిసోడ్

ఫిబ్రవరి 24వ ఎపిసోడ్

వెన్నెల జానకి చెప్పినట్లుగా తల్లికి టాబ్లెట్ ఇవ్వాలని అనుకుంటుంది. అయితే జ్ఞానాంబ మాత్రం ఇన్ని టాబ్లెట్లు నేను ఎందుకు వేసుకోవాలి అని నేను ఏమీ అనారోగ్యానికి గురికాలేదు అని చెబుతోంది. అయినప్పటికీ కూడా జానకి చెప్పింది కాబట్టి వేసుకోవాలి అని గోవిందరాజులు అంటాడు. అయినా కూడా ఎప్పుడు ఇన్ని టాబ్లెట్స్ వేసుకోలేదు అని కూడా అతను గ్రహిస్తాడు.

ఇక అప్పుడే ఇంట్లోకి ప్రభుత్వ హాస్పిటల్ నుంచి వచ్చిన కొందరు సర్వేలో భాగంగా మీ కుటుంబం ఆరోగ్యంగా ఉందా లేదా అనే విషయం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాట్లుగా చెబుతారు. దీంతో అప్పుడే జ్ఞానాంబ జానకి ఇచ్చిన టాబ్లెట్స్ ఎందుకో తెలుసుకోవాలి అని ఇంటికి వచ్చిన డాక్టర్ కు ఇస్తుంది. అయితే జానకి ఆ డాక్టర్ కు సైగ చేసి నిజం చెప్పవద్దు అని అంటుంది. ఇక అంతే కాకుండా తర్వాత జానకి డాక్టర్ తో మాట్లాడుతుండడం రామచంద్ర చూస్తాడు. మరి ఈ విషయంలో రామచంద్ర జానకిని ఏ విధంగా ప్రశ్నిస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X