Janaki Kalaganaledu Serial Weekly Roundup: అత్తగారి ప్రాణాల కోసం జానకి త్యాగం.. కథలో మరో ట్విస్ట్

జానకి కలగనలేదు సీరియల్ మార్చి మొదటి వారం మరింత ఆసక్తికరంగా కొనసాగింది. ఈ సీరియల్ మొదట్లో కాస్త బోరింగ్ గా అనిపించినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే ఫిబ్రవరి 28 నుంచి మార్చి 4 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయి? అలాగే జానకి ఫ్యామిలీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం పదండి..

ఫిబ్రవరి 28వ ఎపిసోడ్

ఫిబ్రవరి 28వ ఎపిసోడ్

అయితే అందుకు గోవిందరాజులు జ్ఞానాంబ మాట్లాడి తప్పకుండా పంపిస్తాను అని అంటాడు. అయితే జ్ఞానాంబ మాత్రం అందుకు ఒప్పుకోదు. ఇంట్లో ఎవరూ కూడా బయటకు వెళ్లడానికి వీలులేదు అని జెస్సీ కడుపులో పెరుగబోయే బిడ్డ మన ఇంటికి మొదటి వారసుడు అని అయితే అతను ఇంట్లోనే జన్మించాలి అని జ్ఞానాంబ కండిషన్ పెడుతుంది. ఇక జ్ఞానాంబ అలా ఎందుకు మాట్లాడుతుందో గోవిందరాజుకు అర్థం కాదు. ఇక జానకి బయటకు వెళ్లి అత్తగారి గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది. అయితే అప్పుడు రామచంద్ర వస్తాడు. తనకు కూడా ఏమీ అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉంటాడు.

ఇక జానకి ఎలాగైనా అత్తగారిని నేను బ్రతికించుకుంటాను అని నాకు ఆమె కంటే ఏది ఎక్కువ కాదు అని కిడ్నీ డొనేషన్ గురించి మాట్లాడుతుంది. కానీ రామచంద్ర మాత్రం అందుకు ఒప్పుకోడు. మా అమ్మ కోసం మీ లక్ష్యాన్ని ప్రాణాలను పణంగా పెట్టడం నాకు ఇష్టం లేదు అని అంటాడు

 మార్చి 1వ ఎపిసోడ్

మార్చి 1వ ఎపిసోడ్

ఆ విషయాన్ని రామచంద్ర కు అలాగే ఇంట్లో ఎవరికి కూడా చెప్పకూడదని డాక్టర్ దగ్గర ను ఆమె బ్రతిమాలుతుంది. అయితే మీరే మెల్లగా చెప్పండి అని డాక్టర్ చెప్పడంతో జానకి ఈడ్చుకుంటూ ఇంటికి వెళుతుంది. అయితే అక్కడ ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. మళ్ళీ ఆ రిపోర్ట్స్ ఎవరి కంట పడకూడదు అని జానకి జాగ్రత్త పడుతుంది. అత్తగారు రిపోర్ట్స్ గురించి అడిగినప్పటికీ కూడా ఏమీ లేదు అని అంత సవ్యంగానే ఉంది అని జానకి అబద్ధం చెబుతుంది.

ఇక రామచంద్రను గదిలోకి తీసుకువచ్చి జానకి నిజం చెప్పాలని అనుకుంటుంది. కానీ అతను తల్లి పై ఉన్న ప్రేమను ఎమోషనల్ గా చూపించడంతో జానకి మళ్ళీ వెనుకడుగు వేస్తుంది. తన స్నేహితుడి వాళ్ళ అమ్మ ఇటీవల చనిపోయింది అని అతని స్థానంలో నేను ఉంటే ఎప్పుడో చనిపోయే వాడిని అని చెబుతాడు.

మార్చి 2వ ఎపిసోడ్

మార్చి 2వ ఎపిసోడ్

జ్ఞానాంబ మాత్రం జానకి మాటలను పట్టించుకోకుండా నువ్వు నా కోసం త్యాగం చేయొద్దు. అంతేకాకుండా నువ్వు నాకు మనవడిని ఇవ్వాలి అని జానకిని ప్రత్యేకంగా ముస్తాబు చేస్తుంది. అంతేకాకుండా ఆమెను రామచంద్ర గదిలోకి పాలతో పంపిస్తుంది. ఇక మల్లెపూలు తెల్ల చీరతో జానకి గదిలోకి వెళుతుంది. మరోవైపు జ్ఞానాంబ తీరుని చూసిన గోవిందరాజులు నీకు ఏమయ్యింది ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని అంటాడు. ముహూర్తాలు చూడకుండా ఎందుకు ఇలా చేశావు అని అంటాడు.

కానీ జ్ఞానాంబ దీనికి ముహూర్తంతో సంబంధం లేదని నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి అని ఎమోషనల్ గా మాట్లాడుతుంది. ఇక రోజులు దగ్గర పడే కొద్ది బాధ్యతలు తీర్చుకోవాలి కదా అని జ్ఞానాంబ మాట్లాడడంతో గోవిందరాజులుకు అనుమానం వస్తుంది.

మార్చి 3వ ఎపిసోడ్

మార్చి 3వ ఎపిసోడ్

జ్ఞానాంబకు మాత్రం ఆ విషయం చాలా క్లారిటీకి అర్థమవుతుంది. నువ్వు ఇష్టమొచ్చింది చేసుకొని తినవచ్చు అని ఇక్కడ నిన్ను ఎవరు ఏమీ అనరు అని అంటుంది. దీంతో మల్లిక వెళ్లి హ్యాపీగా దాన్ని తినాలని అనుకుంటుంది. కానీ తిలోత్తమ వచ్చి ఆమెను తిననీయకుండా చేస్తుంది. ఏదో ఒక పని చెప్పి తీవ్ర స్థాయిలో కష్టపెడుతూ ఉంటుంది. ఇక మరోవైపు రామచంద్ర తన స్వీట్ బండి దగ్గర ఉండగా ఒక బ్యాంక్ రికవరీ వ్యక్తి వచ్చి మీ తమ్ముడు ఇంకా షాప్ డబ్బులు కట్టలేదు అని చెబుతాడు.

దీంతో రామచంద్ర ఆశ్చర్యపోతాడు. అసలు తమ్ముడికి షాపు లేదు కదా ఇప్పుడు ఉన్నది కూడా సొంతం కాదు అని చెప్పాడు. మరి బ్యాంక్ రికవరీ అతను ఇలా అంటాడు ఏమిటి అని ఆశ్చర్యపోతాడు. ఇక తర్వాత సొంతంగానే వాళ్ళు షాప్ పెట్టుకున్నట్లు గ్రహిస్తాడు.

మార్చి 4వ ఎపిసోడ్

మార్చి 4వ ఎపిసోడ్

ఇక రామచంద్ర ఇంటికి ఎంతో సంతోషంగా వచ్చినట్లుగా చిన్న కోడలు మల్లిక కల కంటుంది. అతను వచ్చి ఇంట్లో వాళ్లందరికీ కూడా జానకి పాస్ అయినట్లుగా చెప్పి సంతోషంగా ఉంటాడు అని అనుకుంటుంది. అంతే కాకుండా ఊళ్ళో వాళ్ళందరూ కూడా జానకిపై ప్రశంసలు కురిపిస్తూ ఆమెకు గౌరవంగా సన్మాన సభను కూడా సిద్ధం చేసినట్లుగా మల్లికకు అనిపిస్తుంది.

ఇక ఆ తర్వాత వెంటనే ఆమె ఊహ నుంచి బయటకు వచ్చి షాక్ అవుతుంది. వామ్మో నిజంగా జానకి ఈ పరీక్ష పాస్ అయితే నన్ను చాలా తిడతారు అని అనుకుంటుంది. ఇక రామచంద్ర పెద్దగా హడావిడి లేకుండా ఇంట్లోకి వస్తాడు.

పరీక్ష ఫలితాలు వచ్చాయా తండ్రి గోవిందరాజులు అడుగుతాడు. కానీ ఇంకా రాలేదు అని ప్రిన్సిపాల్ గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి చెబుతాను అని చెప్పినట్లుగా రామచంద్ర చెబుతాడు. ఇక ఆ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నట్లు కూడా అందరూ చెబుతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X