Janaki Kalaganaledu Serial Weekly Roundup: జానకిపై మరోసారి నింద మోపిన మల్లిక.. దొంగ తరహాలో కొత్త ప్లాన్!
జానకి కలగనలేదు సీరియల్ రెండవ వారం మరింత ఆసక్తికరంగా కొనసాగింది. ఈ సీరియల్ మొదట్లో కాస్త బోరింగ్ గా అనిపించినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయి? అలాగే జానకి ఫ్యామిలీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం పదండి..

ఫిబ్రవరి 6వ ఎపిసోడ్
మరోవైపు మల్లిక యూట్యూబ్లో వంటలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేయగా వాటికి వచ్చిన కామెంట్స్ గురించి మలయాలంతో చెబుతూ ఉంటుంది. అయితే అతనికి అన్ని అబద్ధాలు చెబుతూ ఉండడంతో ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే చక్రాల బండి తీసుకొని రామ ఇంటికి వస్తూ ఉంటాడు.
ఇక మల్లిక, రామచంద్రను అవమానించే విధంగా మాట్లాడుతూ ఉంటుంది. జానకి కూడా ఆమెకు కౌంటర్ గట్టిగానే ఇస్తుంది. ఇక రామచంద్ర ఇంట్లోకి రాగానే తండ్రిని ఒక ప్రశ్న అడుగుతాడు. మీరు మళ్ళీ గుమస్తాగా పనిచేయడానికి ఒప్పుకున్నారా అని అడుగుతాడు.
ఖాళీగా ఉంటే ఏమి తోచడం లేదు అని అందుకే ఏదైనా ఒక పని చేద్దామని అనుకుంటున్నాట్లుగా చెబుతాడు. అందుకు జానకి మీరు ఏ పని చేయకూడదు అని మీ కష్టాలను తీర్చడంతో పాటు మిమ్మల్ని ఆనందంగా చూసుకోవడం కూడా మా బాధ్యతని జానకి మాట్లాడుతుంది.

ఫిబ్రవరి 7వ ఎపిసోడ్
మరోవైపు లడ్డూలు చేసే ఆర్డర్ గురించి రామచంద్ర ఆలోచిస్తారు. ఇక వంట సామను మొత్తం రావడంతో రాత్రి మొత్తం కూర్చొని పని చేయాలని అనుకుంటారు. అయితే వారికి వెన్నెల కూడా మొదట సహాయం చేస్తుంది కాని ఆమె నిద్ర వస్తుంది అని వెళ్లిపోతుంది.
ఇక రామచంద్ర కూడా జానకిని పంపించేస్తుంది. ఇక వంట మనిషి మలయాళం కూడా అలానే పడుకుండిపోతాడు. జానకి మాత్రమే రాత్రి మొత్తం కష్టపడి లడ్డూలు తయారు చేస్తుంది. ఇక ఆ ఆర్డర్ రావడానికి ముఖ్య కారణం అత్తగారే కారణమని జానకి గ్రహిస్తుంది.

ఫిబ్రవరి 8వ ఎపిసోడ్
మలయాళం మళ్ళీ తప్పించుకోవడానికి జోక్ చేశాను అని సాంబార్ లోకి తీసుకువెళ్తున్నారు అని అంటాడు. ఇక వారి మధ్యలో అలా గొడవకు సాగుతున్న సమయంలో జానకి కాలేజీకి వెళ్తాను అని అందరికీ చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడే వచ్చిన మల్లిక ఉంగరం పోయింది అని ఏడుస్తూ ఉంటుంది. ఇంట్లో నుంచి నా ఖరీదైన ఉంగరం పోయింది అని నా ఉంగరం దొరికే వరకు ఎవరు కూడా బయటకు వెళ్లడానికి వీలులేదు అని చెబుతుంది.
మొదట మలయాళం అడిగినప్పటికీ అతను నాకేమీ తెలియదు అని అంటుంది. ఇక మల్లిక ఈ ఇంట్లో ఆ అవసరం ఎవరికి ఉంటుంది అని నాకు మా ఆయనకు ఉండదని.. వెన్నెల కూడా అలాంటి పని చేయదు అని అంటుంది. పరోక్షకంగా మల్లిక జానకిపై నింద వేయాలని అనుకుంటుంది.

ఫిబ్రవరి 9వ ఎపిసోడ్
జ్ఞానాంబ మల్లిక విషయంలో ఆందోళన చెందుతూ ఉండగా.. అఖిల్ కూడా వస్తాడు. అతడు కూడా ఆఫీసుకు దూరం అవుతుంది అని అందుకే మా మామగారు ఇంటికి వెళ్లి ఉంటాము అని జెస్సి కూడా గర్భవతిగా ఉంది కాబట్టి తన ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి అని అంటాడు. అయితే మొదట తల్లి అందుకు ఒప్పుకోదు.
కానీ గోవిందరాజులు మాత్రం అఖిల్ కూడా చెప్పింది కరెక్ట్ అని వినడంతో అఖిల్ ఆమెకు థాంక్స్ చెప్తాడు. అయితే జెస్సి మాత్రం ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అనుకోరు. కానీ ఆమె అఖిల్ నోరు మూయిస్తాడు. ఇక ఇంట్లో నుంచి ఇద్దరు కొడుకులు వెళ్లిపోవాలని అనుకుంటున్న తరుణంలో జ్ఞానాంబ ఒక్కసారిగా మౌనంగా ఉండిపోతుంది. జానకి కూడా ఏమి మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటుంది

ఫిబ్రవరి 10వ ఎపిసోడ్
తల్లి మాటలను తలుచుకుంటూ సరిగా నిద్ర కూడా పోడు. ఇక అత్తయ్య గారు అలా మాట్లాడడానికి కారణం మీరు కాదు అని హఠాత్తుగా ఇద్దరు అలా వెళ్ళిపోతున్నారు అనగానే ఆమె బాధను తట్టుకోలేకపోయారు అని జానకి భర్తకు చెబుతుంది. ఇక జానకి భర్తకు మరో సలహా కూడా ఇస్తుంది వీళ్ళు వెళ్లిపోకుండా ఉండాలి అంటే మళ్ళీ మన పాత ఇంట్లోకి వెళ్లాలి అని ఆ ఇంట్లోకి వెళితే అఖిల్ కు కూడా ఆఫీస్ దగ్గర అవుతుంది అని, ఇక మల్లికకు కూడా కొంత ప్రైసైసి దొరుకుతుంది అని చెబుతుంది. ఇక రామచంద్ర మళ్ళి ఆ ఆలోచనలో పడతాడు.
అయితే మరోవైపు అఖిల్ వెళ్లిపోవడానికి కారణం జెస్సి కూడా అనుకొని జ్ఞానాంబ జెస్సిపై కోపాన్ని చూపిస్తుంది. అయితే జెస్సి మాత్రం అఖిల్ పెట్టిన కండిషన్ వలన అత్తగారితో ఆ విషయం గురించి మాట్లాడదు. దీంతో ఆమె ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్లిపోతుంది. ఇక జానకి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. మరి ఈ సమస్యలను రామచంద్ర


Click it and Unblock the Notifications











