Janaki Kalaganaledu Serial Weekly Roundup: కష్టాల్లో రామచంద్రకు తండ్రి సపోర్ట్.. కోపంగా అఖిల్ మాటలు!

జానకి కలగనలేదు సీరియల్ జనవరి మొదటి వారం మరింత ఆసక్తికరంగా కొనసాగింది. ఈ సీరియల్ మొదట్లో కాస్త నీరసంగా అనిపించినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే జనవరి 1 నుంచి జనవరి 6 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయి. అలాగే జానకి ఫ్యామిలీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం పదండి..

జనవరి 1వ ఎపిసోడ్

జనవరి 1వ ఎపిసోడ్

రామచంద్ర తన తమ్ముడు అఖిల్ జీవితం బాగుండాలి అని ఇల్లు తాకట్టు పెట్టి 20 లక్షలు అప్పు తెస్తాడు. అతని ఫ్రెండ్ కు డబ్బు ఇచ్చి జాబ్ ఇప్పించాలి అని చూస్తాడు. అయితే స్నేహితుడు మోసం చేసి పారిపోవడంతో అప్పు ఇచ్చిన వ్యక్తి జ్ఞానాంబ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడతాడు. డబ్బు 3 రోజుల్లో కట్టకపోతే ఇంటిని జప్తు చేస్తామని అంటాడు. దాంతో తల్లి జ్ఞానాంబ రామపై సీరియస్ అవుతుంది.

అసలు నీకు చదువుకున్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయకూడదు అని అనుకున్నాను. జానకి నీ జీవితంలోకి వచ్చిన తర్వాతనే నీలో చాలా మార్పు వచ్చింది. ఎన్నోసార్లు నా మాటలు నువ్వు పట్టించుకోలేదు. ప్రతి విషయం కూడా నాతో చెప్పుకునే వాడివి. కానీ ఇంత పెద్ద విషయాన్ని నువ్వు నాతో చెప్పలేదు.. అని జ్ఞానాంబ అంటుంది.

జనవరి 2వ ఎపిసోడ్

జనవరి 2వ ఎపిసోడ్

అంతే కాకుండా నువ్వు నాకు చెప్పకుండా నిన్నా మొన్న వచ్చిన నీ భార్యకు నిజం చెప్పావు. ఇక ఆమె కూడా అసలు విషయాన్ని నాతో చెప్పకుండా దాచి పెట్టింది. నువ్వు చేసిన పని వల్ల ఇప్పుడు మీ నాన్నగారు మంచాన పడ్డారు అని జ్ఞానాంబ రామపై చాలా సీరియస్ అవుతుంది. అయితే రామచంద్ర 20 లక్షలు అప్పు తీర్చాలంటే మళ్ళీ మన స్వీట్ షాప్ తాకట్టు పెట్టాలి అని అనుకుంటాడు. ఇక ఆ విషయాన్ని తన తల్లితో కూడా చెప్పాలని అనుకుంటాడు.

జనవరి 3 వ ఎపిసోడ్

జనవరి 3 వ ఎపిసోడ్

రామచంద్రకు ఏం చేయాలో తోచక మూడు రోజుల్లో 20 లక్షలు అంటే ఎవరు అప్పుగా ఇవ్వరు అని అందుకే స్వీట్ షాప్ తాకట్టు పెట్టాలని అనుకుంటున్నట్లుగా జానకితో చెబుతాడు. అంతే కాకుండా జ్ఞానాంబ అనుమతి అడగాలని అనుకుంటాడు. ఈ క్రమంలో మల్లిక తన సూటిపోటి మాటలతో అందరినీ మరింత బాధ పెడుతూ ఉంటుంది. రామచంద్ర తల్లితో మాట్లాడాలని అనుకున్నప్పటికీ కూడా ఆమెను అతని నుంచి దూరంగా వెళుతూ ఉంటుంది. ఈ క్రమంలో రామచంద్ర మరోసారి తల్లిని బ్రతీమాలలని అనుకుంటాడు. కానీ రామ మాత్రం ఎంత చెప్పినా కూడా తల్లి కూల్ అవ్వదు.

జనవరి 4వ ఎపిసోడ్

జనవరి 4వ ఎపిసోడ్

మరోవైపు రామచంద్ర తనకు తెలిసిన వాళ్లను డబ్బులు అడిగే ప్రయత్నం చేస్తారు. కానీ అందరూ మీ కుటుంబం మీద నమ్మకంతో ఇవ్వాలని ఉంది కానీ కొంత సమయం పడుతుంది అని అంటారు కానీ రామచంద్ర మాత్రం మూడు రోజుల్లోనే డబ్బులు తిరిగి కట్టేయాలి అని అడుగుతాడు. కానీ అది సాధ్యపడదు. ఇక మరోవైపు గోవిందరాజులు పక్షవాతం వచ్చి పడిపోవడం వలన అతన్ని రోజు వచ్చి వైద్యులు చూస్తూ ఉంటారు. రోజు నేను ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకోవాలి అని అలాగే ఆయిల్ తో మసాజ్ చేయాలి అని డాక్టర్ అంటారు. ఇక జానకి సాయం చేయడానికి వస్తుటే జ్ఞానాంబ మాత్రం అందుకు ఒప్పుకోదు. కొడుకు కోడలిపై జ్ఞానాంబ చాలా కోపంగా ఉంటుంది.

 జనవరి 6వ ఎపిసోడ్

జనవరి 6వ ఎపిసోడ్

మా నాన్నగారిని అడిగితే ఆయన డబ్బులు ఇస్తాడు అని ఒకసారి ఫోన్ చేయండి అని జెస్సి సలహా ఇస్తుంది. కానీ అలా అడగడం పద్ధతి కాదు అని రామచంద్ర వద్దు అని చెబుతాడు. మరోవైపు గోవిందరాజులు జానకి తో మాట్లాడుతూ మన వైపు నుంచి కూడా ఏదైనా ప్రయత్నం చేయాలి అని అప్పుడే రామచంద్ర కు సహాయంగా ఉంటుంది అని గోవిందరాజులు అంటాడు.

అయితే గోవిందరాజులు తన స్నేహితుడికి ఒకరికి ఫోన్ చేయాలని అనుకుంటాడు. అఖిల్ జాబ్ కోసం రామచంద్ర మోసపోయాడు అని చెబుతూ ఉండగా అప్పుడే అఖిల్ వస్తాడు. మీరు అన్నయ్య చేసిన మోసంలో నా పేరు తీయకండి అంటూ గట్టిగా చెబుతాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X