twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu Serial Weekly Roundup: ఫ్యామిలీ కోసం రామ మరో కొత్త వ్యాపారం.. అదిరిపోయే ట్విస్ట్!

    |

    జానకి కలగనలేదు సీరియల్ జనవరి 4వ వారం మరింత ఆసక్తికరంగా కొనసాగింది. ఈ సీరియల్ మొదట్లో కాస్త నీరసంగా అనిపించినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే జనవరి 22 నుంచి జనవరి 28 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయి? అలాగే జానకి ఫ్యామిలీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం పదండి..

    జనవరి 22వ ఎపిసోడ్

    జనవరి 22వ ఎపిసోడ్

    మల్లిక మాత్రం అందుకు అసలు ఒప్పుకోదు. మన దగ్గర డబ్బులు ఉన్నాయి అని తెలిస్తే మళ్లీ అందరూ మన దగ్గరికి వస్తారు అని ప్రతి పండుగకు మీ అన్నయ్య ఎలాగో బట్టలు తీస్తున్నాడు అలాగే ఈసారి కూడా అతనే అందరికీ తెస్తాడు అని మీరు అనవసరంగా ఈ డబ్బులు ఖర్చు పెట్టవద్దు అని పొగరుగా మాట్లాడుతుంది.

    దీంతో విష్ణు ఏమీ అనలేని పరిస్థితుల్లో ఉంటాడు. ఇక మరోవైపు వెన్నెల కిచెన్లో పనిచేసుకుంటూ ఉంటే మెల్లగా అక్కడికి వచ్చిన మల్లికా ఆమెకు ఏదో ఒకటి చెప్పి ఇక్కడ నుంచి పంపించేయాలని అనుకుంటుంది. నువ్వు అనవసరంగా ఇక్కడ కష్టపడడం కంటే మీ నానమ్మ ఇంటికి వెళ్లిపోవచ్చు కదా అని అనవసరమైన అనుమానాలు కలిగిస్తూ ఉంటుంది. ఇక ఆ విషయాన్ని పసిగట్టిన జానకి మల్లికతో మాట్లాడాలని అనుకుంటుంది. ఎందుకు మల్లికా నువ్వు లేనిపోని విధంగా అనవసరంగా అందరికీ చెడు ఆలోచనలను కలిగిస్తున్నావు అని ప్రశ్నిస్తుంది.

    పూర్తి ఎపిసోడ్ కోసం క్లిక్ చేయండిపూర్తి ఎపిసోడ్ కోసం క్లిక్ చేయండి

    జనవరి 23వ ఎపిసోడ్

    జనవరి 23వ ఎపిసోడ్

    హాల్లోకి జ్ఞానాంబ అందరిని రావాలని చెబుతుంది. పండగ సమయం కాబట్టే అందరికీ జ్ఞానాంబ కొత్త బట్టలు తీసుకొస్తుంది. ఎవరు పట్టించుకోకపోయినా ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది కాబట్టి నేను కుటుంబ పరిస్థితి గురించి ఆలోచించాలి అని అందుకే ఈ పండగ సమయంలో కొత్త బట్టలు తెచ్చాను అని రామచంద్రపై ఆమె అసహనం వ్యక్తం చేస్తూ మాట్లాడుతుంది.

    ఇక తల్లి మాటలకు కొడుకు రామచంద్ర కూడా కొంత బాధపడుతూ ఉంటాడు. ఆమె మాటలు పట్టించుకోవద్దు అని మీ మీద ఆమెకు కోపం లేదు అని కొంత బాధ ఉంది అని జానకి అంటుంది. ఇక తదుపరి రోజు సంక్రాంతి కావడంతో ఇంట్లో అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండాలని అనుకుంటారు.

    పూర్తి ఎపిసోడ్ కోసం క్లిక్ చేయండిపూర్తి ఎపిసోడ్ కోసం క్లిక్ చేయండి

    జనవరి 24వ ఎపిసోడ్

    జనవరి 24వ ఎపిసోడ్

    తర్వాత మల్లిక జానకి వారి భర్తలకు ప్రత్యేకంగా స్నానం చేస్తూ ఉంటారు. అయితే విష్ణు మాత్రం కుంకుడుకాయ అంటే కళ్ళు మందుతాయని నేను చేయలేను అని ఉంటాడు. ఇక బలవంతంగా అందరూ వచ్చి స్నానానికి కూర్చోబెడతారు.

    ఇక వారి మధ్య కొన్ని సరదా సన్నివేశాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇక రామచంద్ర మాత్రం తల్లి మాట్లాడింది అని ఎంతో సంతోషంగా ఉంటాడు. జానకి కూడా భర్త సంతోషాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పండగ రోజు ప్రత్యేకంగా జ్ఞానాంబ పూజలు చేస్తుంది.

    పూర్తి ఎపిసోడ్ కోసం క్లిక్ చేయండిపూర్తి ఎపిసోడ్ కోసం క్లిక్ చేయండి

    జనవరి 25వ ఎపిసోడ్

    జనవరి 25వ ఎపిసోడ్

    జ్ఞానాంబ కూడా తన తమ్ముడికి గుర్తుగా కూడా నేను ఏ విధంగా సహాయం చేయలేకపోతున్నాను అని బాధపడుతుంది. ఇక విష్ణు తన భార్య మల్లికను డబ్బులు అడగాలని అనుకుంటాడు. కానీ ఆమె మాత్రం అసలు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోదు. ఇక జానకి అప్పుడే వచ్చి మల్లికపై కోపాన్ని వ్యక్తం చేస్తుంది.

    పెద్దలు అంటే గౌరవం ఉండాలి అని అంటుంది. అయినప్పటికీ మల్లిక మాటలు పెద్దగా పట్టించుకోదు. ఇక చివరికి జానకి రామచంద్ర ఇద్దరు కూడా అనాధ పిల్లలకు సహాయం చేయాలని అనుకుంటారు.

    పూర్తి ఎపిసోడ్ కోసం క్లిక్ చేయండిపూర్తి ఎపిసోడ్ కోసం క్లిక్ చేయండి

    జనవరి 27వ ఎపిసోడ్

    జనవరి 27వ ఎపిసోడ్

    జానకి తన చదువుకు సంబంధించిన పుస్తకాలు కొనుక్కోవాలని అనుకుంటుంది. దానికోసం మూడు వేల రూపాయలు అవసరం అవుతుంది. అయితే ఆ విషయాన్ని అంతకుముందే రామచంద్ర కు కాలేజీ ప్రిన్సిపాల్ ఫోన్ చేసి చెబుతుంది. ఇక రామచంద్ర జానకికి ఫోన్ చేసే మీరు ఆ విషయం గురించి టెన్షన్ పడవద్దు అని పుస్తకాలు నేను తెస్తాను అని అంటాడు.

    ఇక ఇదిలా ఉండగా మరోవైపు మల్లిక ఆరు బయట బిచ్చగాడితో కూర్చుని జాతకాల గురించి మాట్లాడుతుంది. అప్పుడే నీలావతి ఇంటికి వచ్చి రామచంద్ర ఉద్యోగం పోయింది అని చెబుతుంది. ఇక ఆ విషయాన్ని జానకి కూడా తెలుసుకుంటుంది.

    పూర్తి ఎపిసోడ్ కోసం క్లిక్ చేయండిపూర్తి ఎపిసోడ్ కోసం క్లిక్ చేయండి

    జనవరి 28వ ఎపిసోడ్

    జనవరి 28వ ఎపిసోడ్

    రామచంద్రకు జానకి ఒక అద్భుతమైన సలహా కూడా ఇస్తుంది. మీరు మొదట్లో చక్రాల బండిమీద స్వీట్ అమ్ముతూ ఉండేవారు కదా ఇప్పుడు కూడా అదే తరహాలో పని చేయండి అని జానకి సలహా ఇస్తుంది. ఇక రామచంద్ర ఉదయమే తన పాత చక్రాల బండిని తీసుకువచ్చి ముస్తాబు చేస్తూ ఉంటాడు. ఇక కుటుంబ సభ్యులందరూ కూడా బయట నిలబడి చూస్తూ ఉంటారు. పెట్టుబడి పెట్టడానికి డబ్బు ఎక్కడిది అని అడిగితే రామచంద్ర తన బైక్ ని అమ్మేశాను అని చెబుతాడు.

    ఇక తల్లిని కొబ్బరికాయ కొట్టమని అడిగినప్పటికీ ఆమె మంచి మనసుతో ఎవరు కొట్టిన బాగానే ఉంటుంది అని భర్త క్షేమం కోరుకునే భార్య కొట్టాలని అత్తగారు కోడలు జానకికి సలహా ఇస్తారు. ఇక రామచంద్రా అదేవిధంగా తన సరికొత్త వ్యాపారాన్ని మొదలు పెడతాడు. మరి ఈ వ్యాపారంలో అతను ఎంతవరకు సక్సెస్ అవుతాడో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

    పూర్తి ఎపిసోడ్ కోసం క్లిక్ చేయండిపూర్తి ఎపిసోడ్ కోసం క్లిక్ చేయండి

    English summary
    Janaki Kalaganaledu Serial Weekly Roundup: january 22nd to january 28th Episode Highlights
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X