Janaki Kalaganaledu Serial Weekly Roundup: శోభనంతో జానకి కథలో యూ టర్న్.. మల్లికకు కూడా అదే ఆలోచన!
జానకి కలగనలేదు సీరియల్ మార్చి మొదటి వారం మరింత ఆసక్తికరంగా కొనసాగింది. ఈ సీరియల్ మొదట్లో కాస్త బోరింగ్ గా అనిపించినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే మార్చి 29 నుంచి మార్చి 31 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయి? అలాగే జానకి ఫ్యామిలీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం పదండి..

మార్చి 27వ ఎపిసోడ్
ఇక ఇంటి దగ్గర పనివాడు మలయాళం చాలా హ్యాపీగా చిల్ అవుతూ ఉంటాడు. అతను ఒక అరటి గుత్తిని తీసుకొని దాన్ని పైన తాడుతో కట్టేయాలని అనుకుంటాడు. అయితే అతను టేబుల్ వేసి తాడును కడుతున్న సమయములో ఉరి వేసుకుంటేన్నాడెమో అనే అనుమానంతో మల్లిక పరుగు పరుగున అక్కడికి వస్తుంది. వెంటనే మలయాళం నిలుచున్న టేబుల్ ను తన్నేస్తుంది. ఇక కిందపడిన మలయాళం గట్టిగా అరుస్తాడు. అప్పుడే గోవిందరాజులు ఏం జరిగిందో అని పెరిగెత్తుకుంటు వస్తాడు. ఇక ఏం జరిగింది అంటూ మల్లికను అడుగుతాడు. మలయాళం పెళ్లి కాలేదు అనే బాధతో ఆత్మహత్య చేసుకుంటే నేనే కాపాడాను అని మల్లిక చెబుతుంది. దీంతో మలయాళం షాక్ అవుతాడు.

మార్చి 28వ ఎపిసోడ్
ఇక మరోవైపు జ్ఞానాంబ కూతురు వెన్నెల చదువుకోవాలని అనుకుంటున్నట్లుగా తల్లితో చెబుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కదా పెళ్లి చేస్తే చదువుకునే వీలు ఉండదు అని మళ్ళీ భర్త పిల్లలు అంటూ బిజీగా అయిపోయి ఉండాలి అని అంటుంది. దీంతో జ్ఞానాంబ మళ్ళీ ఆలోచనలు పడుతుంది. అయితే పక్కనే ఉన్న మల్లికా మాత్రం వెన్నెల చెప్పిన మాటలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అయినా ఇప్పుడు చదువుకొని ఎవరు బాగుపడ్డారు అని చదువుకున్నా చదువుకోకపోయినా కూడా భర్త పిల్లలు అంటూ మరొక జీవితంలోకి వెళ్లాలి అని దాని వల్ల ఉపయోగం లేదు అని మల్లికా మాట్లాడుతుంది.

మార్చి 29వ ఎపిసోడ్
అయితే ఇంతలోనే అఖిల్ గుమ్మం నుంచి ఇంట్లోకి వస్తాడు. ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళాను అని ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది అని సింపుల్ గా సమాధానం ఇస్తాడు. ఇక ఆ విషయంలో గోవిందరాజులు మరింత అసంతృప్తిగా ఉంటాడు. నావల్ల అఖిల్ అలిగి వెళ్లిపోయాడేమో అని అన్నంతగా నన్ను అందరూ ఏదో ఒక మాట అంటూనే ఉన్నారు. ఇప్పుడు అతను తిరిగి వచ్చాడు కదా అని కోపంగా కనిపిస్తూ ఉంటాడు. ఇక అతని భార్య జ్ఞానాంబ భర్తకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. పిల్లలన్నాక తప్పులు చేస్తారు అని మనం బంధాలను కలుపుకొని పోయేలా ఉండాలి కానీ విడిపోయేలా చేయకూడదు అని చెబుతుంది.

మార్చి 30వ ఎపిసోడ్
అనంతరం రామ జానకి ఇద్దరు కౌగిలించుకోవడంతో వారిని మల్లిక చూస్తుంది. వీరి స్పీడ్ చూస్తుంటే వచ్చే ఉగాదికి ముగ్గురు అయ్యేలా ఉన్నారు అని మల్లికా తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత తన భర్త ద్వారా కూడా అదే తరహాలో ప్రేమను చూపించి ఒక పిల్లాడిని కనాలని అనుకుంటుంది. అయితే భర్త రెడీ అవుతుండగా మల్లికా అతనితో కూడా మల్లెపూలు పెట్టించుకోవాలని అనుకుంటుంది. సిగ్గుపడుతూ మల్లిక భర్త దగ్గర మల్లెపూలు పెడుతుంది. ఇది నా జడలో పెట్టండి అవి నేను మహా ప్రసాదం అనుకుంటాను అని ఆమె చెప్పడంతో విష్ణు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు.

మార్చి 31వ ఎపిసోడ్
తర్వాత చిన్న కోడలు మల్లికా కూడా అత్తగారి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. అయితే గతంలో నువ్వు ఒకసారి గర్భం దాల్చి అనవసరంగా పోగొట్టుకున్నావు ఇప్పుడు అలా జరగకుండా చూసుకొని అత్తగారు చెబుతారు. అంతేకాకుండా ఒకసారి నిన్ను హాస్పిటల్ కు తీసుకువెళ్లాలి అని చెకప్ చేయిస్తే సమస్య ఏమిటో తెలుస్తుంది అని అత్తగారు చెబుతారు. అయితే గతంలో మల్లిక కడుపు వచ్చింది అని అబద్ధం చెబుతుంది. ఇప్పుడు హాస్పిటల్ కి వెళితే ఆ నిజం అత్తగారికి తెలుస్తుందేమో అని కంగారుపడుతుంది. అందుకే మళ్ళీ వెనకడుగు వేస్తుంది. మరి మల్లిక విషయంలో జ్ఞానాంబ గరాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి


Click it and Unblock the Notifications











