Janaki Kalaganaledu Serial Weekly Roundup: డ్యూటీలో తెలివితో ట్విస్ట్ ఇచ్చిన జానకి.. మరో న్యూ జర్నీ

జానకి కలగనలేదు సీరియల్ మార్చి మొదటి వారం మరింత ఆసక్తికరంగా కొనసాగింది. ఈ సీరియల్ మొదట్లో కాస్త బోరింగ్ గా అనిపించినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే ఫిబ్రవరి 28 నుంచి మార్చి 4 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయి? అలాగే జానకి ఫ్యామిలీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం పదండి..

మార్చి 6వ ఎపిసోడ్

మార్చి 6వ ఎపిసోడ్

రామచంద్ర ఇంటికి ఎంతో సంతోషంగా వచ్చినట్లుగా చిన్న కోడలు మల్లిక కల కంటుంది. అతను వచ్చి ఇంట్లో వాళ్లందరికీ కూడా జానకి పాస్ అయినట్లుగా చెప్పి సంతోషంగా ఉంటాడు అని అనుకుంటుంది. అంతే కాకుండా ఊళ్ళో వాళ్ళందరూ కూడా జానకిపై ప్రశంసలు కురిపిస్తూ ఆమెకు గౌరవంగా సన్మాన సభను కూడా సిద్ధం చేసినట్లుగా మల్లికకు అనిపిస్తుంది. ఇక ఆ తర్వాత వెంటనే ఆమె ఊహ నుంచి బయటకు వచ్చి షాక్ అవుతుంది. వామ్మో నిజంగా జానకి ఈ పరీక్ష పాస్ అయితే నన్ను చాలా తిడతారు అని అనుకుంటుంది.

ఇక రామచంద్ర పెద్దగా హడావిడి లేకుండా ఇంట్లోకి వస్తాడు. పరీక్ష ఫలితాలు వచ్చాయా తండ్రి గోవిందరాజులు అడుగుతాడు. కానీ ఇంకా రాలేదు అని ప్రిన్సిపాల్ గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి చెబుతాను అని చెప్పినట్లుగా రామచంద్ర చెబుతాడు.

మార్చి 7వ ఎపిసోడ్

మార్చి 7వ ఎపిసోడ్

రామచంద్ర బయటకు సైకిల్ మీద వెళుతూ ఉండగా ఊళ్లో వారందరూ కూడా అతన్ని అడుగుతూ ఉంటారు. జానకి పరీక్షల్లో పాస్ అయ్యిందా అని అడుగుతుంటే రామచంద్ర మంత్రం ఇంకా ఫలితాలు రాలేవు అని అంటాడు. ఇక తెలిసిన కానిస్టేబుల్ రామచంద్రను అడుగుతాడు. పరీక్ష ఫలితాలు ఏమయ్యాయి అని అంటాడు.

పాస్ అవ్వలేదు అని చెప్పడంతో ఒకసారి తప్పితే ఏమీ కాదు అని మరోసారి రాసుకోవచ్చు అని అంటాడు. అంతేకాకుండా అప్పటివరకు కానిస్టేబుల్ కైనా పరీక్షకైనా అప్లై చేయమని సలహా ఇస్తాడు. దీంతో రామచంద్ర అందుకు ఒప్పుకుంటాడు. అయితే మరోవైపు ఇంటిదగ్గర జానకి ఒంటరిగా కూర్చుని ఉండగా మల్లిక తన చిన్న మరిది అఖిల్ తో మాట్లాడుతూ మరింత బాధ పెట్టేలా మాట్లాడుతుంది. మీ ఆఫీస్ లో ఏదైనా జాబ్ ఉంటే చూడు అని.. పాపం జానకి బాధపడుతోంది అని అంటాడు. అయితే జానకికి మాత్రం అఖిల్ భార్య జెస్సి సపోర్ట్ చేస్తూ ఉంటుంది.

మార్చి 8వ ఎపిసోడ్

మార్చి 8వ ఎపిసోడ్

మళ్ళీ మరోసారి మల్లిక ఆ విషయంలో అనవసరంగా గొడవలు క్రియేట్ చేయాలని అనుకుంటూ ఉండటంతో మామ గోవిందరాజులు ఆమె కౌంటర్ ఇచ్చి నోరుమూయిస్తాడు. ఇక తర్వాత మొత్తానికే జానకి కానిస్టేబుల్ పరీక్షల కోసం సిద్ధమయిన తరువాత కొన్నిరోజులకు పరీక్షలు రాస్తుంది. ఇక అందులో ఆమె అనుకున్నట్లే పాస్ అవుతుంది. ఇక అందరూ కూడా ఇంట్లో చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక జానకి కానిస్టేబుల్ ట్రైనింగ్ కు వెళ్లి తిరిగొస్తుంది.

ఆమె ప్రత్యేకంగా పోలీస్ డ్రెస్ లో కనిపించడంతో రామచంద్ర తో పాటు అత్తగారు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ముందు మీరు ఈ డ్యూటీలో ఒక న్యాయంగా వర్క్ చేయాలి అని ఆ తర్వాత మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు అని రామచంద్ర చెబుతాడు.

మార్చి 9వ ఎపిసోడ్

మార్చి 9వ ఎపిసోడ్

మనోహర్ ఏమి చేసేదిలేక దొంగల్ని పట్టుకోవాలి అని బయలుదేరుతాడు. ఈ క్రమంలో జానకిని పోలీస్ స్టేషన్కు వెళ్ళమని అంటారు. ఇక రామచంద్ర స్వీట్ బండి పై రోడ్డు మీద ఉండగా...మురికి నీళ్లు పడేలా ఎస్సై మనోహర్ కారు నడుపుకుంటూ వెళతాడు. అయితే రామ గట్టిగా అరవడంతో ఏంటి సీరియస్ అవుతున్నావు అంటూ మనోహర్ వచ్చి గల్లా పట్టుకుంటాడు. ఇక రామచంద్ర మళ్ళి సైలెంట్ అయిపోవడంతో మనోహర్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు.

మళ్ళీ ఎప్పుడైనా దొరకవా అని అంటాడు. ఇక జానకి ఆ నెక్లెస్ ను ఎవరు దొంగతనం చేసి ఉంటారా అని పోలీస్ స్టేషన్లో ఆలోచిస్తూ ఉంటుంది. ఆమెకు వెంటనే ఒక అనుమానం వస్తుంది. మరి ఈ విషయంలో జానకి ఎస్ఐ మనోహర్ కు కోపం తెప్పించకుండా ఎలా డీల్ చేస్తుందో చూడాలి.

మార్చి 10వ ఎపిసోడ్

మార్చి 10వ ఎపిసోడ్

మరోవైపు జానకి దొంగను పట్టుకొని గుడి దగ్గరికి వెళుతుంది. అక్కడ ఎమ్మెల్యే తో పాటు చాలామంది జనాలు ఉంటారు. ఇక డైరెక్టుగా జానకి దొంగను అక్కడికి తీసుకు వెళుతుంది. ఇక ఎమ్మెల్యే ఎస్ఐకి ఫోన్ చేసి గుడి దగ్గరకు రమ్మని చెబుతాడు. అక్కడికి రాగానే ఎస్సై జానకి చేసిన పనిని చూసి ఆశ్చర్యపోతాడు. అయితే అంతకు ముందు రోజే రామచంద్రతో అతనికి గొడవ జరుగుతుంది.

ఆ తరహాలో రివేంజ్ తెలుసుకోవడానికి దొంగను పట్టుకుని ఇక్కడికి తీసుకువచ్చి ఉండవచ్చు అని అనుకుంటాడు. ఇక ఎమ్మెల్యే అయితే జానకిని ఎంతగానో పొగుడుతాడు. ఎస్సై మనోహర్ ఆ విషయాన్ని తట్టుకోలేక పోతాడు. పైకి నవ్వుతూ కనిపించినప్పటికీ అతను ఆమెపై అసూయ పెంచుకుంటాడు.

ఇక రామచంద్ర ఎస్ఐని చూసి నిన్న జరిగిన దానికి క్షమాపణ చెబుతాడు. ఎస్సై మాత్రం అలాంటిదేమీ లేదు అని దాన్ని నేను అప్పుడే మర్చిపోయాను అని అబద్ధం చెబుతాడు. మరి ఈ పరిస్థితులలో జానకి, ఎస్ఐ నుంచి ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X