Janaki Kalaganaledu Serial Weekly Roundup: జానకి వలన కేసులో ఇరుక్కున్న రామ.. ఫ్యామిలీలో న్యూ ట్విస్ట్!

జానకి కలగనలేదు సీరియల్ మొదట కాస్త నిరాశకు గురి చేసినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే మే 1 నుంచి మే 5 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో చూద్దాం..

మే 1వ ఎపిసోడ్: తప్పకుండా నేను మళ్ళీ కడిగిన ముత్యంలా నిర్దోషిగా తిరిగి వస్తాను అని రామచంద్ర తల్లికి మాట ఇస్తాడు. ఇక మరోవైపు జానకి బిల్డర్ నుంచి ఎలాగైనా రామచంద్రను తప్పించాలి అని అనుకుంటుంది. అయితే అదే సమయంలో జానకిని బెదిరించాలని బిల్డర్ మధుకర్ ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక జానకి ఆ సమయంలో ఫోన్ ఎత్తదు. ఇక మధుకర్ ఎస్సై మనోహర్ కు ఫోన్ చేసి సీరియస్ అవుతూ ఉంటాడు.

Janaki Kalaganaledu Weekly Roundup: 2023 May 1st to May 5th Episode

జానకి ఇంకా మనం చెప్పిన మాట వినడం లేదు అని కేసు నుంచి తప్పుకోవడం లేదు అని అతను చెప్పడంతో నాకు కూడా చాలా టెన్షన్ గా ఉంది అని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాను అంటూ ఎస్ఐ మనోహర్ చిరాకు పడుతూ ఉంటాడు. ఈ క్రమంలో జానకి డైరెక్టుగా బిల్డర్ తోనే తేల్చుకోవాలని అనుకుంటుంది. ఇక బిల్డర్ హెచ్చరికలు కూడా చేసినా.. జానకి ఏ మాత్రం తగ్గదు. అసలు యుద్ధం ఇప్పుడే మొదలైంది అంటూ ఛాలెంజ్ విసురుతుంది.

మే 2వ ఎపిసోడ్: ఇక ఎస్సై మనోహర్ ఎందుకు వచ్చాడు అని అనుకుంటూ ఉండగా అతను అసలు విషయం చెబుతాడు. మీరు ఇంత బాధగా ఉండడానికి, మీ అబ్బాయి కేసులో ఇరుక్కోవడానికి ప్రధాన కారణం మీ కోడలు జానకి అని చెబుతాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. సాధారణంగా ఈ పోలీసు ఉద్యోగంలో కొన్ని కేసులో చాలా సీరియస్ గా ఉంటాయి అని మా కుటుంబాలు కూడా నష్టపోయే వరకు ప్రభావం చూపుతుంది అని చెబుతాడు.

ఒక బిల్డర్ హత్య చేసిన కేసులో జానకి మొండిపట్టుతో వెళుతుంది అని ఇక అతను పెద్ద వ్యక్తి కావడంతో మీ కుటుంబాన్ని టార్గెట్ చేశాడు అని చెబుతాడు. అంతేకాకుండా ఇప్పుడు జానకి పోలీస్ ఉద్యోగాన్ని వదిలేస్తేనే అతను మీ కుటుంబాన్ని వదిలేస్తాడు అని లేకపోతే తీవ్ర స్థాయిలో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం కూడా ఉంది అని ఎస్సై మనోహర్ చెబుతాడు. దీంతో జ్ఞానాంబ మళ్ళీ ఒక్కసారిగా సీరియస్ అవుతుంది. ఇక ఈ విషయంలో జానకి మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండబోతోంది.

Janaki Kalaganaledu Weekly Roundup: 2023 May 1st to May 5th Episode

మే 3వ ఎపిసోడ్: అంతే కాకుండా రామచంద్రను లోపలికి తీసుకు వెళ్లి ఇంకా ఎక్కడెక్కడ గాయాలు అయ్యాయో ఒకసారి జాగ్రత్తగా చూసి మందు రాయమని చెనుతుంది. ఇక జానకి మాత్రం మీ మాట వింటుంది అనే నమ్మకం తమకు లేదని రేపు మాకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉండవచ్చు అని మల్లిక మరొక విధంగా మాట్లాడుతుంది.

ఇక జానకి రామచంద్రను లోపలికి తీసుకు వెళ్లి నా కారణంగా మీరు ఇబ్బంది పడుతున్నారు అని ఎంతగానో బాధపడుతుంది. ఇక ఇది మీ పోలీస్ జాబ్ అని అందులో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయవద్దని రామ ధైర్యం చెబుతాడు. ఇక అప్పుడే జానకి ఫోన్ కి బిల్డర్ మధుకర్ కాల్ చేస్తాడు. నువ్వు వెనుకడుగు వేయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పడంతో జానకి మరింత సీరియస్ అవుతుంది.

Janaki Kalaganaledu Weekly Roundup: 2023 May 1st to May 5th Episode

మే 4వ ఎపిసోడ్: మళ్ళీ పోలీస్ స్టేషన్ కు రామ:అయితే గోవిందరాజులు కూడా జానకికి ఏమి చెప్పలేని పరిస్థితుల్లో ఉంటాడు. నేను ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని అనడంతో జానకి మరింత బాధపడుతుంది. తరువాత జానకి తన బెడ్ రూమ్ లోకి వచ్చి ఏడుస్తూ ఉండగా రామచంద్ర ఎందుకు బాధపడుతున్నారు అని అనవసరమైన విషయాలను పట్టించుకోవద్దు అని చెబుతాడు. దీంతో జానకి రామచంద్ర తో ఇతర విషయాలపై మాట్లాడే ప్రయత్నం చేస్తుంది.

అయితే మరుసటి రోజు మళ్లీ ఎస్సై మనోహర్ వచ్చి రామచంద్రను పోలీస్ జీప్ ఎక్కించాలని అనుకుంటాడు. ఇక అప్పుడు తల్లి జ్ఞానాంబ మళ్ళీ నా కొడుకుని తీసుకు వెళ్ళిపోతున్నారు అని ఇప్పటివరకు నువ్వు చేసింది ఏమీ లేదు అని ఇదంతా కూడా నీవల్లే జరిగింది అని అత్తగారు జానకి పై మరింత సీరియస్ అవుతుంది.

Janaki Kalaganaledu Weekly Roundup: 2023 May 1st to May 5th Episode

మే 5వ ఎపిసోడ్: జానకి మళ్ళీ బాధపడుతూ పోలీస్ స్టేషన్ కు వెళుతుంది. అక్కడ ఎస్ఐ మనోహర్ తన మాటలతో మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇన్ని రోజులు నిన్ను అనవసరంగా నమ్మాను అని ఇకనుంచి నిన్ను అసలు ఏమాత్రం నమ్మమని ఎస్సై జానకితో అంటాడు అనవసరంగా నువ్వు గొప్పలకు పోతున్నావని పోలీస్ ఉద్యోగం వదిలిపెడితేనే నీ జీవితం బాగుంటుంది అని చెబుతాడు. ఇక రామచంద్రను కోర్టులో ప్రవేశపెట్టాల్సిందే అని ఈరోజు రేపు సెలవు కాబట్టి ఎల్లుండి రామచంద్ర కోర్టు మెట్లు ఎక్కుతాడు అని డ్రగ్స్ కేసు లో శిక్ష పడుతుంది అని ఎస్ఐ మనోహర్ చెప్పడంతో జానకి షాక్ అవుతుంది.

ఇక జానకి రామచంద్ర గురించి ఆలోచిస్తూ ఒక పార్టీలో కూర్చుంటుంది. ఇక మరుసటి రోజు భర్తకు భోజనం తినిపించాలి అని అనుకున్నా జానకి ఏస్ఐ మనోహర్ వచ్చి ఎవరి పర్మిషన్ తీసుకొని పెడుతున్నావు అని ఇకనుంచి నీ భర్తను ఏ మాత్రం కలవడానికి వీలులేదు అని చెబుతాడు. మరి ఈ సమస్యల నుంచి జానకి ఇలా బయటపడుతుందో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X