»   » కుట్ర: ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ ఆన్ లైన్లో పెట్టారు (లింక్)

కుట్ర: ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ ఆన్ లైన్లో పెట్టారు (లింక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'జనతా గ్యారేజ్' మూవీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్లోనే భారీ వసూళ్లు సాధించడంతో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన పలు రికార్డులను ఈ చిత్రం బద్దలు కొట్టింది.

ఈ చిత్రాన్ని ఈ నెల 23న మా టీవీ ప్రీమియర్ షో ప్రసారం చేశారు. జనతా గ్యారేజ్ మూవీ 50రోజులు పూర్తయిన వెంటనే టీవీల్లో వేయడంతో భారీ రెస్పాన్స్ వస్తుందని అంతా భావించారు. అయితే జనతా గ్యారేజ్ విషయంలో ఊహించిన టీఆర్పీ రేటింగ్ రాలేదు.


Janatha Garage full movie released on net

అందుకు కారణం.... కుట్ర జరుగడమే అని అంటున్నారు. సినిమా యూనిట్‌కు చెందిన ఓ వ్యక్తి జనతా గ్యారేజ్ టీవీలో ప్రసారం కావడానికి కొద్దిరోజుల ముందే హై క్వాలిటీ హెచ్.డి ప్రింట్ బయటకు లీక్ చేసాడని, అప్పటికే చాలా మంది పైరసీ ఆన్ లైన్లో ఉండటంతో టీవీ రేటింగ్స్ తగ్గాయని అంటున్నారు.


జనతా గ్యారేజ్ శాటిలైట్ రైట్స్ 12.50 కోట్లకు కొన్నారు. ఆన్ లైన్ పైరసీతో అప్రమత్తమైన టీవీ యాజమాన్యం.... హాస్ట్ స్టార్ ద్వారా సినిమా ఆన్ లైన్లో రిలీజ్ చేసారు. అంటే ఇపుడు హాట్ స్టార్ లో ఈ సినిమా ఫ్రీగా చూడొచ్చన్నమాట.


సినిమా చూడటం కోసం క్లిక్ చేయండి.

English summary
Jr NTR's Janatha Garage, which was recently premiered on Maa TV, has been officially released on internet. Now, the viewers can watch the complete movie online for free.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X