ఆ చానెల్ వల్లే ఈ స్థాయికి వచ్చాడట.. జానీ మాస్టర్ ఎమోషనల్ కామెంట్స్
ప్రస్తుతం జానీ మాస్టర్ బుల్లితెరను ఊపేస్తున్నాడు. వెండితెరపై మాస్ స్టెప్పులు ఐకానిక్ మూమెంట్లతో రచ్చ చేసే జానీ మాస్టర్.. బుల్లితెరపైనా నవ్వులు పంచుతున్నాడు. ఢీ జబర్దస్త్ అదిరింది వంటి షోల్లో జానీ మాస్టర్ చేసే సందడి అంతా ఇంతా కాదు. జానీ మాస్టర్‌కు బుల్లితెరపైనా అభిమానులున్నారు. వెండితెరపైన కేవలం జానీ మాస్టర్ వేసే స్టెప్పులు మాత్రమే కనిపిస్తాయి. అదే బుల్లితెర మీద అయితే జానీ మాస్టర్ కామెడీ టైమింగ్, పంచ్‌లు అని కనిపిస్తాయి.
Recommended Video

మెగా అభిమాని..
జానీ మాస్టర్ ఇంతగా పాపులర్ అవ్వడానికి ఓ కారణం కూడా ఉంది. అదే మెగా అభిమాని అనే ట్యాగ్. మెగా హీరోలకు జానీ మాస్టర్ కంపోజ్ చేసే స్టైలీష్ స్టెప్పులు ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. రామ్ చరణ్, అల్లు అర్జున్‌లకు జానీ మాస్టర్ అదిరిపోయే స్టెప్పులను కంపోజ్ చేస్తాడు.

నాగబాబుతో అలా..
జానీ మాస్టర్ నాగబాబుతో కలిసి బొమ్మ అదిరింది షోలో జడ్జ్‌గా వ్యవహరిస్తున్నాడు. బొమ్మ అదిరింది షోలో జానీ మాస్టర్ పండుతో కలిసి చేసే కామెడీ, వేసే డ్యాన్సులు బాగానే వైరల్ అవుతుంటాయి. ఇవే గాక ప్రతీ పండుగకు చేసే స్పెషల్ ఈవెంట్‌లోనూ అలరిస్తుంటాడు.

ఆ పాటలతో..
జానీ మాస్టర్ ఈ మధ్య నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యాడు. బుట్టబొమ్మ పాట ఖ్యాతి ఖండాంతరాలు దాటడం, సిగ్నేచర్ స్టెప్పులు విదేశీయులు కూడా వేసేశారు. అంతటి స్టైలీష్ స్టెప్పులు కంపోజ్ చేసిన జానీ మాస్టర్ పేరు మార్మోగిపోయింది. అంతకుముందు రౌడీ బేబీ పాటతో సౌత్‌ను ఊపేశాడు.
తాజాగా అలా..
తాజాగా జానీ మాస్టర్ జెమినీ దీపావళి ఈవెంట్‌లో పాల్గొన్నాడు. మీకు మీరే మాకు మేమే అనే ఈ ఈవెంట్‌లో జానీ అదిరిపోయే స్టెప్పులు వేశాడు. తమ్ముడు సినిమాలో మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అనే పాటకు పవన్ కళ్యాణ్‌లా డ్యాన్సులు వేసి అలరించాడు. తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే అది జెమినీ టీవీ వల్లేనని, ఈ స్టేజ్ మీదనే మొదటి స్టెప్ వేశానని చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











