ఆ పిల్ల నాది... ఈ కట్టె కాలేంత వరకు నీతోనే... స్టార్ కొరియోగ్రాఫర్ ఎమోషనల్
టాలీవుడ్‌లో స్టార్ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు జానీ మాస్టర్. ఏ హీరోకైనా సరే అతని బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా స్టెప్ మూవ్‌మెంట్స్‌ని కంపోజ్ చేసి ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించడంలో జానీ మాస్టర్ దిట్ట. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ సూపర్‌స్టార్స్‌తో కూడా పనిచేసిన ఘనత ఆయనది. అతని వ్యక్తిగత జీవితం, ప్రవర్తనపై వివాదాలు చోటు చేసుకోవడంతో పాటు ఏకంగా జైలుకి వెళ్లొచ్చినా ఆయన టాలెంట్ మీద ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. రీ ఎంట్రీ తర్వాత తనలోని టాలెంట్‌కి జానీ మాస్టర్ మరింత పదును పెడుతున్నారు. తాజాగా ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఎమోషనల్ అయ్యారు.
జీ తెలుగులో ప్రసారమవుతున్న ఆట షో.. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కొత్తగా రెడీ అయ్యింది. జడ్జిలుగా ఉన్నవారికి సర్‌ప్రైజ్ ప్లాన్ చేశామని యాంకర్ సుడిగాలి సుధీర్ చెప్పగా.. ఐ హేట్ సర్‌ప్రైజెస్ అని రాధిక చెప్పడంతో సుధీర్ షాక్ అవుతాడు. రాధిక గారిని సర్‌ప్రైజ్ చేయాలంటే డైమండ్స్ ఉండాలని నిహారిక వ్యాఖ్యానించింది. నాకు అలాంటివి వద్దని రాధిక తిరస్కరించగా.. డైమండ్స్ వద్దంటారేంటీ? అని నిహారిక షాక్ అయ్యింది. డైమండ్‌కి డైమండ్ అంటే వద్దు అనే అంటారని సుధీర్ పులిహోర కబుర్లు చెప్పడంతో అంతా నవ్వేస్తారు.

అయితే జానీ మాస్టర్‌కు సర్‌ప్రైజ్ ప్లాన్ చేశామని చెప్పి వెంటనే ఆయన సతీమణి ఆయేషా అలియాస్ సుమలతను పిలిచాడు. భార్యను స్టేజ్ మీద చూడగానే జానీ ఎమోషనల్ అయ్యాడు. వచ్చి రావడంతోనే మాస్టర్.. హ్యాపీ వాలెంటైన్స్ డే అని చెప్పింది. ఆ మాటలతో జానీ కంటతడి పెట్టాడు. ఆ తర్వాత స్టేజ్ మీదకి వెళ్లి భార్యకు గిఫ్ట్ ఇచ్చి.. మోకాళ్ల మీద కూర్చొని కాలిపట్టీని తొడిగి పూలను భార్య పాదాలపై వేశాడు. అది చూసి అంతా చప్పట్లతో ఈ జంటను అభినందించారు. నువ్వొక వారియర్ అని ఎందుకు ఏడుస్తున్నావని భార్యను ఓదార్చాడు.
ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో కానీ నాకు ఈ పిల్ల దొరికింది.. ఐ లవ్ యూ. ఇలా బతకం అంత ఈజీ కాదు. అందరూ ఆడపిల్లలకు సముద్రమంత ఓర్పు ఉంటుందని అంటారు. అది నిజం. నా గురించి ప్రపంచంతోనే ఫైట్ చేసింది. నా గురించి ఏది నిజమో? ఏది అబద్ధమో తనకు తెలుసు. మీ అమ్మనాన్నలకు చాలా థ్యాంక్స్ చెబుతున్నాను.. నిన్ను కని నాకు ఇచ్చారు. నా గురించి అన్నీ వదులుకుని నాకు జానీ కావాలి అని వదిలేసింది. ఈ కట్ట కాలేంత వరకు నీతోనే జీవిస్తాను, నీతోనే మరణిస్తాను. ఈమె క్లాసికల్ డ్యాన్సర్.. ఈగ ఫుల్ మూవీ సాంగ్స్‌కి డ్యాన్స్ చేశారు. తర్వాత ఇష్టపడ్డాం అని జానీ మాస్టర్ కన్నీటి పర్యంతమయ్యాడు.
అనంతరం ఆయేషా మాట్లాడుతూ.. తన భర్త గురించి చెప్పారు. మా ఇద్దరి మధ్య రిలేషన్, లవ్ అండ్ ఎఫెక్షన్ మరింత పెరిగింది. కొంచెం కూడా తగ్గలేదు, అది పెరుగుతూనే ఉంది ఐ లవ్ యూ అని చెప్పింది. ముందు మాస్టారే ప్రపోజ్ చేశారు. లంచ్ అయిపోయింది, హ్యాండ్ వాష్ చేసుకుంటుంటే ఏయ్ సుమ.. నువ్వంటే నాకిష్టం, నువ్వు ఒప్పుకుంటే నేను నీకు పెళ్లి చేసుకుంటాను అని అడిగారు. మాస్టర్.. మీరు చాలా స్పీడ్, నేను చాలా స్లో మనిద్దరికీ సెట్ అవ్వదు అంటే.. అలా అపోజిట్ ఉంటేనే సెట్ అవుతుందన్నారని ఆయేషా అన్నారు. అలా ఉంటేనే స్ట్రాంగ్‌గా ఉంటుందన్నారు కానీ.. ఇంత స్ట్రాంగ్‌గా ఉంటుందని అనుకోలేదు.
తను వచ్చినప్పుడు నా దగ్గర వన్ రూపీ కూడా లేదు. ఒక 50 వేల రూపాయలు తెలిసినవాళ్ల దగ్గర అప్పు తీసుకున్నాను. అటు వద్దన్నారు, ఇటు వద్దన్నారు. పెళ్లయితే చేసుకోవాలని ఛార్మినార్ దగ్గరికి ఇద్దరం వెళ్లి ఒక్కొక్క షాప్ దగ్గరికి వెళ్లి బట్టలు సెలెక్ట్ చేశాం. రేపొద్దున పెళ్లి.. ఆ మూవ్‌మెంట్స్ సూపర్ అని జానీ మాస్టర్ అన్నారు. షాపింగ్ చేసేసి నైట్ అలిసిపోయి పడుకున్నారు. నెక్ట్స్ ఈవినింగ్ పెళ్లి.. నాకేమో నిద్రపట్టడం లేదు. ఈయనేంటీ గురకపెట్టి మరి నిద్రపోతున్నారని నేను షాక్ అయ్యానని ఆయేషా గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. జానీ - ఆయేషాలు ఇలాగే అన్యోన్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.


Click it and Unblock the Notifications











