Jani Master ఇదేమైనా బిగ్‌బాస్ షోనా? కోపంతో మైక్ విసిరి కొట్టిన జానీ మాస్టర్
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో జానీ మాస్టర్ ఒకరు. ఈయన ఎన్నో బుల్లితెర కార్యక్రమాలలో ప్రసారమవుతున్నటువంటి డాన్స్ షోలకు కొరియోగ్రాఫర్ గా పని చేస్తూ అనంతరం సినిమాలలో అవకాశాలను అందుకున్నారు. ఇలా తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా తమిళ కన్నడ సినిమాలకు కూడా ఈయన కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక జానీ మాస్టర్ ఒకవైపు కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు ఈటీవీలో ప్రసారమవుతున్నటువంటి బిగ్గెస్ట్ డాన్స్ షో ఢీ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు ఈ కార్యక్రమానికి శేఖర్ మాస్టర్ సదా వంటి వారు జడ్జిలుగా వ్యవహరించేవారు. అయితే ప్రస్తుతం శేఖర్ మాస్టర్ బిజీ కావడంతో జానీ మాస్టర్ తో పాటు హీరోయిన్ ప్రణీత వంటి వారు ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

ప్రతి బుధవారం ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమం ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఎంటర్టైన్ చేస్తోంది.. ఇకపోతే ఈ బుధవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో కంటెస్టెంట్లు తప్పుగా నామినేట్ చేయడం.. ఒకరి ప్రోత్సాహంతో మరొకరిని టార్గెట్ చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ విషయం తెలిసి జానీ మాస్టర్ కోపంతో ఊగిపోయి ఏకంగా మైక్ విసిరి కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ప్రోమో వైరల్ గా మారింది.

జానీ మాస్టర్ అంత కోపం వ్యక్తం చేయడానికి గల కారణం ఏంటనే విషయానికి వస్తే..సాకేత్ మరో కంటెస్టెంట్ పై జానీ మాస్టర్ కోపంతో ఊగిపోయారు. అసలు ఢీ అంటే ఏమనుకుంటున్నారు.. అంటూ మైక్ విసిరికొట్టెయ్యడమే కాదు.. ఢీ షో నుంచి వాకౌట్ చేసిన ప్రోమో వైరల్ గా మారింది. అసలు ఎందుకు జానీ మాస్టర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు అనే విషయం చాలా ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది జానీ మాస్టర్ పై వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. జానీ మాస్టర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లి ఉండాల్సింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా స్టేజ్ పైనే మైక్ విసిరి వేసినటువంటి ఈయన బిగ్ బాస్ హౌస్ లోకి కనుక వెళ్లి ఉంటే ఎన్నిసార్లు మైక్ విసిరి కొట్టేవారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇకపోతే కొరియోగ్రాఫర్ గా బిజీగా ఉన్నటువంటి ఈయన మరోవైపు జనసేన ప్రచార కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్న సంగతి మనకు తెలిసిందే. జనసేన పార్టీ క్యాంపెయినర్ గా జానీ మాస్టర్ నియమించిన సంగతి తెలిసిందే. ఇలా జనసేన పార్టీ కార్యక్రమాలలో కూడా ఈయన పాల్గొంటూ ఉన్నారు.


Click it and Unblock the Notifications











