జానీ మాస్టర్ పెద్ద మనసు... లైవ్‌లో నటి తల్లికి ఊహించని సాయం

టాలీవుడ్‌లో స్టార్ కొరియోగ్రాఫర్‌గా వెలుగొందుతున్నారు జానీ మాస్టర్. స్టార్స్ ఇమేజ్, బాడీ లాంగ్వేజ్‌ని బట్టి డ్యాన్స్ కంపోజ్ చేయడంలో ఆయనది అందే వేసిన చేయి. ఎన్నో హిట్ చిత్రాలకు కొరియోగ్రఫి అందించి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ చిత్రాలకు డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా సేవలందించారు. రెండేళ్ల క్రితం ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదై కెరీర్‌పై ప్రభావం చూపించింది. ఇక జానీ మాస్టర్ కెరీర్ ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ పడిలేచిన కెరటంలా తిరిగొచ్చారు జానీ మాస్టర్.

తన వద్ద పనిచేసే మహిళా కొరియోగ్రాఫర్ ఆయనపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. దీనిపై జానీని పోలీసులు అరెస్ట్ చేయడంతో కొన్నాళ్లు జైళ్లో ఉండొచ్చారు. ఈ కేసు కారణంగా జానీ మాస్టర్‌కు ప్రకటించిన బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డ్‌ను భారత ప్రభుత్వం రద్దు చేసింది. ఈ వివాదం సమయంలో పలువురు ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. లైంగిక వేధింపుల కేసు నుంచి బయటపడిన జానీ మాస్టర్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. వరుస పెట్టి హిట్ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న పెద్దిలో చికిరి చికిరి సాంగ్‌లో జానీ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్‌.. యూత్‌ని ఊపేస్తున్నాయి. ఇవి కాకుండా మరిన్ని సినిమాలకు ఆయన పనిచేస్తున్నారు.

Jani Master Wins Hearts with Generous Gesture in Mass Jathara TV Show

మరోవైపు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన డ్యాన్స్ అసోసియేషన్‌లోనూ తన పట్టుుని నిలుపుకునేందుకు జానీ మాస్టర్ తెలివిగా వ్యవహరించారు. గతేడాది జరిగిన తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (టీఎఫ్‌టీడీడీఏ) ఎన్నికల్లో తన సతీమణి సుమలత పోటీకి దించి ఆమెను గెలిపించారు. ఇండస్ట్రీలో ఏ డ్యాన్స్ మాస్టర్‌తోనూ తనకు వివాదాలు లేవని.. అందరూ నాకు చాలా ఇష్టమని, అందరూ కలిసి పనిచేయడం వల్లే ఇవాళ తెలుగు సినిమా స్థాయి పెరిగిందని జానీ మాస్టర్ పేర్కొన్నారు.

సినిమాలతో పాటు బుల్లితెరపైనా ఆయన యాక్టీవ్ అవుతున్నారు. అంతకుముందు నుంచే పలు డ్యాన్స్ షోలు, రియాలిటీ షోలకు జానీ మాస్టర్ జడ్జిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జెమినీ టీవీలో ప్రసారమవుతున్న మాస్ జాతర షోకి నవదీప్, బిందు మాధవిలతో కలిసి జానీ మాస్టర్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. గత కొంతకాలంగా ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తాజాగా తన పెద్ద మనసు చాటుకున్నారు జానీ మాస్టర్.

ఓ స్కిట్ పూర్తయిన తర్వాత అభినందించే సమయంలో అందరూ బాగా చేశారని జానీ మాస్టర్ మెచ్చుకున్నారు. అందులో శోభ అనే అమ్మాయి డల్‌గా ఉండటాన్ని గ్రహించిన ఆయన.. ఎందుకు డల్‌గా ఉన్నావని అడిగారు. వాళ్ల అమ్మకి ఇష్యూ ఉందని.. ఈ రోజు సర్జరీ ఉందని యాంకర్‌గా ఉన్న అమర్‌దీప్ చౌదరి చెబుతాడు. అమౌంట్ అడ్జస్ట్ కాలేదని అందుకే ఇలా ఉన్నానని ఆమె చెప్పారు. ఎంత కావాలని జానీ మాస్టర్ అడగ్గా.. రెండు లక్షలు కావాలని.. మా దగ్గర 1.50 లక్షలు ఉన్నాయని శోభ చెప్పింది. అది విని చలించిపోయిన జానీ మాస్టర్.. ఆ 1.50 లక్షలు, ఇంకో 50 లక్షలు మొత్తం నీ దగ్గరే పెట్టుకో. 2 లక్షల రూపాయలు ఎపిసోడ్ అవ్వగానే నీకు ఇస్తానని జానీ మాస్టర్ చెప్పాడు. మా అందరి బ్లెస్సింగ్స్ నీకుంటాయి, మీ అమ్మగారు బాగుంటారని చెప్పాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. జానీ మాస్టర్ పెద్ద మనసును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

Read more about: jani master movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X