Brahmamudi January 10th చావు బతుకుల మధ్య అప్పు... ఇంట్లోంచి వెళ్లిపోయిన కావ్య...!
బ్రహ్మముడి సీరియల్ ఈవారం కూడా ట్విస్టులతో సాగుతోంది. ఇక నేటి ఎపిసోడ్ (బ్రహ్మముడి జనవరి 10వ ఎపిసోడ్)లో అప్పుకు పెళ్లి చేయాలని మూర్తి ఫ్యామిలీ అనుకుంటుంది. ఇక పెళ్లి సంబంధాలు చూసే అతను ఫోటోలు చూపిస్తుంటాడు. డబ్బులు లేకపోయినా పర్వాలేదు.. ఫ్యామిలీని చూసుకునే అబ్బాయిని చూపించమని చెప్తుంది. పెళ్లి సంబంధాలు చూసే వ్యక్షి షాక్ అవుతాడు. మీకు డబ్బులు ఉంటే సరిపొద్ది కదా.. ఇలా మాట్లాడుతున్నారు అని అడుగుతాడు.
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే తెలుసు కదా. మా కనకం ఆ స్టేజ్ కూడా దాటిపోయిందని అన్నపూర్ణమ్మ అంటుంది. మా అప్పుకు మంచి వాడు అయితే చాలని కనకం క్లారిటీ ఇస్తుంది. దాంతో ఒక ఫొటో చూపించి.. ఈ అబ్బాయికి కట్నం కూడా వద్దు.. అమ్మాయి అర్థం చేసుకునేది అయితే చాలు అని ఫోటో చూపిస్తాడు. కనకం చూసి బాగున్నాడు కదా.. మన అప్పుకి ఈడు జోడు అని చెప్తుంది. ఇంతలో అప్పు వచ్చి ఏం జరుగుంతుందని అడుగుతుంది. దాంతో అంతా సైలెంట్ అయిపోతారు.

ఏంటీ అంతా సైలెంటుగా ఉన్నారు.. ఎవరితో ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు అంటూ పెళ్లి సంబంధాలు చూసే వ్యక్తి అప్పు దగ్గరకు వెళ్తాడు. కట్ చేస్తే... అతని వెంట రాడ్ పట్టుకుని అప్పు వెంటపడుతుంది. అమ్మాయికి సంబంధాలు చూడమన్నారు కానీ, పిచ్చి ఉందని చెప్పలేదంటూ అతను పరుగెత్తుతాడు. తర్వాత ఇంట్లోకి వచ్చిన అప్పును పెళ్లి చేసుకోవా, ఇలాగే ఉంటావా అని అడుగుతుంది కనకం. అవును, ఇలాగే ఉంటాను. మీకు ఇబ్బంది అయితే చెప్పండి ఇంకో దారి చూసుకుంటానని అప్పు చెప్పి వెళ్లిపోతుంది.
కనకం ఆగమని చెప్తుంది. ఇప్పుడేం వెళ్లట్లేదు.. జాబ్ కోసం వెళ్తున్నా అని అప్పు అంటుంది. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో సత్యనారాయణ పూజకు కావ్య అన్ని సిద్ధం చేస్తుండగా... అక్కడికి వచ్చిన రుద్రాణి ఇవాళ నీ పని అయిపోయినట్లే అని దీపపు కుందెను కింద పడేస్తుంది. దాంట్లోని నూనే రుద్రాణి చీరపై పడుతుంది. ఎవరితో పెట్టుకున్న సరే. దేవుడితో పెట్టుకోవద్దు అని మనసులో రుద్రాణి అనుకుంటుంది. ఆ తర్వాత ఏంటీ కావ్య ఇలా చేశావ్ అని ఆ తప్పును కావ్యపై నెట్టివేస్తుంది.
దాంతో అప్పుడే వచ్చి ధాన్యలక్ష్మీ ఫైర్ అవుతుంది. దీపపు కుందె కింద పడిందంటే ఎంత అరిష్టం. నీకెందుకు ఇవన్ని. నువ్ కాలు పెడితే అరిష్టం అంటూ తిడుతుంది. మిమ్మల్నే అత్తయ్య అనేది అని స్వప్న సెటైర్స్ వేస్తుంది. నేనేం చేశాను.. ఇదంతా కావ్య అని కావ్యపై నెట్టెస్తోంది. నా కొడుకు కోడలు పూజ చేస్తుంటే నీకు ఇష్టం లేదు. వాళ్లు సంతోషంగా ఉండక్కర్లేదు కదా. అందుకే ఇలా చేశావని ఫైర్ అవుతుంది ధాన్యలక్ష్మి. మా అత్తయ్యతో చేయించండి పూజ.
ఆమె అంత ముత్తైదువు ఈ ప్రపంచంలోనే లేదు. స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని, ఆ మేకప్ లో గ్లామర్ గా పూజ చేస్తుందని సెటైర్స్ వేస్తుంది. ఆమె ఐరన్ హ్యాండ్ తో పూజా చేస్తే అంతా బాగుంటుందని స్వప్న అంటుంది. ఇష్టం లేనప్పుడు దూరంగా ఉండొచ్చు కదా. పెద్ద ఆరిందలా అన్నింటిల్లో ఎందుకు దూరుతావ్ అని కావ్యను అపర్ణ తిడుతుంది. ఆపండి. మీరంతా ఇప్పుడు వచ్చారు. ఏదో చిన్న తప్పు జరిగితే అంతా కావ్యను అంటున్నారు. ఇప్పటిదాకా రెడీ అయి ఇప్పుడు వచ్చి అంటున్నారేంటీ అని సుభాష్ అంటాడు.
చిన్న తప్పుకు ఇంతమంది ముందు వదినను అవమానించడం అవసరమా అమ్మ అని కల్యాణ్ అంటాడు. అవసరమేరా.. లేకుంటే మీ అమ్మ కడుపు మంట ఎలా చల్లారుద్ది అని ఇందిరాదేవి కౌంటర్ వేస్తుంది. కావ్య గురించి మీకు తెలియట్లేదు అత్తయ్య అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఒక చిన్నతప్పు జరిగితే ఆ దేవుడి కటాక్షం ఉండదని ఎవరు చెప్పారు. మీకు నచ్చకుంటే సూటిగా చెప్పండి. అంతేకానీ, అరిష్టం అని మాట్లకండి. మీకు నగలపై ఉన్న శ్రద్ద పూజపై ఎక్కడ ఉందని ప్రశ్నిస్తుంది.
నాకు ఇన్నేళ్లు వచ్చాయి... నాకు లేవు మూఢనమ్మకాలేవు అంటూ ఇందిరాదేవి చెప్తుంది. మనసులో ఎలాంటి కల్మషం లేకుండా పూజ చేస్తే చాలని చెప్తుంది. నాకు ముగ్గురు మనవళ్లు... పూజలో రాహుల్ స్వప్న, రాజ్ కావ్య కూడా కూర్చుంటారు అని ఇందిరాదేవి చెబుతుంది. మరోవైపు పిజ్జా షాపుకు ఉద్యోగం కోసం వెళ్తుంది అప్పు. నీకు ఇక్కడ జాబ్ ఉంటే కదా. నీకు నచ్చినప్పుడు వచ్చి చేస్తా అంటే కుదరదు. లేదంటే నీ రిచ్ ఫ్రెండ్‌తో తిరుగుతావ్. అతను తలుచుకుంటే నీకు ఇలాంటి షాపే పెట్టిస్తాడు అంటూ నానా మాటలు అంటాడు.

నేను వాడుకుందామని ఫ్రెండ్ షిప్ చేయలేదు. వాడు జస్ట్ ఫ్రెండ్ అంతే అని అప్పు చెప్తుంది. ఆ గోల నాకెందుకు అప్పు. నీలాంటివాళ్లకు నేను జాబ్ ఇవ్వలను. డిస్టర్బ్ చేయకుండా వెళ్లు అంటాడు షాప్ ఓనర్. దాంతో అప్పు వెళ్లిపోతుంది. మరోవైపు ధాన్యలక్ష్మీ దగ్గరికి వెళ్లిన అనామిక తనకు కావ్యతో కలిసి పూజ చేయడం ఇష్టం లేదంటుంది. మనసులో అంత కల్మషం పెట్టుకున్నవాళ్లతో మనస్ఫూర్తిగా ఎలా పూజ చేయాలి అంటుంది. నాకు ఇష్టం లేదని చెప్పాను. మీరు ఏం చెబితే అది చేస్తానని అనామిక చెప్తుంది.
ఇందిరాదేవి, అపర్ణ మాట్లాడుకుంటారు. వాళ్ల దగ్గరికి వెళ్లిన ధాన్యలక్ష్మీ అనామికకు కావ్యతో కలిసి పూజలో కూర్చోవడం ఇష్టం లేదంట అని చెప్తుంది. ఆ మాటలు చాటున ఉండి వింటుంది అనామిక. ఇష్టం లేకుంటే నచ్చ జెప్పాలి. అది అత్తలుగా మీ బాధ్యత. మీకు పెళ్లైన కొత్తలో ఒకరంటే ఒకరికి పడేది కాదు. నేను అలాగే ఊరుకుని ఉంటే మీరు ఇలా ఇప్పుడు మాట్లాడుకునేవారా అని ఇందిరాదేవి అంటుంది. మగవాళ్లు ఎంత తెలివి అయినవారు అయినా సరే.. భార్యల ఒక పుల్లవిరుపు మాట చాలు.. కుటుంబాలు నాశనం అవ్వడానికి... అంటూ క్లాస్ ఇస్తుంది.
అనామికకు నచ్చజెప్పు. అందులో అర్థం లేదని, ఇద్దరు కలిసిపోయేలా చేయు. ఇప్పుడు ఉన్న బాధే ద్వేషంగా మారుతుంది. కలిసి ఉండటం అంటే గదుల్లో ఉండటం కాదు.. ఒకరినొకరిని అర్ధం చేసుకుని మెలగాలి. ఇది నేనే చెప్పగలను కానీ, అత్తగా నీకు గౌరవం దక్కాలని చెబుతున్నా అని ఇందిరాదేవి అంటుంది. సరే అత్తయ్య అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో చాటున విన్న అనామిక వెళ్లిపోతుంది.
మరోవైపు చీర కుచ్చులు సరిగా సెట్ కావట్లేదు అని అత్త అంటూ గట్టిగా అరుస్తుంది స్వప్న. దాంతో రుద్రాణి, రాహుల్ వస్తారు. కుచ్చులు పెట్టమని స్వప్న అనడంతో షాక్ అవుతారు రుద్రాణి, రాహుల్. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్ లో అప్పుకు యాక్సిడంట్ అయినట్లు కావ్యకు కాల్ చేసి చెబుతుంది కనకం. దాంతో నేను వెనుక నుంచి సైలెంటుగా వెళ్తాను. వాళ్లతో ఎలాగైనా పూజ చేయించండి అని రాజ్ తో కావ్య చెప్పి వెళ్లిపోతుంది. రాజ్ ఒక్కడే కిందకు వెళ్లి కళావతి బయటకు వెళ్లందంటాడు. దాంతో ఇవాళ ఎలాగైనా పూజలో రాజ్, కావ్య కూర్చోవాల్సిందే ఆర్డర్ వేస్తుంది ఇందిరాదేవి.


Click it and Unblock the Notifications











