Brahmamudi January 11th యాక్సిడెంట్ విషయం తెలుసుకున్న కల్యాణ్... కోమాలోకి అప్పు?
బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్( బ్రహ్మముడి సీరియల్ జనవరి 11వ తేదీ ఎపిసోడ్) అత్త అని స్వప్న గట్టిగా అరుస్తుంది. స్వప్న అరవడంతో రుద్రాణి, రాహుల్ పరుగెత్తుకు వస్తుంది. ఏమైందని అంతా గట్టిగా అరిచావ్ అని రుద్రాణి అంటే.. నాకు చీర కుచ్చిళ్లు సెట్ కావట్లేదని చెప్తుంది స్వప్న. దాంతో రుద్రాణి, రాహుల్ ఇద్దరూ షాక్ అవుతారు. ఏంటే నీ కాళ్ల దగ్గర కూర్చుని నీకు కుచ్చిళ్లు సెట్ చేయాలా అని రుద్రాణి ఫైర్ అవుతుంది. దాంతో అవును అని స్వప్న గట్టిగా అరుస్తుంది.
రుద్రాణి రాహుల్ వైపు చూస్తే.. బస్టాండ్ అడ్రసా.. నా బతుకే బస్టాండ్ అయిందనుకుంటూ ఫోనులో మాట్లాడుకుంటూ వెళ్లిపోతాడు. మళ్లీ కుచ్ఛీల్లు పెట్టమని స్వప్న అడగడంతో.. వెంటపడి మరి స్వప్నను రుద్రాణి కొడుతుంది రుద్రాణి. వంగొపెట్టి చేతితో బాదుతుంది. స్వప్న చిటికేసి.. ఊహల్లో నన్ను కొట్టింది చాలు గానీ రియాలిటీకి రండి అని స్వప్న అంటుంది. అలా చేయాలని ఎప్పుడూ అనుకోకు. చీర కట్టుకోడానికి ఆ చేతులు ఉండవు అంటూ స్వప్న అంటుంది.

దాంతో రుద్రాణి చేసేదిలేక స్వప్న కాళ్ల దగ్గర కూర్చుని కుచ్చిల్లు సరిచేస్తుంది. అది అవమానంగా ఫీల్ అవుతుంది. ఇట్లు మీ భవదీయుడు అన్నట్లు నా కళ్ల దగ్గర భలే ఉన్నావ్ అత్త అని స్వప్న సెటైర్ వేస్తుంది. తర్వాత రాహుల్ దగ్గరికి రుద్రాణి వెళ్లి అలా తప్పించుకున్నావేంట్రా అని అడిగుతుంది రుద్రాణి. నువ్ చేయకుంటే నన్ను చేయమంటుంది. పెళ్లాం కాళ్లు పట్టుకోవడమంతా చెండాలం ఇంకోటి ఉండదు అని రాహుల్ అంటాడు. మరి నీ తల్లి పట్టుకుంటే బాగుంటుందా అంటే మళ్లీ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లిపోతాడు రాహుల్.
మరోవైపు సత్యనారాయణ పూజకు అనామిక, కల్యాణ్ వస్తారు. వారిని చూసి ధాన్యలక్ష్మీ మెచ్చుకుంటుంది. అప్పుడే రాహుల్, స్వప్న వస్తారు. మరోవైపు పైన గదిలో రాజ్ రెడీ అవుతుంటాడండగా.. కావ్య రాజ్ మీద సెటైర్స్ వేస్తుంది. ఇంతలో కావ్యకు కనకం కాల్ చేస్తుంది. కనకం ఏడుస్తూ మాట్లాడుతుంది. సిచ్యూవేషన్ అర్థం చేసుకున్న రాజ్.. లౌడ్ స్పీకర్లో పెట్టమని అంటాడు. అప్పుకు యాక్సిడెంట్ అయిందని, స్పృహలో కూడా లేదని ఏడుస్తూ చెబుతుంది కనకం. దాంతో రాజ్, కావ్య షాక్ అవుతారు.
ఇంకేంటి ఆలోచిస్తున్నావ్. పద అప్పు దగ్గరికి వెళ్దాం అని రాజ్ అంటే.. నేను ఒక్కదాన్నే వెళ్తాను. మీరు ఇక్కడే ఉండండి. ఇప్పటికే అనామికకు నాపై చాలా కోపం ఉందని కావ్య చెప్తుంది. ఇప్పుడు నా వల్ల పూజ ఆగిపోతే మళ్లీ ఫీల్ అవుతుందని వివరిస్తుంది. సరే అని రాజ్ అంటాడు. తర్వాత రాజ్ కిందకు దిగుతాడు. అంతా కావ్య ఎక్కడ అని అడుగుతారు. చిన్న పని ఉండి బయటకు వెళ్లిందని రాజ్ అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు. ఇంత పెద్ద పూజ పెట్టుకుని ఇప్పుడు బయటకు వెళ్లడం ఏంటీ అని రుద్రాణి సెటైర్ వేస్తుంది.
నీకెందుకు అత్త.. అని స్వప్న ఆపుతుంది. మంచిది అయింది. ఆమె ఇప్పుడు వెళ్లి ఏం రాచకార్యం వెలగబెట్టాలట. ఆ మినిస్టర్ వచ్చేదాకా ఆగడం ఎందుకు. తను లేకుంటే మంచిదే. వీళ్లు లేకుండానే పూజ జరిపిద్దాం అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో అపర్ణ ఫైర్ అవుతుంది. నీ ఉద్దేశం ఏంటీ ధాన్యలక్ష్మీ. నీ కొడుకు కోడలు మాత్రమే పూజలో కూర్చుంటే సరిపోతుందా. ఇది ఈ ఇంటి వారసులతో చేయించే పూజ. కావ్య నాకు నచ్చకపోయినా రాజ్‌కు భార్య. పూజలో కూర్చోవాల్సిందే. నీకు నీ కోడలు వచ్చినప్పటినుంచి నీకు స్వార్థం పెరిగిపోయింది అని మండిపడుతుంది అపర్ణ.
దాంతో ధాన్యం సైలెంట్ అయితే.. ఆచితూచి మాట్లాడవే అని ప్రకాషం అంటాడు. మీరు కూడా మా అత్తలా నెగెటివ్ గా మాట్లాడుతున్నారని స్వప్న అంటుంది. మీరు పూజలో కూర్చోండి అని రాజ్ అంటే.. లేదు అన్నయ్య. మీరు ఇంటికి పెద్దోడివి. వదిన రావడానికి ఎంత టైమ్ పడుతుందని కల్యాణ్ అడిగితే.. గంట పట్టొచ్చు అని రాజ్ అంటాడు. దాంతో అంతా ఎదురుచూస్తుంటారు. మరోవైపు హాస్పిటల్‌కు కావ్య వెళ్తుంది. అప్పు పరధ్యానంగా డ్రైవ్ చేస్తుంటే ఓవరో కారు వాడు వచ్చి ఢీకొట్టి పోయాడని చెప్తుంది.
కృష్ణమూర్తి దగ్గరికి వెళ్లిన కావ్య ఓదార్చుతుంది. నాన్న బాధపడకండి. అప్పుకు ఏం కాదు. అని కావ్య అంటుంది. అప్పు బతికే ఉంటుందా అని కృష్ణమూర్తి అంటాడు. దాంతో ఇద్దరూ షాక్ అవుతారు. మీరే ఇలా మాట్లాడితే ఎలా అయ్యా అని కనకం అంటుంది. ఇంతలో డాక్టర్ వచ్చి.. అప్పుకు బ్లడ్ చాలా పోయింది. అసలే రేర్ బ్లడ్ గ్రూప్. హాస్పిటల్లో లేదు. డోనర్ కావాలని చెబుతుంది. ఏ బ్లడ్ అని అడిగితే ఓ నెగిటివ్ అని చెప్తుండి డాక్టర్. దాంతో ఇప్పుడు మనల్ని కాపాడేది అల్లుడు గారు ఒక్కరే అని కనకం అంటుంది. ఏదో ఒకటి చేస్తాను అని కావ్య చెప్తుంది.

మరోవైపు కావ్య కోసం అంతా వెయిట్ చేస్తుంటారు. ఇంతలో పూజ పీటపై నుంచి అనామిక లేచి వెళ్లిపోతుంది. ఎందుకు లేచావమ్మా అని అపర్ణ అడుగ్గా... ఈ పూజ జరుగుతుందని అనిపించట్లేదని అనామిక చెప్తుంది. సరిగ్గా చెప్పావ్. నాకు కూడా అది ఎప్పుడో అర్థమైందని ధాన్యలక్ష్మీ అంటుంది. ఏంటీ అత్తాకోడళ్లు ఒకే పాట పాడుతున్నారని ఇందిరాదేవి అంటుంది. కావ్యకు పూజ జరగడం ఇష్టం లేదు అందుకే వెళ్లిపోయింది. తనకు ఇష్టం లేని పూజ ఎందుకు చేయడం అని అనామిక అంటుంది.
ఏంటీ అనామిక ఇది. మా వదినను అర్థం చేసుకుంది ఇంతేనా అని కల్యాణ్ అంటాడు. నిజాలు తెలియకుండా ఒక ఉద్దేశానికి రాకూడదు అని రాజ్ అంటాడు. పూజ కంటే అవసరమైన పని ఏముంది. అలా అయితే అందరికీ చెప్పి వెళ్లొచ్చు కదా అని అనామిక అంటే.. భర్తకు చెబితే ఇంట్లోవాళ్లకు చెప్పినట్లే అని ఇందిరాదేవి అంటుంది.
ఇక బ్రహ్మముడి తర్వాతి ఎపోసిడ్ లో భార్యను బాగానే వెనుకేసుకొస్తున్నావ్ కానీ.. పూజకంటే అత్యవసర పని ఏముందని రుద్రాణి అడుగుతుంది. అత్తా.. నిజంగా అత్యవసర పరిస్థితి ఉంది కాబట్టే వెళ్లింది అని రాజ్ అంటాడు. ఏమైంది అన్నయ్య అని కల్యాణ్ అడుగుతాడు. అప్పుకు యాక్సిడెంట్ అయిందిరా అని రాజ్ అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు. స్వప్న బాధగా చూస్తుంది. మరోవైపు డోనర్స్ దొరికారా అని డాక్టర్ అడిగితే.. అదే ట్రై చేస్తున్నామని కావ్య అంటుంది. ఇంకెంతసేపు అమ్మా.. పేషంట్ కోమోలోకి వెళ్లిపోయే అవకాశం ఉందని డాక్టర్ చెబుతుంది. దాంతో కావ్య షాక్ అవుతుంది.


Click it and Unblock the Notifications











