Brahmamudi January 13th కల్యాణ్‌, అనామకకు ఫస్ట్ నైట్‌..కంట్రోల్‌లో పెట్టుకునేందుకు ప్లాన్!

బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 13వ తేదీ ఎపిసోడ్‌ లో అప్పు ప్రాణాలు కాపాడేందుకు కల్యాణ్ వచ్చి బ్లడ్ ఇస్తాడు. ఇక అప్పు ప్రాణాలు కాపాడేందుకు దేవుడిలా వచ్చావ్ అని కల్యాణ్ కు కనకం, కృష్ణమూర్తి దండం పెడుతారు. నా ఫ్రెండును కాపాడుకునే అవకాశం ఆ దేవుడు నాకు ఇచ్చాడు అంతే అని కల్యాణ్ చెప్పుకువస్తాడు. మీరు పూజ మధ్యలో నుంచి వచ్చినట్లున్నారు... వెళ్లండి... మేము చూసుకుంటాం అని కనకం అంటుంది. కావ్య నువ్ కూడా వెళ్లమ్మా అని కృష్ణమూర్తి చెప్తాడు.

మరోవైపు దుగ్గిరాల ఇంట్లో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో కావ్య, కల్యాణ్ ఇంటికి వస్తారు. మీకు చెప్పి పూజ చెడగొట్టడం ఇష్టం లేక.. ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయామని కావ్య అంటుంది. సారీ అమ్మమ్మ అని చెప్తుంది. ఇప్పుడు అప్పుకి ఎలా ఉందని ఇందిరాదేవి అంటుంది. కవి గారు టైమ్‌ కి వచ్చి అప్పు ప్రాణాలు నిలబెట్టాడు అని కావ్య అంటుంది. దాంతో రాజ్, స్వప్న ఊపిరిపీల్చుకుంటారు. అనామిక దగ్గరికి వెళ్లి.. నా వల్ల కవిగారు అక్కడికి రావాల్సి వచ్చింది. సారీ అనామిక అని కావ్య చెప్తుంది.

January 13th 2024 Episode number 305 in Brahmamudi Telugu Serial

నువ్ సారీ చెప్పడం ఏంటో.. ఇంట్లో ఏదైనా తలపెడితే.. నువ్ తలపెడతావ్‌ గా అంటుంది ధాన్యలక్ష్మి. పూజ మొదలు కాకముందే దీపపు కుందెను పడగొట్టింది. ఇప్పుడు పూజను ఆపేసిందని మండిపడుతుంది. ఈ మహాతల్లి ఏదైనా అనుకుంటే జరిగేదాకా ఊరుకోదు కదా అని ఫైర్ అవుతుంది. అదేంటి చిన్నత్తయ్యా.. ఏం జరిగిందో తెలిసి కూడా అలా అంటున్నారు అని కావ్య చెప్పుకువస్తుంది.

నువ్ అసలు అని రుద్రాణి అంటే.. మధ్యలోనే ఆపుతుంది స్వప్న. నువ్ మాట్లాడకు. ఇప్పటికే చాలా మాట్లాడవు. అసలు నీ మాటకు విలువ ఉందా అంటూ స్వప్న ఫైర్ అుతుంది. ఇంతటితో ఆపేయండి. జరిగింది తెలుసు కదా.. ఒకరి ప్రాణం కంటే.. ఇవన్నీ ముఖ్యమా.. ఇవాళ కాకుంటే రేపు అయినా పూజా పెట్టుకోవచ్చు. ఇదంతా వదిలేసి కల్యాణ్, అనామిక ఫస్ట్ నైట్ అని గుర్తు పెట్టుకుని దానికి ఏర్పాట్లు చేయండి అని ఇందిరాదేవి చెప్తుంది.

అనామిక దగ్గరికి వెళ్లి.. కల్యాణ్ సారీ చెబుతాడు. అయ్యే పర్లేదు. మీరు ఇవాళ ఒక ప్రాణం కాపాడారని పైకి చెబుతుంది. చూశారా వాళ్లు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు అని ఇందిరాదేవి అంటుంది. మరోవైపు అప్పు ఎంత వద్దనుకుంటే కల్యాణ్ అంత దగ్గరిగా వచ్చేలా దేవుడు చేస్తున్నాడని కనకం అంటే.. కావ్యను ఆ ఇంట్లో ఏం అంటున్నారో అని కృష్ణమూర్తి బాధపడతాడు. ఇంతలో స్వప్న కాల్ చేసి అప్పు ఎలా ఉందని అడుగుతుంది.

ఇప్పుడు బాగానే ఉందని కనకం అంటే.. ఈమాత్రం దానికి ఎందుకు కాల్ చేసి రమ్మన్నావ్ అంటూ స్వప్న ఫైర్ అవుతుంది. ఇక్కడ కావ్యపై అంతా కారాలు మిర్యాలు నూరుతున్నారని చెప్తుంది. బాగా అవసరం అయితే తప్పా ఇంకోసారి కావ్యకు కాల్ చేయకండి అని స్వప్న కాల్ కట్ చేస్తుంది. అదే విషయం కృష్ణమూర్తికి చెబుతుంది. ఇంతలో డాక్టర్ పిలుస్తారు. అప్పును డిశ్చార్జ్ చేస్తామని చెప్తుంది. మరోవైపు అనామిక బాధపడుతుంది. అనామికను కల్యాణ్ ఓదార్చుతాడు.

ఇలాంటి మంచి మెమొరబుల్ మళ్లీ దొరుకుతుందా అని అనామిక అంటుంది. ఇంతలో కల్యాణ్‌ను గుప్పిట్లో పెట్టుకోమ్మని తల్లి చెప్పిన మాట గుర్తుకు తెచ్చుకున్న అనామిక సైలెంట్ అవుతుంది. ఇకముందు నేను నాకు మాత్రమే మీరు ఇంపార్టెంట్ ఇవ్వాలని మాట తీసుకుంటుంది. నా గతం ఎలా ఉన్నా ఫ్యూచర్‌లో నీకంటే నాకు ఎవరు ఎక్కువ కాదు అని కల్యాణ్ చెప్పి ప్రామిస్ చేస్తాడు. ఇది చాలు. ఇక కల్యాణ్‌ను అప్పుతో మాట్లాడుకుండా చేయడానికి అని అనామిక మనసులో అనుకుంటుంది.

మరోవైపు అప్పుకు లక్ష 22 వేలు బిల్ అయిందని రిసెప్షనిస్ట్ చెప్పడంతో అంత డబ్బు ఎలా సర్దారో టెన్షన్ పడుతుంటారు కనకం, కృష్ణమూర్తి. కావ్యను అడిగితే మళ్లీ సమస్య అవుతుందని అనుకుంటారు. మరోవైపు రాజ్ ఫోన్‌లో మాట్లాడుతుంటే కావ్య వస్తుంది. తర్వాత మాట్లాడతా అని రాజ్ అంటే.. తర్వాత ఎందుకు, ఇప్పుడే మాట్లాడండి, రోజంతా మాట్లాడండీ అని ఏవేవో మాటలు అంటుంది. మరోవైపు డబ్బు ఎక్కడా పుట్టలేదని కనకంకు కృష్ణమూర్తి బాధగా చెబుతాడు.

అప్పు పిలుస్తోందని నర్స్ వచ్చి చెబుతుంది. కల్యాణ్‌ కు ఎందుకు చెప్పారని అప్పు అడిగితే.. కావ్య అల్లుడికి కాల్ చేస్తే అది తెలిసి కల్యాణ్ వచ్చాడు అని కృష్ణమూర్తి అంటాడు. ఇప్పుడు కావ్యను ఆ ఇంట్లోవాళ్లు ఏమంటారో. కల్యాణ్‌ను కూడా ఏదో ఒకటి అంటారు. ఇంకెప్పుడు ఎంతకష్టం వచ్చినా వాళ్లకు చెప్పకండి. మన చావేదో మనమే చద్దాం అని అప్పు అంటుంది. ఇంతలో డిశ్చార్జ్ రాసి చాలా సేపు అయింది. ఇంకా వెళ్లలేదేంటి అని నర్స్ వచ్చి అడుగుతుంది.

ఇంకా బిల్ కట్టలేదమ్మా అని కనకం అంటుంది. అదేంటీ మీ అల్లుడు గారు బిల్ కట్టేశారు కదా. మీకు తెలియదా అని నర్స్ అంటుంది. ఎవరు అని కనకం అడగ్గా... రాజ్ అంటే మీ అల్లుడే కదా. మేనేజర్‌ను పంపించి బిల్ మొత్తం కట్టేశారు అని చెప్తుంది. ఇక్కడా ఒక దేవుడు ఉంటే.. పైన దేవుడికి మొర పెట్టుకున్నాం. బిల్ ఎలా కట్టాలా అని ఆలోచిస్తున్నాం అని కనకం అంటుంది. బిల్ బావా కట్టాడా అని అప్పుఅంటుంది. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

తదుపరి ఎపిసోడ్ లో కల్యాణ్, అనామిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్లు ఇద్దరూ ఎప్పటికీ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి ఈ శోభనం విషయంలో జోక్యం చేసుకోవద్దని ధాన్యలక్ష్మి కావ్య దగ్గర మాట తీసుకుంటుంది. మరోవైపు ఏదైనా నీ చేయి పడుతుంది కదా. ఇందులో ఎందుకు చేయి పడటం లేదని రాజ్ అంటాడు. అక్కడికి వచ్చిన అనామిక.. అది నా విషయం కదా. తనకు ఇష్టం లేదేమో అంటుంది. దాంతో కావ్య వెళ్లిపోతుంది. నాపై కావ్యకు ఎప్పుడూ కోపం పోతుందో అని అనామిక అంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X