Brahmamudi January 12th అప్పు కోసం పూజను వదిలేసిన కల్యాణ్... ఇంతకీ ప్రాణాలను నిలబెట్టాడా?
బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్( బ్రహ్మముడి జనవరి 12వ తేదీ ఎపిసోడ్)లో కావ్య.. అప్పుకు యాక్సిడెంట్ కావడంతో.. ఆసుపత్రికి వెళ్తుంది. ఇక దాంతో ఇంట్లో గొడవ మొదలు అవుతుంది. ఎవరికి చెప్పకుండా ఎటు వెళ్లిందంటూ ఇంట్లోని వారంతా ఫైర్ అవుతూ ఉంటారు. వెళ్లాలనుకుంటే మీతోపాటు ఇక్కడ అందరికీ చెప్పి వెళ్లొచ్చు కదా అని రాజ్ ను అనామిక ప్రశ్నిస్తుంది. భర్తకు చెబితే అందరికీ చెప్పినట్లే. నీకు ఏదైనా ఉంటే నీ భర్తతో మాట్లాడుకో... రాజ్ ను అనే అర్హత నీకు లేదు అని ఇందిరాదేవి అంటుంది. ఇలా అందరి నోళ్లు మూయించకండి అత్తయ్య. ఇలా చేయడంతోనే కావ్య కళ్లు నెత్తిమీదకు వెళ్తున్నాయని ధాన్యలక్ష్మీ ఫైర్ అవుతుంది.
అవును అమ్మా. కావ్య కావాలనే వెళ్లింది. తనకు ఈ పూజ ఇష్టం లేదని రుద్రాణి అంటుంది. తనకు ద్వేషం, ఈర్శ్యతోనే వెళ్లిపోయింది అని ఆరోపణలు చేస్తుంది. అత్తా.. నిజనిజాలు తెలియకుండా అనొద్దని రాజ్ ఫైర్ అవుతాడు. బలమైన కారణం ఉండే వెళ్లిపోయిందని చెప్పుకువస్తాడు. అంత బలమైన కారణం ఏంటీ రాజ్. ఇప్పటివరకు నీ భార్యను బాగానే వెనుకేసుకొచ్చావ్. కానీ, పూజకంటే అత్యవసర పని ఏముందని రుద్రాణి ప్రశ్నిస్తుంది. అత్తా.. నిజంగా అత్యవసర పరిస్థితి ఉంది కాబట్టే వెళ్లిందని రాజ్ సమాధానం చెప్తాడు.

ఏమైంది అన్నయ్య అని కల్యాణ్ అడుగుతాడు. ఏమైందో చెప్పు లేకుంటే తలొకరు నింద వేసేలా ఉన్నారు అని సుభాష్ అంటాడు. కావ్యను ఒక్క మాట అనడం నాకు ఇష్టం లేదు. చెప్పు అని ఇందిరాదేవి అంటుంది. దాంతో అప్పుకు యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్ లో చేర్పించారు. అందుకే వెళ్లిపోయిందని రాజ్ అంటాడు. ఏంటీ అన్నయ్యా చెప్పేది. అప్పుకు యాక్సిడెంట్ అయిందా అని కల్యాణ్ షాక్ అవుతాడు.
ఇప్పుడు అర్థం అయిందా.. తను ఎందుకు వెళ్లిందో... తనతో పూజలో కూర్చోవడం ఇష్టం లేదని ఒకరు. తను కావాలనే బయటకు వెళ్లిందని మరొకరు నానా మాటలు అన్నారు. చెబితే పూజ ఎక్కడ ఆగిపోద్దో అని ఒంటరిగా ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయిందని రాజ్ అంటాడు. అన్నయ్య.. అప్పుకు యాక్సిడెంట్ అయితే నేను ఇక్కడే ఎందుకు ఉంటాను. నేను కూడా వెళ్తాను అని కల్యాణ్ అంటాడు. లేదు పూజా ఆగిపోవద్దనే కావ్య వెళ్లింది. సీరియస్ అయితే కాల్ చేస్తుంది. నువ్ పూజలో కూర్చో అని రాజ్ సర్ది చెప్తాడు.
కావ్యను అన్న మటాలు చాలు.. కల్యాణ్ నువ్వు పూజలో కూర్చో అని సుభాష్ అంటాడు. అవసరం అయితే కావ్య కాల్ చేస్తుంది. నువ్ కూర్చో అని ఇందిరాదేవి కూడా చెప్తుంది. దాంతో కల్యాణ్ పూజలో కూర్చుంటాడు. మరోవైపు బ్లడ్ బ్యాంక్స్ కి కావ్య కాల్ చేసి బ్లడ్ కోసం ట్రై చేస్తుంటుంది. ఇంతలో డాక్టర్ వచ్చి డోనర్ దొరికారా అంటే అదే ట్రై చేస్తున్నానని కావ్య చెప్తుంది. ఇంకా లేదా.. చాలా సీరియస్ గా ఉంది. పరిస్థితి మీకు అర్థం కావట్లేదు. టైమ్ కు రక్తం ఇవ్వకుంటే కోమాలోకి వెళ్లే అవకాశం ఉందని డాక్టర్ చెప్పి వెళ్లిపోతుంది.
ఈ పరిస్థితుల్లో అల్లుడు గారే కాపాడగలరు. ఒక్కసారి కాల్ చేయమ్మా అని కనకం అంటుంది. దాంతో కావ్య కాల్ చేస్తుంది. రాజ్ కు ఫోన్ వస్తే.. ఎవరన్నయ్యా వదిననా.. అని లేచి ఫోన్ తీసుకుంటాడు కల్యాణ్. ఏవండి అప్పుకు చాలా సీరియస్ గా ఉంది. రక్తం కావాలంటున్నారు. లేకుంటే కోమాలోకి వెళ్తుందని అంటున్నారని కావ్య ఏడుస్తూ రాజ్ అనుకుని చెప్తుంది.. నేను చాలా బ్లడ్ బ్యాంకుల్లో ట్రై చేశాను. కానీ దొరకట్లేదు. మీకు ఎవరైనా ఓ నెగెటివ్ బ్లడ్ ఉన్నవారు తెలిస్తే పంపిస్తారా అని అడుగుతుంది.

దానికి వదినా.. అప్పుకు సీరియస్ గా ఉంటే ఇప్పుడా చెప్పేది. నాది ఓ నెగెటివే నేను వస్తున్నాను అని కల్యాణ్ అంటాడు. కవిగారు మీరా.. మీరు పూజలో ఉండండి. మీ అన్నయ్యకు ఇవ్వండి అని కావ్య అంటుంది. లేదు వదినా నేను వస్తున్నాను అని కల్యాణ్ కాల్ కట్ చేసి కావ్య చెప్పింది చెబుతాడు. నేను వెళ్తున్నాను అని కల్యాణ్ అంటే.. నేను చూసుకుంటానురా.. నువ్ ఉండు అని రాజ్ అంటాడు. నువ్వెళ్లి ఏం చేస్తావ్ అన్నయ్య.. రక్తం ఇవ్వాల్సింది నేను అని కల్యాణ్ అంటాడు.
నేను ఇప్పటివరకు ఆగింది అనామిక ఫీల్ అవుతుందని... ఎవరు ఏమనుకున్నా సరే అప్పు నా ఫ్రెండ్. నా ఫ్రెండ్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. పూజ మధ్యలో వెళితే అపచారం అని ధాన్యలక్ష్మీ అంటే.. ప్రాణం కాపాడటం కోసం వెళితే దేవుడు శిక్షించడులే. క్షమిస్తాడు. నువ్ వెళ్లురా అని ప్రకాషం అంటాడు. దాంతో సారీ అనామిక అని చెప్పేసి వెళ్లిపోతాడు కల్యాణ్. ఇప్పుడు అర్థమైందా అత్తయ్య అని ధాన్యలక్ష్మీ అంటుంది. బాగా అర్థమైంది. ఈ ఇంట్లో మానవత్వం మచ్చుకు కూడా లేదని అర్థమైంది అని ఇందిరాదేవి అంటుంది.
ఇంటి కోడలికి ఆపద వస్తే.. ఎవరం ఏం చేయలేకపోయాం. వాడు బంధువులా కాదు. ఆత్మ బంధువులా వెళ్లాడు. ప్రాణం కాపాడేందుకు వెళ్లాడు. ఇందులో ఎవరి ఇష్ట అయిష్టాలతో సంబంధం లేదు అని సుభాష్ అంటాడు. హాస్పిటల్‌కు వెళ్లిన కల్యాణ్ అప్పుకు బ్లడ్ ఇస్తాడు. మీరు అప్పుని కాపాడటానికి మీరు వచ్చినందుకు సంతోషపడాలో.. అనామికను బాధ పెడుతున్నందుకు బాధపడాలో తెలియట్లేదని కావ్య అంటుంది. దేవుడు ఎక్కడికి పోడు. పూజ తర్వాత కూడా చేసుకోవచ్చు. కానీ, అప్పు పరిస్థితి వేరు అని కల్యాణ్ అంటాడు.
మరోవైపు పాపం అనామిక అనామకురాలు అయింది. కావ్యను అంటే అందరూ పైకి లేస్తారు. అప్పుకు యాక్సిడెంట్ అవ్వడం, కావ్య వెళ్లడం.. కల్యాణ్‌కు కాల్ చేసి రప్పించడం. ఇదంతా ఎంతో కావ్యంగా లిఖించినట్లు లేదా అంటూ రుద్రాణి కావ్య మీద కోపం వచ్చేలా చేసేందుకు మాట్లాడుతుంది. దానికి ధాన్యలక్ష్మి, అపర్ణలు ఆజ్యం పోస్టారు. ఇక స్వప్న కూడా రివర్స్ మాట్లాడుతుంది. మీరంతా ఎందుకు అంటున్నారు. కావ్య నాకే కదా కాల్ చేసింది. కల్యాణే లాగేసుకుని మాట్లాడాడని రాజ్ చెప్తాడు.
రేర్ బ్లడ్ గ్రూప్ కాబట్టి దొరక్కా నాకు కాల్ చేసింది. వాడు ఇస్తానని వెళ్లాడు. స్పష్టంగా ఉంది కదా. ఎందుకు మాటలు అంటున్నారు అని రాజ్ అంటాడు. ఆ తర్వాత సుభాష్ కూడా ఫైర్ అవుతాడు. ఇందిరాదేవి సపోర్టుగా మాట్లాడుతుంది. తర్వాతి ఎపిసోడ్ లో కల్యాణ్, కావ్య ఇంటికి వస్తారు. కవిగారు వచ్చి అప్పు ప్రాణాలు నిలబెట్టారు అని కావ్య చెబుతుంది. అనామిక సారి అని కావ్య అంటే.. ఎందుకు సారి. ప్రతిదాంట్లో నువ్ తల పెడతావ్ కదా. దీపపు కుందెను కిందపడేసినప్పుడే అనుకున్నాను. ఈ మహాతల్లి పూజ ఆపేస్తుందని అని ధాన్యలక్ష్మీ మాటలు అంటుంది.


Click it and Unblock the Notifications











