Brahmamudi January 16th శోభనం గదిలో అనామిక అసలు రంగు బయటకు... షాక్‌లో కల్యాణ్!
బాదుకుంటుంది. కొడుకు రాహుల్ వచ్చి... ఏమైంది మామ్.. ఎందుకు అరిచింది అని అడుగుతాడు. నీకు వినబడిందా ఎందుకు రాలేదు అని అడుగుతుంది. నువ్వు వెళ్లావ్ కదా అని.. అంటాడు రాహుల్. అది చెప్పింది చేయకపోతే.. కేసు పెడుతుందంట.. అని రుద్రాణి ఏడుస్తూ చెప్తుంది. నువ్వు చేస్తున్నవ్ కదా... అని రాహుల్ అంటే.. ఎంత కాలం చేయాలని అడుగుతుంది. బిడ్డ పుట్టే వరకు చేయాలి అని రాహుల్ చెప్తాడు.
పాయసం అడిగింది...పాయిజన్ కలిపి తేస్తాను అని రుద్రాణి అంటే.. ఆ పని మాత్రం చేయకు మమ్మీ మనం ఇద్దరం జైల్లో కూర్చోవాల్సి వస్తుందని అంటాడు. ఇంతలో స్వప్న గదిలోంచి ఏంటా ముచ్చట్లు అని అంటే.. రాహుల్ ఫోన్ వచ్చినట్లు వెళ్లిపోతాడు. మరోవైపు కల్యాణ్, అనామిక శోభనం ఏర్పాట్లు చేస్తుంటారు. ఓ వ్యక్తి గదిలో డెకరేషన్ చేస్తూంటాడు. ఎవరు నువ్వు అని రాజ్ అడిగితే... కావ్య మేడం పిలిపించిందని చెప్తాడు.

కావ్య దగ్గరకు రాజ్ వచ్చి... శోభనం గదిని ఎందుకు డేకరేట్ చేయడం లేదని అడుగుతాడు. అందరికి నా చేయి కలిసి రావాలని లేదుగా అని కావ్య చెప్తుంది. ఇక అటుగా వెళ్తున్న వచ్చిన అనామిక... నా విషయం కాబట్టి చేయడం లేదని రాజ్ తో అంటుంది. నా మీద ఎందుకు అంత అయిష్టం అని అనామిక అడుగుతుంది. నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి కావ్య వెళ్లిపోతుంది. ఇక ఈ మాటలన్నీ కల్యాణ్ కూడా వింటాడు.
కావ్య వంటింట్లో పనులు చేసుకుంటుంటే.. కల్యాణ్ వస్తాడు. కావ్య ఏమైంది కవిగారు.. ఏమైనా కావాలా అని అడుగుతుంది. మీ కోసమే వచ్చాను వదిన అంటాడు కల్యాణ్. నా ప్రతి విషయంలో మీ జోక్యం ఉండాలి.. కట్టుబాట్లతో, మూడనమ్మలతో ఓ ఆడపిల్ల కన్నీళ్లకు కారణం అయితే.. ఆ ఇల్లు పతనం అయినట్లే అని అంటాడు కల్యాణ్. నేను అలా కోరుకుంటానా.. అని కావ్య అంటే.. అయితే వచ్చి నా పనులన్నీ దగ్గరుండి చూసుకోండి అని కల్యాణ్ చెప్తాడు.
ఈరోజు తప్పు బట్టిన వాళ్లంతా తప్పైందే అనుకునేలా చేయండి అంటాడు కల్యాణ్. దానికి కావ్య థ్యాంక్స్ కవిగారు.. ఈ ఇంటికి వచ్చిన మొదటి రోజు పలకరించింది మీరు.. అన్నింట్లో తోడుగా ఉన్నారు.. అని కావ్య అంటుంది. మీరు కూడా నాకు అలాగే ఉన్నారు అని కల్యాణ్ అంటాడు. మరి అన్నయ్యను పిలిచి డెకరేట్ చేయండి అని కల్యాణ్ చెప్తాడు. సరే అని చెప్పి కావ్య అంటుంది. గదిలో రాజ్ పని చేసుకుంటూ ఉంటాడు.
ఏంటో విషయం చెప్పు అంటే.. విషయానికే రమ్మంటున్నాను అని కావ్య అంటుంది. ఏం మాట్లాడుతున్నవే నువ్వు అని కావ్య అంటుంది. శోభనానికి రమ్మంటున్నాను అని చెప్తుంది. బుద్దుందా అని రాజ్ అంటే.. ఉంది కాబట్టి శోభనం గదిని డేకరేట్ చేసేందుకు రమ్మంటున్నాను అని కావ్య అంటుంది. సరిగ్గా మాట్లాడటం రాదా అని రాజ్ అంటాడు. పెళ్లైయి ఇన్ని రోజులు అయింది.. ఓకే గదిలో ఉన్నాం.. ఏమైనా జరిగిందా అని కావ్య అంటుంది.
సరే కల్యాణ్ శోభనానికి ఏర్పాట్లు చేద్దాం అని కావ్య అంటుంది. పదా అని ఇద్దరు కలిసి కల్యాణ్ గదికి వెళ్తారు. అక్కడ పనిచేసే వ్యక్తిని బయటకు పంపించేస్తుంది కావ్య. ఇక కావ్య, రాజ్ కలిసి... కాసేపు టామ్ అండ్ జెర్రీలా మాట్లాడుకుంటారు. ఇక ఆ తర్వాత కావ్య అందంగా పూలను అమర్చుతుంది. మ్మ్.. బాగానే డెకరేట్ చేశాను అని రాజ్ అంటాడు. అవునా.. ఎవరు చేశారు చెప్పు అని కావ్య అనగా.. నువ్వు చేశావ్ నేను హెల్ప్ చేశాను అని రాజ్ అంటాడు.
ఇక పూల మంచాన్ని చూసి రాజ్ మురిసిపోతాడు. ఈ రాత్రికి ఇక్కడే ఉందామా అంటే.. హ అని అంటాడు. అవునా అని దగ్గరకు వస్తే.. పదా అని చెప్తాడు. మరోవైపు రుద్రాణి పడుకుందామని అనుకుంటుంది. కోడలు కొరివిలా తయారు అయిందని అనుకుంటుంది. ఇంతలో స్వప్న రుద్రాణికి కాల్ చేస్తుంది. ఏంటి గొంతు నీరసంగా ఉంది అని స్వప్న అడుగుతుంది. అలసట వచ్చిందని చెప్తుంది. ఇక తనకు కావాల్సిన ఐటెసమ్స్ లిస్ట్ చెప్తుంది స్వప్న. తీసుకురండి అని ఆర్డర్ వేస్తుంది.
కల్యాణ్ శోభనం గదిలో కూర్చుంటాడు. పూల వాసన చూసి తుమ్ముతాడు. ఏం మొదలు పెట్టకముందే.. తుమ్ము వచ్చిందని అనుకుంటాడు. కొంప దీసి శోభనం జరగదా అని అనుకుంటాడు. ఇంతలో అనామికను రెడీ చేసి తీసుకువస్తారు. సిగ్గు పడకు.. ప్రేమించిన వాడే కదా.. అని ఇందిరాదేవి చెప్తుంది. ఇక అనామికను లోపలికి తోచి పోతారు. ఇక అనామిక లోపలికి వచ్చాక.. డోర్ పెట్టమని చెప్తుంది. కల్యాణ్ డోర్ పెడతాడు.
ఇక పాలు నాకు నచ్చవు.. నువ్వు కావాలంటే తాగు అని చెప్తుంది అనామిక. కల్యాణ్ షాకింగ్ గా చూస్తాడు. కల్యాణ్ పాలు తాగకా.. అనామిక కల్యాణ్ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఏంటి సైలెంటుగా ఉన్నవ్ అని అనామిక అంటుంది. వింటున్నాను అని కల్యాణ్ అంటాడు. పూల చప్పుడు అని చెప్తాడు. ఇక కల్యాణ్ ఓ కవిత్వం చెప్తుంటే.. ఆపుసోది అని అంటుంది. నా కవిత్వం చూసే కదా ప్రేమించావ్ అని కల్యాణ్ అంటాడు. ఇంకా ఏదైనా మాట్లాడు అని అనామిక అంటుంది.
తదుపరి ఎపిసోడ్ లో ఇక డెకరేషన్ గురించి మాట్లాడుతూ.. మా కావ్య వదిన చేసిందని చెప్తాడు కల్యాణ్. అనామిక షాక్ అవుతుంది. తనకు నక్లెస్ గిఫ్టుగా ఇస్తే.. వదిన సెలెక్ట్ చేసిందని చెప్తాడు. దీంతో మన మధ్య కావ్య, అప్పు టాపిక్ ఎందుకు అని అనామిక ప్రశ్నిస్తుంది. ఇక పూల మంచాన్ని మొత్తం చెదరగొడుతుంది. వెళ్లి హల్లో పడుకుంటుంది. తెల్లారి అందరూ చూసి షాక్ అవుతారు. ఏం కష్టం వచ్చిందని అడిగితే.. మా మధ్య అప్పు, కావ్య టాపిక్ తీసుకువస్తున్నాడు అని అనామిక చెప్తుంది. ధాన్యలక్ష్మి కావ్య మీద ఫైర్ అవుతుంది.


Click it and Unblock the Notifications











