Brahmamudi January 17th శోభనం గదిలో అప్పు, కావ్య ప్రస్తావన.. అందరి ముందు కల్యాణ్‌ను అడ్డంగా బుక్ చేసిన అనామిక!

నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ (జనవరి 17వ తేదీ)లో అనామిక, కల్యాణ్ ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. ఇక కల్యాణ్... అనామికకు ఓ నక్లెస్ గిఫ్టుగా ఇస్తాడు. అది చూసి చాలా బాగుందని అనామిక అంటుంది. మా కావ్య వదిన సెలక్షన్ అని కల్యాణ్ చెప్తాడు. వెంటనే నక్లెస్ కింద పడేస్తుంది. నచ్చలేదని చెప్తుంది అనామిక. ఇప్పుడే కదా నచ్చింది అన్నావ్ అని కల్యాణ్ అడుగుతాడు. భర్త భార్యకు ఇచ్చే గిఫ్ట్ పరాయి వాళ్లు సెలక్ట్ చేయడం నచ్చేలేదని చెప్తుంది.

పరాయి వాళ్లు ఎవరున్నారు. మా వదినే కదా అని కల్యాణ్ అంటాడు. నువ్ మాటి మాటికి కావ్య టాపిక్ తీసుకురావడం నాకు నచ్చలేదని అనామిక అంటుంది. పాపం తనేం చేసిందని కల్యాణ్ అంటే... తను ఏం చేసిందో నాకు తెలుసు. ఆరోజు కూడా ఎవరికోసమో పూజ నుంచి వెళ్లిపోయావ్ అని అనామిక ఫైర్ అవుతుంది. ఎవరో ఏంటీ.. అప్పు మన ఫ్రెండే కదా అని కల్యాణ్ చెప్తాడు. మన ఫ్రెండ్ కాదు. నీకు ఫ్రెండ్. నువ్వేమో ఫ్రెండ్‌లా చూశావ్. కానీ, తనేమో మోసం చేసి పెళ్లి చేసుకుందామనుకుందని అనామిక అంటుంది.

January 17th 2024 Episode number 308 in Brahmamudi Telugu Serial

తను అలాంటిది కాదని కల్యాణ్ అంటాడు. స్టాపిట్ అంటూ అనామిక అరుస్తుంది. ఎందుకంత ఇర్రిటేట్ అవుతున్నావ్. అప్పు నా ఫ్రెండ్. తన ప్రాణాలు కాపాడటానికి వెళ్లాను. మన పెళ్లి కోసం కావ్య వదిన హెల్ప్ చేసింది. వాళ్లను మెచ్చుకోవడంలో తప్పేముందని కల్యాణ్ చెప్తాడు. తప్పే.. ఇది శోభనం గది. ఇక్కడ మన గురించి మనమే మాట్లాడుకోవాలని అనామిక అంటుంది. మంది ఎలా చస్తే మనకెందుకు అని అంటుంది. దాంతో షాక్ అయిన కల్యాణ్... ఎలా చస్తే మనకేంటా.. ఎవరి గురించి అంటున్నావ్. నువా చాలా దారుణంగా మాట్లాడుతున్నావ్.. అని అంటాడు.

ఇప్పుడు ఏమైందని. నీ స్థానం నీదే.. వాళ్ల స్థానం వాళ్లదే.. నువ్ వాళ్లను ఎందుకు అంటున్నావ్ అని కల్యాణ్ అంటాడు. నువ్ వాళ్లను ఎందుకు వెనకేసుకొస్తున్నావ్ అని అనామిక అంటుంది. నువ్ ఎందుకు గొడవ పెద్దది చేస్తున్నావ్ అని కల్యాణ్ అంటాడు. నేనా.. నేనా.. పెద్దది చేస్తుంది అని అనామిక శోభనం గదిని చెదరగొడుతుంది. కల్యాణ్ మొదటిసారిగా కొపంగా అరుస్తాడు. దాంతో ఇంత జరిగాక శోభనం వద్దని వెళ్లిపోతుంది అనామిక. ఇంట్లో వాళ్లకు తెలిస్తే బాగుండదు అని కల్యాణ్ అంటే.. ఐ డోంట్ కేర్ అంటూ దిండు తీసుకెళ్లి కిందకు వెళ్లిపోతుంది అనామిక.

ఉదయం స్వప్న లేవగానే రుద్రాణికి కాల్ చేస్తుంది. రాక్షసి నిద్ర లేచినట్లుంది. నా రక్తం తాగడానికి అని రుద్రాణి ఆ కాల్ కట్ చేస్తుంది. కానీ, స్వప్న మళ్లీ మళ్లీ కాల్ చేయడంతో చేసేది లేక లిఫ్ట్ చేస్తుంది రుద్రాణి. ఎక్కడ చచ్చారు.. నాకు పొద్దున్నే కాఫీ తాగే అలవాటు ఉందిగా.. వెళ్లి పెట్టుకు రా అని స్వప్న అంటుంది. ఈ అలవాటు నీకు లేదుగా అని రుద్రాణి అంటుంది. ఇవాళ్టి నుంచి ఉంటుందని స్వప్న అంటుంది. రుద్రాణి హాల్లోకి వెళ్లగా.. అక్కడ సోఫాపై అనామికను చూసి.. ఈ కాపురం కూడా కొల్లేరు అయిందే.. అనుకుంటుంది.

January 17th 2024 Episode number 308 in Brahmamudi Telugu Serial

శోభనం సంక నాకిపోయిందని అందరికి చెబితే గానీ, నా కడుపు మంట చల్లారదు అని ఇంట్లో వాళ్లను లేపుతుంది. అందరు హాల్లోకి వచ్చి... అనామికను చూసి అంతా షాక్ అవుతారు. అనామిక అంటూ లేపుతుంది ధాన్యలక్ష్మీ. నిద్ర లేచిన అనామిక అత్తయ్యా అంటూ ఏడుస్తూ ధాన్యలక్ష్మీని హగ్ చేసుకుంటుంది. అంతా షాక్ అవుతారు. రాత్రంతా ఇక్కడే పడుకున్నావా అని అడిగితే అవును అంటుంది. ఇంతలో పైనుంచి కల్యాణ్ వస్తాడు. అంతా ఏమైందని అడుగుతారు.

అనామిక మనం గదిలోకి వెళ్లి మాట్లాడుకుందాం అని కల్యాణ్ అంటాడు. నాలుగు గోడల మధ్యలో జరగాల్సింది.. అనామిక వచ్చి ఇక్కడ పడుకుందంటే ఏంటి అర్థం అని ఇందిరాదేవి అడుగుతుంది. అనామిక నీకు అండగా మేమున్నాం. నీకు వచ్చిన కష్టం ఏంటో చెప్పు అని ధాగ్యలక్ష్మీ అంటుంది. ఇప్పుడు నాకున్నవి రెండే దారులు. ఒకటి పుట్టింటికి వెళ్లిపోవడం. లేదా చనిపోవడం అని అనామిక ఏడుస్తూ చెప్తుంది.

ఇక అంతా కల్యాణ్ ను అంటారు. చిన్న విషయమని కల్యాణ్ చెప్తాడు. ఒక ఆడపిల్ల అంత మాట అంటే ఏం అనకుండా ఉంటుందిరా అని రుద్రాణి అడుగుతుంది. కల్యాణ్ గురించి మనకు తెలుసు. జరిగింది తెలియాలంటే అనామిక ఏడుపు ఆపి చెప్పాల్సిందే అని ఇందిరాదేవి అంటుంది. అనామిక నేను తప్పుగా మాట్లాడి ఉంటే రియల్లీ సారీ. పదా అని తీసుకెళ్తుంటాడు కల్యాణ్. అలా ఎలా కుదుర్తుందని రుద్రాణి అంటుంది. జరిగిందేంటో చెప్పకుంటే అందరికీ సస్పెన్స్‌లాగే ఉంటుందని అంటుంది. అనామిక అందరికీ ఎందుకు అవకాశం ఇస్తున్నావ్. ఏం జరిగిందో చెప్పమని అపర్ణ అంటుంది.

January 17th 2024 Episode number 308 in Brahmamudi Telugu Serial

నన్ను కొట్టిన తిట్టిన ఆ గదిలోనే పడి ఉండేదాన్ని.... కానీ, శోభనం గదిలో అప్పు ప్రస్తావన తీసుకొస్తున్నాడు.. ఈ కావ్య ప్రస్తావన తీసుకొస్తున్నాడు అని అనామిక ఏడుస్తూ చెప్తుంది. దీంతో అంతా షాక్ అవుతారు. తన దృష్టిలో కావ్య ఒక ఇలవేల్పు.. అప్పు ఒక ప్రేమదేవత.. భార్యగా నాకు విలువ ఇవ్వడం లేదని అనామిక అంటుంది. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదేంట్రా అని సుభాష్ అంటాడు. అనామిక నీకు దండం పెడతాను. మధ్యలో మా వదినను ఎందుకు తీసుకొస్తున్నావ్ అని కల్యాణ్ అంటాడు.

చూశారా అత్తయ్యా.. ఇలాగే అంటాడు. శోభనం గదిలో వదినను దేవతను చేసి మాట్లాడతుంటే నాకు ఎలా ఉంటుంది అని అనామిక చెప్తుంది. ఏమ్మా మహాతల్లి.. పెళ్లి చెడగొట్టాలని చూశావ్. ఇప్పుడు శోభనం క్యాన్సిల్ కావడానికి కారణం అయ్యావా అంటూ ఫైర్ అవుతుంది ధాన్యలక్ష్మి. ఇప్పుడు నీ కళ్లు చల్లబడ్డాయా. నీ చేయి తగిలితే సర్వనాశనం అన్నాను కదా. ఇప్పుడు అలాగే జరిగింది. ఎందుకంటే నువ్ మంచి కోరుకోవు కదా అని అంటుంది.

పిన్నీ.. అని గట్టిగా అరుస్తాడు రాజ్. అనామిక, కల్యాణ్ గొడవకు కావ్యను అనడం కరెక్ట్ కాదు. తననెందుకు లాగుతున్నారు అని రాజ్ అంటాడు. ఇప్పుడు నీ పిన్ని గయ్యాలి అయిందా.. చూశావా అక్క నీ కొడుకును కూడా మార్చేసింది. రేపు నిన్ను కూడా అంటాడు. ఎవరో అడ్డమైన వాళ్లకోసం ఇంత జరుగుతుంది అని ధాన్యలక్ష్మీ అంటుంది. చిన్నత్తయ్య.. అడ్డమైన వాళ్లు అనడం కరెక్ట్ కాదు. కవిగారికి అందరు ఒక్కటే.. అభిమానంతో ఒక చిన్న మాట అని ఉండొచ్చు. దానికి నన్ను లాగడం ఏంతవరకు పద్ధతి అని కావ్య అంటుంది.

నువ్ నాకు పద్ధతులు నేర్పుతున్నావా. నువ్ అప్పును నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకోలేదా అని ధాన్యలక్ష్మీ అంటుంది. అనుకోలేదు. మీరు అలా అనుకుంటే నేను ఏం చేయలేను. నన్ను సాధించాలని కంకణం కట్టుకుంటే ఏం చేయలేను అని కావ్య అంటుంది. నేను సాధిస్తున్నానా.. అని ధాన్యలక్ష్మీ అంటే.. అవును అని స్వప్న అంటుంది. నువ్ మధ్యలోకి రాకు.. రాహుల్‌తో లేచిపోయిన నువ్వు.. రాజ్‌ తో ముసుగు వేసుకుని పెళ్లికి కూర్చున్న కావ్య చెబుతున్నారా అని ధాన్యలక్ష్మి ఫైర్ అవుతుంది. అదంతా విన్న రాజ్.. రేయ్.. కల్యాణ్.. అని గట్టిగా అరుస్తాడు. దాంతో అంతా రాజ్‌ ను చూస్తారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

తర్వాతి ఎపిసోడ్‌లో మీ గురించి మీరు మాట్లాడుకోండి. చిన్నదైనా మా ప్రస్తావన తీసుకురాకండి అని అనామికతో చెబుతుంది కావ్య. తర్వాత రాజ్‌ భుజానికి ప్రేమగా ఒరిగి.. మీరు నాకు అండగా ఉంటే.. గోవర్ధనగిరిని కూడా ఒంటి చేత్తో ఎత్తగలను అన్న నమ్మకం వచ్చిందండి అని కావ్య ప్రేమగా అంటుంది. దాంతో రాజ్ కాస్తా ఇబ్బందిగా.. ప్రేమగా ఫీల్ అవుతాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X