Brahmamudi January 18th కావ్య మీద కన్నింగ్ ప్లాన్ వేసిన అనామిక.. రాజ్, శ్వేత కలిసి ఉన్న వీడియో లీక్!

బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 18వ తేదీ ఎపిసోడ్‌ లో అనామిక చేసిన రచ్చకు అంతా కావ్య మీద ఫైర్ అవుతూ ఉంటారు. రాజ్ ఒక్కసారిగా రేయ్ ఏంట్రా ఇది.. ఈ గొడవలు ఏంటీ.. అసలు ఒక్కదానికైనా సంబంధం ఉందా.. ఏ విషయం దేనికి ముడి పెడుతున్నారు.. అనామికను గదిలోకి తీసుకెళ్లి సర్ది చెప్పుకో అని కల్యాణ్ మీద రాజ్ కోపంగా అరుస్తాడు. దాంతో అపర్ణ మధ్యలో.. రాజ్.. ముందు నువ్ నీ పెళ్లానికి చెప్పుకో. తర్వాత నీ తమ్ముడికి తన భార్య గురించి చెబుదువు గానీ. అసలు ఇంతకుముందు ఈ ఇంట్లో గొడవలు ఉన్నాయా. స్వప్న వచ్చాకా కొన్ని రోజులు. కావ్య వచ్చాక మరికొన్ని రోజులు. ఇప్పుడు అప్పుతో ఇంకొన్ని రోజులు అని అపర్ణ అంటుంది.

ఆ కుటుంబం వల్లే ఈ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని ఫైర్ అవుతుంది. ముందు నీ పెళ్లానికి చెప్పు అన్నింట్లో తలదూర్చకని అంటుంది. దాంతో ఏడుస్తూ పైకి వెళ్లిపోతుంది కావ్య. తనవెంటే రాజ్ కూడా వెళ్లిపోతాడు. ఇదేంటి బావ... ధాన్యలక్ష్మి, అపర్ణ.. కావ్యను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు అని ఇందిరాదేవి అంటుంది. తర్వాత బెడ్ పక్కన కూర్చుని కావ్య ఏడుస్తూ ఉంటుంది. రాజ్ వచ్చి కావ్య పక్కన కూర్చుంటాడు. నాకు నిన్ను బాధ పెట్టడమే తెలుసు కానీ.. ఓదార్చడం తెలీదు... ఇప్పుడు నేను ఏం చేస్తే నీకు ప్రశాంతంగా ఉంటుంది అంటూ రాజ్ అడుగుతాడు. భార్య బాధలో ఉంటే భర్త వచ్చి ఏ పద్ధతిలో ఓదార్చడం అని అడగడం ఈ ఇంట్లోనే జరుగుతుందని కావ్య అంటుంది. నాకు తెలీదు అని ముందే చెప్పాను అని రాజ్ అంటాడు.

January 18th 2024 Episode number 309 in Brahmamudi Telugu Serial

ఒకరితో మాట్లాడేందుకు ఒక్కొక్కరికీ ఒక్కో కొలమానం ఉంటుంది. బంధం వద్దనుకుంటే గట్టిగా సమాధానం చెప్పొచ్చు. కానీ, ఆ బంధాలతో ఉండేవాళ్లం వాళ్లు బాధపడకుండా ఉండేలా మాట్లాడుతాం. అదే ఓ కుటుంబంలో జరుగుతుంది. అందుకే ఎవరిని ఏం అనలేం అని రాజ్ అంటాడు. మీరు మనుషుల్ని ఇంత బాగా చదవగలరని నాకు ఇవాలే తెలిసింది. నిజం చెప్పాలంటే.. నేను కూడా ఇదే ఫిలాసఫీ ఫాలో అవుతాను అని కావ్య అంటుంది. అందుకే మా స్వప్న అక్కలాగా తొందరపడి మాటలు అనను అని చెప్తుంది.

ఇక రాజ్ మాట్లాడుతూ... కల్యాణ్ కు ఈ పరిస్థితి కొత్త. ఇన్నాళ్లు ప్రేక్షకుడిగా చూశాడు. ఇప్పుడు వాడే బాధ్యతగా మెలిగాలి. వాడి భావ కవిత్వం లాగా జీవితం ఉండదని వాడికి ఫస్ట్ నైట్ రోజే అర్థమై ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మీ పిన్ని.. ఇలా కూడా మాట్లాడగలదని ఈ మధ్యే తెలిసింది. ఇలా అన్ని రకాల మనసత్వాలతో కలుపుకుపోతోనే ఉమ్మడి కుటుంబం నిలబడుతుంది.. అని అంటాడు. కృష్ణుడి గొప్పదనం గురించి కావ్య మాట్లాడుతుంది. ఈరోజు అయిన గాయాన్ని ఈరోజే మాన్పుకుంటాను.. చూస్తాను ఇంకా ఎన్ని గాయాలు అవుతాయో అని కావ్యఅంటుంది.

తర్వాత కావ్య... రాజ్‌ భుజంపై ప్రేమగా, ఆప్యాయంగా వాలుతుంది. ఓదార్చడం తెలియదంటూనే ఓదార్చారు. మీరు అండగా ఉంటే.. గోవర్ధన గిరిని కూడా గోటితో ఎత్తగలను అని ధైర్యం వస్తుందని కావ్య అంటుంది. దాంతో రాజ్ కాస్తా ఇబ్బందిగా.. ఆలోచనలో పడిపోతాడు. మరోవైపు తల్లిదండ్రులకు అనామిక కాల్ చేస్తుంది. మనం అనుకున్నట్లుగానే నా ఫస్ట్ నైట్ చెడగొట్టుకున్నాను అని అనామిక చెబుతుంది. అందరూ కావ్య వల్లే గొడవ అయిందని కోప్పడ్డారని అనామిక చెప్తుంది.

ఇప్పుడు వెళ్లి అందరి ముందు తనకు సారీ చెబుతాను అని అనామిక అంటుంది. ఇంత చేసి మళ్లీ సారీ చెప్పడం ఏంటీ బేబీ అని తండ్రి అంటాడు. ఇప్పుడు అలా చేస్తేనే నేను అందరిముందు మంచిదాన్ని అవుతాను. తనకంటే మంచిదాన్ని అవుతాను అని అనామిక మాట్లాడుతుంది. మరి అందరికీ తన మీద కోపం పోతుంది కదా అని అనామిక తండ్రి అంటాడు. కోపం పోయినా మళ్లీ తెప్పించనా. అది చెడ్డది అవ్వాలి. కానీ, నా వల్ల అయినట్లు ఉండకూడదు. దాని ప్రవర్తన వల్లే అవ్వాలి అని అనామిక తన పెరెెంట్స్ కు చెప్పి కాల్ కట్ చేస్తుంది.

ఇక అనామిక... కావ్య దగ్గరికి వెళ్లి సారీ చెబుతుంది. నువ్ క్షమిస్తేనే కల్యాణ్ నన్ను భార్యగా అంగీకరిస్తాడని అంటుంది. నేను శోభనం గదిలో నుంచి వచ్చేస్తే.. అంతటితో ఆగిపోతుంది అనుకున్నాను. కానీ, ఇంత జరుగుతుంది అనుకోలేదు అంటూ కొత్త నాటకం మొదలు పెడుతుంది అనామిక. నువ్ పెద్ద మనసుతో సారీ చెబితే అర్థం చేసుకునే పెద్ద మనసు వాళ్లు ఇక్కడ ఎవరు లేరు అని ధాన్యలక్ష్మీ అంటుంది. దానికి ఎగ్జాంపుల్ మా భార్యనే అని ప్రకాశం కౌంటర్ వేస్తాడు.

అదంతా నాకు తెలీదు అత్తయ్య. కానీ, కల్యాణ్‌ కు కావ్య అంటే కన్నతల్లితో సమానమి అనామిక అంటుంది. వాళ్ల మధ్య ఎలాంటి మనస్పర్థలు రాకూడదు. అందుకే సారీ చెబుతున్నా అని అంటుంది. ఇన్నాళ్లకు దుగ్గిరాలకు కరెక్ట్ అయిన కోడలు వచ్చిందని అపర్ణ అంటుండగా.... అంటే, ఇంతకుముందు రాలేదానా అని స్వప్న అంటుంది. దానర్థం అదే కదా అని అపర్ణ అంటుంది. మా కంటే ముందు మీరు వచ్చారు. మీరు కూడా కరెక్ట్ కోడళ్లు కాదా అని స్వప్న అంటుంది.

ఏయ్.. ఏమన్నావ్ అని అపర్ణ లేస్తుంది. నిజమే కదా. రాజుగారి చిన్న పెళ్లాం మంచిది అంటే.. మిగతా వారు కాదనేగా. మీరు అనామికను మెచ్చుకోండి. కానీ, నన్ను కావ్యను లాగకండి అని స్వప్న చెప్తుంది. ఊరుకోమని ఇందిరాదేవి అంటుంది. అనామిక, నీకు కవిగారు మీకు నేను చెప్పేది ఒక్కటే. నా గురుంచి గానీ, అప్పు గురించి కానీ ఈ ఇంట్లో ఎవరూ మాట్లాడుకునే అవకాశం ఇవ్వొద్దని కావ్య చెప్తుంది. మమ్మల్ని లాగొద్దు. మీరు కొత్తగా పెళ్లయిన వాళ్లు.. మీ గురించి మీరు మాట్లాడుకోండని కావ్య చెప్తుంది. ఈరోజు నుంచి అనామికకు సంబంధించిన ఏ విషయంలోనూ నా జోక్యం ఉండదు అని చెప్పేసి వెళ్లిపోతుంది.

ఒక్క దెబ్బతో ఇంట్లో అందరి ముందు మంచిదాన్ని అనిపించుకున్నాను. కావ్య మా విషయంలో జోక్యం చేసుకోకుండా చూసుకున్నాను. అది అనామిక అని అనుకుంటుంది. మరోవైపు అప్పు బెడ్ మీద నుంచి లేచి వస్తుంది. అది చూసి అంతా షాక్ అవుతారు. అప్పు మెల్లిగా నడుచుకుంటూ వస్తుంది. కానీ, పడబోతుంటే పట్టుకునేందుకు అందరూ వస్తారు. ఆగండి. నేను నడవగలను అని నడిచేందుకు ప్రయత్నిస్తుంది అప్పు. మళ్లీ పడబోతుంటే.. పట్టుకుంటారు.

అప్పు ఇప్పుడు నడవడం అవసరమా... కనీసం నన్ను పట్టుకోనైనా నడువు అని కనకం అంటుంది. ఇంకా ఎన్నాళ్లు ఇలా పట్టుకునే నడవాలి. నాకు నేనుగా నడుస్తా. పడిపోతే మళ్లీ లేస్తా. గాయం అయిందిగా. ఇవాళ నడుస్తా. రేపు పరిగెత్తుతా. ఎల్లుండి సైకిల్ తొక్కుతా.. ఆ తర్వాత బండి నడుపుతా అని అప్పు అంటుంది. నువ్ ఎప్పుడు మా మాట విన్నావే. పరికిణి వేసుకోవే అంటే.. ప్యాంట్ షర్ట్ వేసుకున్నావ్.. పట్టిలు పెట్టుకోవే బుట్లు పెట్టుకున్నవ్... జుట్టు కత్తిరించుకున్నావ్. మగరాయుడులా పెరుగుతావ్ అనుకుంటే ఆఖరుకు ఆడపిల్లలా అయ్యావ్ అని కనకం అంటుంది.

నా బతుకులో ఒక యాక్సిడెంట్‌ అయింది మళ్లీ మళ్లీ గుర్తు చేస్తావ్ ఎందుకు అని అప్పు అంటుంది. తనకు నచ్చినట్లు ఉండనివ్వు అని మూర్తి అంటాడు. ఇక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది. తర్వాతి ఎపిసోడ్ లో రాజ్ సెక్రటరీ కాల్ చేసి రాజ్ సర్ ఉన్నాడా. ఆఫీస్‌లో లేరు. కాల్ చేస్తే కట్ చేస్తున్నారు. రేపటి వరకు డిజైన్స్ పూర్తి కావాలన్నారు అని చెబుతుంది. సరే నాకు మెయిల్ చేయి అని కావ్య అంటుంది. మరోవైపు శ్వేతతో రాజ్ చనువుగా మాట్లాడుతుంటాడు. దాన్ని ఎవరో రహస్యంగా వీడియో తీస్తారు. ఆ వీడియోను కావ్యకు పంపుతారు. ఆ వీడియోలో రాజ్, శ్వేతను చనువుగా చూసి కావ్య షాక్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X