Brahmamudi January 20th ఆఫీసుకు కల్యాణ్.. భార్యకు అడ్డంగా దొరికిపోయిన రాజ్... శ్వేతతో త్వరలోనే పెళ్లి!
బ్రహ్మముడి సీరియల్ ఈ వారం ట్విస్టులతో సాగుతోంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో శ్వేత ఇంటికి ఒక అజ్ఞాత వ్యక్తి వెళ్తాడు. అక్కడ ఆమెకు తెలియకుండా చప్పుళ్లు చేస్తూ.. ఆమెను భయాందోళనకు గురి చేస్తూ ఉంటాడు. ఈ లోపు రాజ్ శ్వేతకు కాల్ చేస్తాడు. ఏమైందని అడిగితే.. ఎవరో ఇంట్లో ఉన్నట్లు అనిపిస్తుందని శ్వేత చెబుతుంది. ఎవరు ఉంటారు అని అడిగితే.. ఏమో అలాగే అనిపిస్తుందని చెప్తుంది. దీంతో నేను ఇంటికి రావాలా అని రాజ్ అడిగితే నో వద్దని శ్వేత చెప్తుంది.
శ్వేత ఇంట్లో ఎవరో అజ్ఞాత వ్యక్తి ఉన్నారనే డౌట్ తో రాడ్ పట్టుకుని అటు ఇటు తిరుగుతుంది. ఓ రాడ్ పట్టుకుని డోర్ వైపు భయంగా వెళ్తుంది. డోర్ తీసి కొట్టబోతుంటే.. అక్కడ రాజ్ ఉంటాడు. ఏమైందని రాజ్ అడిగితే.. ఇంట్లో ఎవరో రాజ్ అంటూ శ్వేత భయంగా చెప్తుంది. పద చూద్దామని ఇంట్లోకి వచ్చిన రాజ్ ముందు లైట్ ఆన్ చేసి చూడగా అక్కడ ఎవరు ఉండరు. టీవీ ఆన్ అయిందని చెప్తుంది. టీవీ రిమోట్ ఆన్ చేసి చూస్తాడు రాజ్. అది చూసి ఎవరో ఆన్ చేయలేదు. నువ్వే రిమైండర్ పెట్టుకున్నావ్ అని రాజ్ అంటాడు.

అవును రాజ్.. ఇందాక ఏదో సిరియల్ చూస్తూ రిమైండర్ పెట్టుకున్నానని శ్వేత అంటుంది. మరోవైపు కావ్యకు రాజ్ సెక్రటరీ శృతి కాల్ చేసి సార్ ఉన్నారా అని అడుగుతుంది. లేరు. ఆఫీసుకు వెళ్లారు అని కావ్య అంటుంది. నాతో కూడా స్టార్ట్ అవుతున్నట్లు చెప్పారు. కానీ, ఇంతవరకు రాలేదని శృతి అంంటుంది. కాల్ చేస్తే కట్ చేస్తున్నారని చెప్తుంది. ఇవాళే డిజైన్స్ కంప్లీట్ చేసి పంపించాలి. రెండు కోట్ల ప్రాజెక్ట్ మేడమ్ అని శృతి అంటుంది. సరే ఆ డిజైన్స్ ఎలా కావాలో నాకు మెయిల్ చేయమని కావ్య అంటుంది. నేను రెడీ చేసి పంపిస్తాను చెప్తుంది.
మరోవైపు శ్వేత తన ఇంట్లో ఎవరో ఉన్నారు అని రాజ్ కు చెప్తుంది. నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని బాధపడుతుంది. రాజ్ నమ్మకపోవడంతో తీసుకెళ్లి ఫ్లవర్ వాజ్ చూపిస్తూ కింద పడిందని, పైన ట్రేలో ఉన్న కత్తి కింద ఎలా పడింది. ఇది కూడా గాలికి పడిందంటావా అని శ్వేత అడుగుతుంది. నా చుట్టూ ఏదో జరుగుతుందని చెప్తుంది. నాకు చాలా టెన్షన్‌గా ఉందని శ్వేత భయపడుతుంటే.. రాజ్ ఓదార్చుతాడు. అలా వాళ్లిద్దరు ఉంటే.. ఇంట్లోకి వచ్చిన వ్యక్తి వాళ్లను వీడియో తీస్తాడు.
మరోవైపు కావ్యకు కాల్ చేసిన సెక్రటరీ మేడమ్ డిజైన్స్ బాగున్నాయని చెబుతుంది. కానీ, వాటిని డిలీట్ చేయి. అందులో కొన్ని లోపాలు ఉన్నాయని కావ్య అంటుంది. ఇప్పుడు మరికొన్ని డిజైన్స్ పంపిస్తానని చెప్తుంది. కావ్య డిజైన్స్ చూస్తూ ఉంటుంది. ఇంతలో ఫోన్‌కు మేసెజ్ రావడం చూస్తుంది. అందులో రాజ్, శ్వేత ఉన్న ఫొటో చూసి షాక్ అవుతుంది కావ్య. ఇదివరకు రోడ్డు మీద ఐస్ క్రీమ్ తిన్నది గుర్తు చేసుకుని చాలా బాధపడుతుంది. రాత్రంతా రాజ్ తో ప్రేమగా ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది.
మరుసటిరోజు ఉదయం కల్యాణ్‌కు కాఫీ ఇస్తుంది అనామిక. నువ్ బావ గారిలా ఆఫీస్‌కు వెళ్లవా అని అనామిక అడుగుతుంది. నేను రోజు వెళ్లను. అన్నయ్యకు ఇంపార్టెంట్ పని ఉందంటే వెళ్తాను అని కల్యాణ్ చెబుతాడు. మరి రోజు ఏం చేస్తావు అని అనామిక అంటే.. ఇంతలో వచ్చిన రాహుల్.. ఏముంది.. పిచ్చి రాతలు రాస్తూ కూర్చుంటాడని చెప్తాడు. ఆఫీస్ అంతా రాజ్ చేతుల్లోనే ఉంది. నేను ఆఫీస్‌కు వెళ్తానన్న రానివ్వరు. ఇంపార్టెంట్ పని ఉంటే తప్పా వీడు వెళ్లడు అని చెప్పేసి వెళ్లిపోతాడు రాహుల్. చూశావా అనామిక అందరు నావి పిచ్చిరాతలు అనుకుంటారు. కానీ, నువ్ ఒక్కదానివే వాటిని గుర్తించావ్. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అని కల్యాణ్ అంటాడు.
నువ్ ఇలా ఇంట్లో కవిత్వాలు రాసుకుంటూ కూర్చుంటే భార్యగా నాకు ఏం గుర్తింపు ఉంటుందని అనామిక అనుకుంటుంది. ఏం ఆలోచిస్తున్నావని కల్యాణ్ అడిగితే.. ఏం లేదని చెప్పి వెళ్లిపోతుంది. ఇంతలో రుద్రాణి వచ్చి... నీ బాధేంటో నాకు అర్థం అవుతుంది అనామిక. రాజ్ అలా ఆఫీస్‌లో ఉంటే కల్యాణ్ ఇలా కవితలు రాసుకుంటూ కూర్చుని ఉండటం నచ్చలేదు కదా అని పుల్ల వేస్తుంది. అవును ఆంటీ అంటుంది అనామిక. నా బాధ అదే కదా. ఇంట్లో రాజ్‌ను రాజకుమారుడిలా చూస్తారు కానీ, రాహుల్, కల్యాణ్‌కు విలువ ఇవ్వట్లేదని రుద్రాణి అంటుంది.
మరి అత్తయ్య ఎలా ఊరుకున్నారని అనామిక అడిగి.... ఆవిడో పిచ్చిది.. నువ్ ఏమనుకున్నా. తనో పిచ్చిది అని రుద్రాణి అంటుంది. మీరు నాకు సాయం చేస్తానంటే నేను అది మారుస్తాను. నేను చెప్పినట్లు వెళ్లి మా అత్తయ్యకు చెప్పండి అని అనామిక ఏదో చెబుతుంది. రాహుల్, కల్యాణ్‌కు విలువ పెరుగుతుందంటే నేను ఎందుకు చేయను అని రుద్రాణి అంటుంది. చూద్దాం. కొత్త కోడలిగా నువ్వేనా గెలుస్తావేమో అని రుద్రాణి వెళ్లిపోతుంది. నేనే గెలుస్తాను అని అనామిక మనసులో అనుకుంటుంది.
తర్వాత హాల్లో అందరికీ కాఫీ ఇస్తుంది కావ్య. ఇంతలో రాజ్ బయటి నుంచి రావడం చూసి ఎక్కడికి వెళ్లావని అడుగుతారు. ఆఫీస్‌కు వెళ్లారు అత్తయ్య. కొత్త కొత్త డిజైన్స్ ట్రై చేయడానికి. రాత్రంతా చాలా కష్టపడ్డారు. ఎక్కడ మిస్ అయిపోతానేమో అని అలారం పెట్టుకుని మరి వెళ్లారు అని రాజ్‌ను అడిగిన అన్ని ప్రశ్నలకు కావ్య సమాధానం చెబుతుంది. అంత కష్టపడటం ఎందుకు నాన్నా అని అపర్ణ అంటే.. మన ఆస్తిని రాజ్ రెట్టింపు చేస్తాడనే నమ్మకం నాకుంది. తనకు బాధ్యతలు అప్పజెప్పినప్పటి నుంచి బాగా చేస్తున్నాడు అని ఇందిరాదేవి మెచ్చుకుంటుంది.
రాజ్ నువ్ అలసిపోయినట్టున్నావ్... వెళ్లి రెస్ట్ తీసుకో అని ధాన్యలక్ష్మి అంటుంది. దాంతో రాజ్ వెళ్లిపోతాడు. ఇంటిల్లిపాది రాజ్‌ను అలా మెచ్చుకుంటున్నారు. కల్యాణ్, రాహుల్‌ను ఎప్పుడైనా మెచ్చుకున్నారా అని రుద్రాణి అంటుంది. కంపెనీ కోసం రాజ్ చాలా కష్టపడుతుంటారు కదా అందుకే అని ధాన్యలక్ష్మీ అంటుంది. నీకు నాకు అలా అనిపిస్తే ఒకే. కానీ, అనామికకు ఇప్పటికే ఇంట్లో రాజ్ ఒక్కడికే విలువ ఇస్తున్నారని అనుకుంటుంది. కల్యాణ్‌కు కూడా పగ్గాలు ఇవ్వమని అడుగు. లేకుంటే అనామిక కంపేర్ చేసుకునే అవకాశం ఉంది. తన భర్తకు విలువ ఉండాలని అనుకుంటుంది కదా అని రుద్రాణి అంటుంది. అంతేనంటావా అని ధాన్యలక్ష్మీ అంటుంది. అవును అని రుద్రాణి అంటుంది.
రాజ్ బెడ్‌పై అలసటగా వాలుతాడు. సెక్రటరీ కాల్ చేస్తే.. అయ్యో... డిజైన్స్ సంగతే మర్చిపోయానే అని టెన్షన్ పడుతుంటాడు. ఇంతలో కావ్వ వచ్చి డిజైన్స్ ఇస్తుంది. రుద్ర వాళ్లకు ఇచ్చే డిజైన్స్ అని చెబుతుంది. నీకు ఎలా తెలుసు అని రాజ్ అంటే.. నాకు అన్ని తెలుసు అని కావ్య అంటుంది. దాంతో భయంతో షాక్ అవుతాడు రాజ్. ఏమైనా అడగాలా అని రాజ్ అనుమానంగా అంటే.. ఏమైనా చెప్పాలా అని కావ్య అంటుంది. లేదని రాజ్ అంటాడు. చెప్పాల్సింది ఏం లేనప్పుడు. అడగడానికి ఏముంటుంది అని కావ్య చెప్పేసి వెళ్లిపోతుంది.
ఇది కొంపముంచిందని సెక్రటరీకి కాల్ చేసి కావ్యకు ఆఫీస్‌కు రాలేదని చెప్పావా అని అడుగుతాడు. దాంతో అవును అని సెక్రటరీ అంటుంది. చిచ్చు పెట్టావ్ గా. సరే రుద్ర వాళ్లకు డిజైన్స్ కలెక్ట్ చేసుకోమ్మని చెప్పమని చెబుతాడు. తర్వాత నా గురించి కావ్య ఎలా ఆలోచించి ఉంటుంది. అర్థం చేసుకుందా. అనుమానిస్తుందా అని రాజ్ ఆలోచిస్తుంటాడు. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. తదుపరి ఎపిసోడ్ లో రాజ్.. శ్వేతను ఎత్తుకుని హస్పిటల్ కు వస్తాడు. ఆ సీన్ చూసి కావ్య బాధపడుతుంది. అక్కడ ఉన్న నర్సులు ఏదో గాయం అయిందంట.. పక్కన ఉన్నవాడు కాబోయే వాడంట.. చాలా బాగా చూసుకుంటన్నాడు అని మాట్లాడుకుంటారు. అది విని కావ్య ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు శ్వేత దగ్గర రాజ్ సన్నిహితంగా ఉండటం ఆసుపత్రి అద్దాల్లోంచి కావ్య చూస్తుంది.


Click it and Unblock the Notifications











