Brahmamudi January 23th దుగ్గిరాల ఇంట్లో అనామిక కుంపటి.. అపర్ణ, ధాన్యలక్మీ మధ్య గొడవ!
నేటి బ్రహ్మముడి సీరియల్లో కావ్య కళ్లు తిరిగుతుందని అనడంతో.. స్వప్న ఆసుపత్రికి తీసుకువెళ్తుంది. అక్కడ రాజ్.. శ్వేతను చేతుల మీద మోసుకురావడం చూస్తుంది. అది చూసి కావ్య షాక్ అవుతుంది. స్వప్నను పక్కకు పంపించి రాజ్, శ్వేత గురించి తెలుసుకోవాలి అనుకుంటుంది. స్వప్న ల్యాబ్ రిపోర్ట్స్ తేవడానికి వెళ్లినప్పుడు ఐసీయూ దగ్గరకు వెళ్తుంది కావ్య. అక్కడ నర్సులు మాట్లాడుకుంటూ ఉంటారు. అతను ఆమెకు కాబోయే వాడట.. ఎంత బాగా చూసుకుంటున్నాడు.. ఏదో గాయం అయింది అంటూ వారు మాట్లాడుకుంటూ ఉంటాడు.
కావ్య వాళ్ల మాటలు విని బాధపడుతుంది. ఐసీయూలో రాజ్ శ్వేతతో చేయి పట్టుకుని మాట్లాడటం చూసి కన్నీళ్లు కార్చుతుంది. ఈలోపు స్వప్న వచ్చి పదా వెళ్దాం అని చెప్తుంది. ఇద్దరు కలిసి వెళ్లిపోతారు. మరోవైపు వంటింట్లో ధాన్యలక్ష్మి వంట చేస్తుంటే.. కావ్య ఆసుపత్రికి వెళ్లింది ఈ సారికి నువ్వే వంట చేయ్ అని చెప్తుంది ఇందిరాదేవి. సరే అని చెప్తుంది ధాన్యలక్ష్మి. ఇక కళ్యాణ్ ను పిలిచి.. ఇంట్లోని పనులను చెప్తుంది ఇందీరాదేవి. ఇదంతా విన్న రుద్రాణి... ధాన్యలక్ష్మి దగ్గరకు వచ్చి పుల్లపెట్టాలని ప్రయత్నం చేస్తుంది.

కల్యాణ్ ను వాడుకుంటున్నారు అంటూ రుద్రాణి అంటుంది. నాకు పని ఉంది.. గొడవ పెట్టకు అని ధాన్యలక్ష్మి అంటుంది. ఈలోపు అపర్ణ.. కల్యాణ్ ను పిలిచి.. సాయంత్రం గుడికి తీసుకువెళ్లు ఎలాగూ ఖాళీనే కదా అని అంటుంది. అది విన్న రుద్రాణి.. ఇప్పుడేం అంటావ్.. నీ కొడుకు ఏమైనా డ్రైవరా... అంటూ ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది. ధాన్యలక్ష్మి ఆలోచనలో పడుతుంది. రాజ్ ను హీరో చేయడానికి కల్యాణ్ ను జీరోను చేస్తున్నారు. కావ్యకు ఇంట్లో వాళ్లంతా గౌరవం ఇస్తారు. ఎందుకంటే.. రాజ్ భార్య కాబట్టి.. రేపు నీ కోడలికి కూడా అంత గౌరవం రావాలంటే.. కల్యాణ్ ను నిలబెట్టాలి అని చెప్పి వెెళ్లిపోతుంది.
ధాన్యలక్ష్మి ఆలోచనలో పడుతుంది. మరోవైపు కావ్య ఆసుపత్రి నుంచి ఇంటికి వస్తుంది. రాజ్ శ్వేత గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏమైందని ఇందిరాదేవి అడుగుతుంది. సమాధానం చెప్పకుండా ఆలోచనలో ఉండిపోతుంది. కళ్లు తిరిగుతున్నాయి అమ్మమ్మ.. పడుకుంటాను అని చెప్పి కావ్య వెళ్లిపోతుంది. దీనికి అంత టెన్షన్స్ ఏం ఉన్నాయి అని స్వప్న అంటుంది. బీపీ బాగా తగ్గిపోయిందని చెప్తుంది. ఇంట్లో వాళ్లంతా కలిసి కావ్యపై యుద్ధం చేస్తే ఉండద అని ఇందిరాదేవి అంటుంది.
మరోవైపు కృష్ణ మూర్తి ఆర్డర్ గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో అప్పు వచ్చి.. కల్యాణ్ ఫోటోలు, కొనిచ్చిన చీరను మంటల్లో పడేస్తుంది. అది చూసి షాక్ అవుతారు. ఏమైందే అని అడుగుతారు. కల్యాణ్ కొనిచ్చినవి ఎందుకు.. పరాయి వాళ్లవి మనకు ఎందుకు వాళ్ల జ్ఞాపకాలు నాకు ఏవి వద్దు అంటూ అప్పు చెప్తుంది. ఇప్పుడు నాలాగా నేను ఉంటాను.. మన ఇంటి కోసం ఏదో ఒకటి చేస్తాను అంటూ అప్పు చెప్తుంది. అది విన్న కృష్ణ మూర్తి, అన్నపూర్ణ, కనకం సంతోష పడిపోతారు.
డైనింగ్ టేబుల్ దగ్గర అందరు తింటుంటారు. రాజ్ వచ్చి.. ఏమైంది కళావతి లేదా.. అనామిక వడ్డిస్తుందని అడుగుతాడు. కావ్యకు కళ్లు తిరిగాయిరా.. చాలా నీరసంగా ఉంది అని ఇందిరాదేవి చెప్తుంది. ఎవరైన ఆసుపత్రికి తీసుకువెళ్లారా అంటే.. జరిగింది చెప్తారు. భర్త పట్టించుకోవాలని ఇందిరాదేవి చెప్తుంది. ఇక రాజ్ భోజనం మానేసి కావ్య దగ్గరు వెళ్తాడు. దీంతో రుద్రాణి ఇదే మంచి టైం అనుకుని పుల్లలు పెట్టే ప్రయత్నం చేస్తుంది. గీసర్లన్నీ రిపేరుకొచ్చిన్నట్లున్నాయి. వేడి నీళ్లు పెట్టివ్వడానికి శాంత కూడా లేదు. మీ కోడలుకేమో బీపీ డౌన్ అయ్యింది. టెక్నీషియన్స్ తో ఏమైనా చెప్పారా అంటూ రుద్రాణి అంటుంది.
కళ్యాణ్ నీకు చెప్పాను కదా.. రెండు రోజుల్నుంచి ఆ టెక్నీషియన్స్‌ను పిలిపించమని చెప్తూనే ఉన్నానని అపర్ణ అంటుంది. ఆ మాత్రం పట్టించుకోకపోతే ఎలారా అని తిడుతుంది. రేపు దగ్గరుండి తీసుకొస్తాను పెద్దమ్మ అని కల్యాణ్ చెప్తాడు. ఏంటక్కా ప్రతిదీ నా కొడుకే చేయాలా? అని ధాన్యలక్ష్మి అంటుంది. వాడేమన్నా ఈ ఇంటి నౌకరి అనుకుంటున్నావా అని అడుగుతుంది. నీకు నీ కొడుకేంతో.. నాకు నా కొడుకు అంతే.. అంటూ మాట్లాడుతుంది. నీకొడుకు పెళ్లానికి ఒంట్లో బాగాలేకపోయినా రాలేనంత బిజీగా ఉండొచ్చు... కానీ నా కొడుక్కి కొత్తగా పెళ్లైంది ఇలాంటి పనుల కోసం వాణ్ని పంపించడం ఎంటని అడుగుతుంది ధాన్యలక్ష్మి.
అమ్మా నువ్వు ఊరుకో.. అని కల్యాణ్ అంటున్నా కానీ... ఒరేయ్ నీకేం తెలియదు నువ్వు ఊరుకో.. ప్రతి చిన్న పనికి నువ్వొక్కడివే కనిపిస్తావేంటి అంటుంది ధాన్యలక్ష్మి. ఇక అపర్ణ కూడా చేయి కడుక్కుని ఇక ఎవ్వరూ ఏ పని చేయకండి అంటూ లేచి వెళ్లిపోతుంది. అనామిక లోపలికి వెళ్లి వాళ్ల అమ్మకు ఫోన్ చేసి ఈ ఇంట్లో కుంపటి రాజేశానని సంతోషంగా చెప్తుంది. త్వరలోనే తను ఏం చేయబోయేది వాళ్ల అమ్మకు వివరిస్తుంది. ఇంతలో కళ్యాణ్ రావడం చూసి షాక్ అయి...వెంటనే ఫోన్ కట్ చేస్తుంది అనామిక . అయితే కళ్యాణ్ మొత్తం వినడు. అది అర్థం చేసుకున్న అనామిక కూల్ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్ లో రాజ్.. కావ్య దగ్గరకు వెళ్లి మాట్లాడుతాడు.


Click it and Unblock the Notifications










