Brahmamudi January 24th భర్త గురించి కల్యాణ్‌కు చెప్పేసిన కావ్య...శ్వేత, రాజ్ ప్రేమ వ్యవహారం బయటకు!
నేటి బ్రహ్మముడి సీరియల్ జనవరి 24వ తేదీ ఎపిసోడ్ లో కావ్య బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. రాజ్, శ్వేత కలిసి ఉన్న విషయాలను గుర్తు చేసుకుని బాధపడుతుంది. అప్పుడే అక్కడికి రాజ్ వస్తాడు. ఒంట్లో బాగోలేదట.. ఏమైంది అని రాజ్ అడుగుతాడు. బాగానే ఉందని కావ్య చెప్తుంది. ఆసుపత్రికి వెళ్లి వచ్చావట.. ఏం అన్నారు డాక్టర్ అని రాజ్ అడగ్గా... మందులు రాసిఇచ్చారు వేసుకుంటాను అని కావ్య చెప్తుంది.
నువ్వు ఫోన్ చేసినప్పుడు... అని రాజ్ చెప్తుండగా.. కావ్య మాట్లాడుతూ... ఆఫీసులో ఉన్నారు.. అర్జెంటు మీటింగులో ఉన్నారు.. అంతే కదా అని కావ్య అంటుంది. దానికి రాజ్ అవును బిజీగానే ఉన్నాను అంటూ సమాధానం చెప్తాడు. మీరెంత బిజీగా ఉంటారో నాకు తెలుసు.. నేను అర్థం చేసుకున్నాను.. అంటూ కావ్య చెప్పి వెళ్లిపోతుంది. ఇక రాజ్ ఆలోచనలో పడతాడు. మరోవైపు అపర్ణ సీరియస్ గా ఉంటుంది.

అపర్ణ దగ్గరకు వచ్చిన సుభాష్... ఏదో జరిగినట్లు ఉందని వెళ్లకపోవడమే బెటర్ అనుకుంటాడు. ఈలోపు మీ తమ్ముడి గారి భార్యకు స్వార్థం బాగా పెరిగిపోయిందని అపర్ణ అంటుంది. ఎవరు ధాన్యలక్ష్మా అని సుభాష్ అంటే.. మీ తమ్ముడికి ఎంతమంది భార్యలు అని అపర్ణ చెప్తుంది. ఇక ధాన్యలక్ష్మి చేసిన బాగోతాన్ని సుభాష్ కు చెప్తుంది అపర్ణ. కల్యాణ్ ను నేను తక్కువ చేసి మాట్లాడను అంటూ అందరి ముందు అడిగిందని చెప్తుంది. నేను రాజ్‌ను ఒకలా కల్యాణ్‌కు మరోలా చూశానా అని అపర్ణ అడిగితే.. లేదని సుభాష్ అంటాడు.
కల్యాణ్ ను నేను చిన్నకొడుకులా చూసుకున్నా.. రాజ్ కంటే గారాబం చేశా.. ఈరోజు కల్యాణ్ కు ఓ పని చెప్తే.. వాన్ని నేను ఇంట్లో పనివాడిలా చూస్తున్నా అని ధాన్యలక్ష్మి అంటుందని అపర్ణ సుభాష్ కు చెప్తుంది. ధాన్యలక్ష్మీ అనడంలో తప్పేం లేదని సుభాష్ చెప్తాడు. ఇన్నాళ్లు అంటే కల్యాణ్ ఒంటరివాడు. ఇప్పుడు పెళ్లి అయిందిగా. తన భార్య ముందు కొడుకును తక్కువ చూడటం తనకు నచ్చలేదు అంతే అని సుభాష్.. అపర్ణకు చెప్పుకువస్తాడు.
కావ్య, స్వప్న ఇద్దరు అక్కాచెల్లెల్లు... అయినా వారిలో తేడా ఉంది.. అలాంటిది తోడి కోడళ్ల మధ్య ఉండదా అని సుభాష్ అనగా... మీ లాజిక్ లు నా కోపాన్ని చల్లార్చవు అంటూ అపర్ణ వెళ్లిపోతుంది. ఇక్కడ నా పరిస్థితి ఇలా ఉంటే నా తమ్ముడి పరిస్థితి ఎలా ఉందో అని సుభాష్ అనుకుంటాడు. ఇక ప్రకాశం గదిలో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది. ధాన్యలక్ష్మి.. అపర్ణ మీద ఫైర్ అవుతూ ప్రకాశానికి చెప్తుంది. ఇక సైలెంటుగా ప్రకాశం వెళ్లిపోతాడు. అన్నయ్య సుబాష్ దగ్గరకు వెళ్లి.. జరగింది చెప్తాడు. ఇక మందు వెద్దాం పదా వెళ్లిపోతారు.
మరోవైపు కావ్య ఒంటరిగా బాల్కోని కూర్చుని ఉంటుంది. కల్యాణ్ వచ్చి నేను ఆసుపత్రికి తీసుకెళ్లేవాన్ని కదా అని అంటే.. లేదు లేండి కవిగారు. పెద్దత్తయ్య మీకు పని చెబితే చిన్నత్తయ్య ఏదో అన్నారట కదా. అక్క చెప్పిందని చెప్తుంది. మళ్లీ నన్ను అనేవాళ్లు అని కావ్య చెప్తుంది. ఈ ఇంట్లో అందరూ పెద్దరికి మర్చిపోయి మన కుటుంబం నుంచి నా కుటుంబం అనేవరకు వచ్చారని కల్యాణ్ అంటాడు. కొడుకుకి పట్టాభిషేకం చేద్దామనుకున్న కైకేయి పరిస్థితి ఏమైందో తెలిసి కూడా మా అమ్మ ఇలా చేస్తుందని చెప్తాడు.
మీరెందుకు ఈ మధ్య ఒంటరిగా ఉంటున్నారని కల్యాణ్ అడుగుతాడు. అన్నయ్యే కారణమా అని కల్యాణ్ అంటే.. కావ్య ఏం లేదని అంటుంది. అందులోనే చాలా ఉందని అర్థమవుతోంది. నాకు కూడా చెప్పకుండా దాటేస్తున్నారంటే అంతకంటే పెద్ద విషయం అనిపిస్తుంది. ఏం లేదని కావ్య వెళ్లబోతుంటే.. నాకు చెప్పకుంటే నా మీద ఒట్టే అని ఒట్టు వేయించుకుంటాడు కల్యాణ్. ఇక చేసేది ఏమీ లేక రాజ్ గురించి చెప్పేస్తుంది. శ్వేత, రాజ్ కలిసి ఉన్న ఫోటోను చూపిస్తుంది.
అది చూసి శ్వేత కదా అని కల్యాణ్ అంటాడు. మీకు తెలుసా అని కావ్య అడుగుతుంది. నాకు తెలుసు. అన్నయ్య క్లాస్ మేట్. నేను వాళ్ల జూనియర్ ను అని కల్యాణ్ అంటే.. వాళ్ల మధ్య ఏమైనా జరిగిందా అని కావ్య అడుగుతుంది. శ్వేత అన్నయ్యను ఇష్టపడింది. కానీ, అన్నయ్యకు ఇష్టమో కాదో తెలియదు. అన్నయ్య అడిగితే ఇంట్లోవాళ్లు కాదనరు కదా. అయినా అదెప్పుడో జరిగిపోయిందని కల్యాణ్ అంటాడు. ఇప్పుడు ఆమె నా జీవితంలోకి వచ్చింది. నా కాపురంలోకి కూడా వచ్చిందేమో అని భయంగా ఉంది. వాళ్లు తరచు కలుస్తూనే ఉన్నారు కావ్య చెప్తుంది.
మరోవైపు కల్యాణ్‌ను బుజ్జగించాలి అని వెతుకుతూ ఉంటుంది. కావ్య, కల్యాణ్ ను చూసి వీళ్లేం సీక్రెట్ మాట్లాడుకుంటున్నారు అని వెళ్తుంది. కవిగారు ఇది ఇంట్లో ఎవరికీ చెప్పకండి. మీ అన్నయ్యను దోషిలా నిలబెట్డడం నాకు ఇష్టం లేదు అని కావ్య అంటుంది. ఇంతలో అనామిక వస్తే ఆగిపోతారు. ఏంటి నన్ను చూసి ఆగిపోయారు. నా గురించే మాట్లాడుకుంటున్నారా అని అనామిక అంటే.. ఏం లేదని కావ్య చెప్పి వెళ్లిపోతుంది. కల్యాణ్ కూడా అదే అంటాడు. అనామిక వెళ్తుంటే ఎదురుపడిన రుద్రాణి.. పెద్ద గొడవ చేస్తావనుకున్నా. వాళ్లు అలా ఆగిపోయారంటే.. నీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నట్టున్నారు అని రెచ్చగొడుతుంది రుద్రాణి.
కావ్య ఏం చెప్పిన కల్యాణ్ మనసు మారదు.. నన్ను ప్రేమించాడు.. అని చెప్తుంది. అయినా కూడా రుద్రాణి రెచ్చగొడుతుంది. అనామిక కావ్య పనులు అలా పకడ్బందీగా ఉంటాయి అని రుద్రాణి అంటే.. ఏం చేసినా మా ఇద్దిరిని విడగొట్టలేదని అనామిక అంటుంది. అప్పునే తనను నిజంగా ప్రేమించిందని, నీపై కోపం వచ్చేలా చేస్తే. ఈ ఇంటికి కోడలిగా అప్పుని తీసుకొస్తే.. అది ఫెయిల్ అయిందిగా. అప్పు దగ్గరికే కల్యాణ్ వెళ్లి పెళ్లి చేసుకుంటావా అని అడిగిలా చేస్తే నిలబడుతుండా నీ ప్రేమ. ముందుగానే హెచ్చరిస్తున్నాను అని రుద్రాణి పుల్ల పెట్టేసి వెళ్లిపోతుంది.
దాంతో ఆలోచనలో పడిపోతుంది అనామిక. తర్వాత కావ్య బెడ్ మీద బాధగా పడుకుని ఉంటుంది. పడుకుని ఉన్నావా అని రాజ్ అంటే.. పడుకున్నట్లు నటించలేను. కళ్లు తెరుచుకున్నాయని కావ్య చెప్తుంది. అసలు ఏం మాట్లాడుతున్నావ్. ఏం అడగాలనుకుంటున్నావని రాజ్ నిలదీస్తాడు. క్లారిటీ వచ్చాకా అడుగుతానని కావ్య చెప్తుంది. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక తర్వాతి ఎపిసోడ్‌లో భోజనం ఇచ్చి తినమని రాజ్ అంటే వద్దంటుంది కావ్య. నువ్ ఇలాగైతే ఎందుకు తింటావే అని చేతులు కొంగుతో కట్టేసి.. కావ్యకు బలవంతంగా తినిపిస్తాడు రాజ్.


Click it and Unblock the Notifications











