Brahmamudi January 25th ఫోన్‌లో రాజ్, శ్వేతల బండారం చూసి షాకైన కల్యాణ్... అధికారం కోసం ధాన్యలక్ష్మి రచ్చ

నేటి బ్రహ్మముడి సీరియల్ జనవరి 25వ తేదీ ఎపిసోడ్ కూడా ఆసక్తిగా సాగింది. కావ్య గదిలో పడుకుని ఉండగా... రాజ్ వచ్చి ఎందుకు ఇలా ఉన్నావని అడుగుతాడు. ఏం లేదని కావ్య చెప్పగా.... తిన్నావా అని రాజ్‌ అడుగుతాడు. తిట్లా... ఇవాళ ఎవరు తిట్టలేదని వెటకారంగా అంటుంది కావ్య. తినమని ఎంత ఫోర్స్ చేసినా.. నేను తినను అని చెప్తుంది కావ్య. నేను పడుకుంటాను అని కావ్య దుప్పటి కప్పుకుని పడుకుంటుంది. ఒక్కసారి ఆసుపత్రికి రాను అన్నంత మాత్రానా ఇంతలా చేయాలా.. నాకు బుజ్జగించడం రాదు అని రాజ్ అంటాడు. ఇప్పుడు తింటావా లేదా అని అడిగితే... తినను అని చెప్తుంది కావ్య. దీంతో రాజ్‌ బయటకు వెళ్లిపోతాడు.

కావ్య ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రాజ్‌ భోజనం ప్లేట్‌ తీసుకుని వస్తాడు. లేమ్మని చెప్తాడు.. మీరు తెచ్చారు ఏంటి.. తప్పుతుందా అని రాజ్ అంటాడు. లే కూర్చో అంటే కావ్య లేస్తుంది. తినమని చెప్తాడు రాజ్. వద్దని కావ్య చెప్తుంది. కావ్య చేతులు తన కొంగుతో కట్టేసి భోజనం తినిపిస్తుంటాడు రాజ్. కావ్య అన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ భోజనం తింటుంది. తర్వాత కావ్యకు రాజ్‌ టాబ్లెట్స్‌ ఇస్తాడు. ఇంక తీరిగ్గా పడుకో నేను హాయిగా పడుకుంటాను అని రాజ్‌ చెప్తుండగానే శ్వేత కాల్‌ చేస్తుంది.

January 25th 2024 Episode number 315 in Brahmamudi Telugu Serial

రాజ్‌ తనకు అర్జెంట్‌ కాల్‌ వస్తుంది. నేను మాట్లాడి వస్తాను అంటూ బయటకు వెళ్తాడు. కావ్య బాధగా కృష్ణుడి విగ్రహం దగ్గరకు వెళ్తుంది. కృష్ణ నీ మాయలో నేను పడుతున్నానా? 8 మంది భార్యలలో ఒక భార్య దగ్గరుంటే మిగతా ఏడుగురి భార్యలను నువ్వు ఏం మాయ చేసి ఎలా మభ్యపెట్టి నీ పబ్బం గడుపుకున్నావో.. నాకు అర్థం కావడం లేదు అంటూ కావ్య అంటుంది. ఇందాక నా గదిలో ఒక మాయ జరిగింది. నా భర్త నాకు భోజనం తినిపించాడని కృష్ణుడికి చెప్తుంది.

అప్పుడు ఏమీ అనకుండా నా చేతులు కట్టేశాడు. ఆ గోరు ముద్దల రుచి చూసి నా నోరు నేనే కట్టేసుకున్నాను. ఇలాంటిదేనా నువ్వు కూడా ఉపయోగించిందని కృష్ణుడిని నిలదీస్తుంది. మా ఆయన నీలాగే చేస్తున్నట్లు అనిపిస్తుంది. అప్పటిదాకా నాతో ఉండి ఆ తర్వాత ఇంకెవరితోనో ఆనందంగా ఉండి అసలు ఆయన ఏం చేయాలనుకుంటున్నారు. ఏది సత్యం ఏది అసత్యం ఈరెండిటి మధ్య ఉన్న గీత మీద నేనున్నాను. గీత చెప్పినట్లు నా రాత మార్చేది నువ్వే నా సమస్యను పరిష్కరించాలని కోరుకుంటుంది కావ్య.

ఇంతలో ఇందిరాదేవి వచ్చి కావ్యను ఇక్కడేం చేస్తున్నావని అడగుతుంది. రాజ్‌ విషయాన్ని ఇన్‌ డైరెక్టుగా తన ఫ్రెండుకు జరిగిన ఘటన అని చెప్తుంది కావ్య. దీంతో ప్రశ్నించాలని.. అనుమానంతో ఉండటం కన్నా భర్తను నిలదీసి అడగాలని సూచిస్తుంది ఇందిరాదేవి. దీంతో కావ్య కృష్ణుడి వైపు చూసి ఈ విధంగా నాకు దారి చూపావా జగద్గురు అని మనసులో అనుకుంటుంది. నువ్వు ప్రశాంతంగా పడుకో రేపు మీ ఫ్రెండుకు చెప్పు అని బామ్మ వెళ్లిపోతుంది.

నిజంగా నువ్వు అమ్మమ్మతో నా కర్తవ్యాన్ని చెప్పించావు స్వామి. ముందు ఆ ఇద్దరి మధ్య ఉన్నదేంటో కనుక్కుంటానని కావ్య అనుకుంటుంది. కళ్యాణ్‌, కావ్య మాట్లాడుకుంటుంటారు. అమ్మమ్మగారు నా ఫ్రెండు కోసం ఇచ్చిన సలహా పాటించాలంటే ఏం చేయాలో.. ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెలియడం లేదు కవిగారు అని కావ్య అంటుంది. ఒక కవి నుంచి కవిత్వం రావాలంటే భావావేశం రావాలి. ఒక భార్య నుంచి విప్లవం రావాలంటే ప్రేమావేశం రావాలని కల్యాణ్ అంటాడు. ప్రేమ ప్లస్‌ ఆవేశం ఈ రెండు కావాలి. మీకెలాగు అన్నయ్య ప్రేమ ఉంది ఇక రావాల్సింద ఆవేశమేనని కల్యాణ్ సూచిస్తాడు.

ఆవేశం తెచ్చుకుంటే ఆయాసం తప్ప ఇంకేం మిగులుతుంది కవిగారని కావ్య అంటుంది. మీ అన్నయ్య దగ్గరకు వెళ్లి మీకు ఆ అమ్మాయికి ఏంటి సంబంధం చెప్పండి అని నిలదీస్తే బాగుండదు కదా అని కావ్య అంటుంది. అందుకే వదిన మనం నవ్వినట్లే ఉండాలి. చేసేది చేస్తూనే ఉండాలి. ఏమీ ఎరుగనట్లు నటించాలి. అన్నీ తెలసుకుంటూనే ఉండాలని కల్యాణ్ చెప్తాడు. అసలు ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి కవిగారు అని కావ్య అంటుంది.

ఆ కాలంలో షర్ట్‌ కు అంటిన కుంకుమ బొట్టు వల్లో.. పొడుగాటి తల వెంట్రుకల వల్లో గుర్తు పట్టేవారు. ఈ కాలంలో కనిపెట్టాలంటే సులువైన పద్దతి ఎప్పుడో కనిపెట్టారు. అదే సెల్‌ ఫోన్‌. ముందు అన్నయ్య సెల్‌ ఫోన్‌ నుంచి మొదలుపెడదామని చెప్తాడు కల్యాణ్. అంటే చాటింగ్‌ చెక్‌ చేద్దామా? అని కావ్య అడుగుతుంది. అవును అప్పుడే మనం చీటింగ్‌ గురించి తెలుసుకోవచ్చని చెప్తాడు.

కావ్య, కల్యాణ్ ఇద్దరూ ప్లాన్‌ వేసుకుని రాజ్‌ బెడ్‌ రూం దగ్గరకు రాగా... రాజ్‌ ఫోనులో శ్వేతతో చాట్‌ చేస్తుంటాడు. అన్నయ్య బాత్రూంలోకి వెళ్లగానే ఫోన్‌ తీసుకొని చెక్‌ చేద్దాము అంటూ కళ్యాణ్‌ చెప్తుండగానే రాజ్‌ బాత్రూంలోకి వెళ్తాడు. కావ్య లోపలకి వెళ్లి రాజ్‌ ఫోన్‌ తీసుకురావడానికి భయపడి ఉత్తి చేతులతో బయటకు వస్తుంది. మీకు సంస్కారం ముఖ్యమా..? మీ సంసారం ముఖ్యమా అని కళ్యాణ్‌ అడుగుతాడు.

నాకు సంసారమే ముఖ్యం కానీ నా మనసు ఎందుకో ఒప్పుకోవడం లేదు అంటుంది కావ్య.. అయితే మీరు నాకు అమ్మ తర్వాత అమ్మ లాంటి వారు నేను మీకోసం ధైర్యం చేస్తాను. అంటూ కళ్యాణ్‌ లోపలికి వెళ్ళి ఫోన్‌ తీసుకొచ్చి ఒపెన్‌ చేసి చూసి షాక్‌ అవుతాడు. కావ్య కంగారుపడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది. తర్వాతి ఎపిసోడ్ లో కల్యాణ్.. వచ్చి పెద్దమ్మ గిజర్ రిపేర్ చేయించాలి కదా టెక్నిషియన్ ఎన్ని గంటలకు రమ్మన్నాలి అని అడుగుతాడు. ఇక అవసరం లేదు అని అపర్ణ చెప్తుంది. ఈలోపు ధాన్యలక్ష్మి ఎంటర్ అయి మాట్లాడుతుంది. వారిద్దరి మధ్య గొడవ జరుగుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X