Brahmamudi January 26th రాజ్, శ్వేతలను పట్టుకునేందుకు ఆఫీసుకు కావ్య.. కోడలికి సపోర్టుగా అపర్ణ!
నేటి బ్రహ్మముడి సీరియల్ జనవరి 26వ తేదీ ఎపిసోడ్ లో రాజ్ ఫోన్ ను కల్యాణ్ సీక్రెట్ గా తీసుకుని వచ్చి చూస్తాడు. ఇక కావ్యను చూడమని చెప్తే చూడను అంటుంది. దీంతో కల్యాణ్ చూసి షాక్ అవుతాడు. కల్యాణ్ ను చూసి కావ్య కంగారు పడుతుంది. ఇది చూస్తుంటే వీరి మధ్య స్నేహం కంటే మించి రిలేషన్ ఉందని అనిపిస్తోందని కల్యాణ్ అంటాడు. అంటే ఇష్టపడుతున్నారా అని కావ్య అంటే.. అయ్యో.. అప్పుడే ఒక నిర్ణయానికి రావొద్దు అని కల్యాణ్ అంటాడు. ఫోన్ అక్కడ పెట్టి వస్తానని బెడ్ పై రాజ్ ఫోన్ పెట్టి వస్తాడు కల్యాణ్.
ఇక కావ్యకు దైర్యం చెప్పేందుకు కల్యాణ్ ప్రయత్నిస్తాడు. ఎప్పుడు రాజ్ పక్కనే ఉండండని చెప్తాడు. మనసులో నేను లేనప్పుడు పక్కన ఉంటే ఏం లాభం అని కావ్య అంటుంది. అన్నయ్యతోపాటే మీరు కూడా ఆఫీస్‌కు వెళ్లాలని కల్యాణ్ చెబుతాడు. ఏ ఇంట్లో ఉండి ఏం మాట్లాడుతున్నారు. అందరికీ టీ, టిఫిన్స్ ఇచ్చే సమయం అయింది అని వెళ్లిపోతుంది కావ్య. కల్యాణ్ ఆలోచనలో పడిపోతాడు. మరోవైపు అప్పు బయటకు వెళ్లడం చూసి ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది కనకం. పనికోసం వెళ్తున్నట్లు చెప్తుంది.
ఉద్యోగం వద్దు... చదువుకోమని.. మూర్తి చెప్తాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో... చదువు సాధ్యం కాదని చెప్తుంది. నా చదువుకు తగ్గ ఉద్యోగం చూసుకుంటా అని చెప్తుంది. ఇప్పుడు నీ వ్యాపారం కూడా సరిగా కావట్లేదు కదా.. ఇంటికోసం నేను కష్టపడుతాను అని చెప్తుంది. ప్రేమ నుంచి బయట పడిందని సంతోషపడాలా ఇంటికోసం కష్టపడుతుందని బాధ పడాలో అర్థం కావట్లేదు అని కనకం అంటుంది. బయట ఉన్న ఫ్రెండ్ తో నా అలసిపోయేంతవరకు కాదు నా బాధ చెమటలా కరిగిపోయేంత వరకు నువ్ చెప్పినట్లు పని చేస్తా అని అప్పు అంటుంది.

మరోవైపు రాజ్ ఫోన్ మోగుతుంది. కావ్య అది చూడబోతుంటే ఇంతలో వచ్చిన రాజ్ వచ్చి లాగేసుకుంటాడు. దాంతో మనం బయటపడకూడదు. కూల్ గా ఉండాలని కల్యాణ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్న కావ్య.. ఏమైంది. ఫోన్ లాగేసుకుని పారిపోతానని అనుకున్నారా అని కావ్య అంటుంది. కొత్త క్లైంట్ అని రాజ్ అంటాడు. కొత్త క్లైంటా.. పాత క్లైంటా.. పాత క్లైంట్ అయితే అర్థం చేసుకుంటారు. కట్ చేస్తే బిజీగా ఉన్నారని అనుకుంటారు. చేసే వరకు ఎదురచూస్తుంటారు. కానీ, కొత్త క్లైంట్ అయితే ఫీల్ అవుతారు కదా అని కావ్య అంటుంది.
ఇక కాసేపు రాజ్ కు కొత్త, పాత వింత, రోత మీద పెద్ద క్లాస్ ఇస్తుంది. ఏది ఏమైనా కాపురం రెండు ముక్కలు చేయకూడదు. జీవితం రెండు ముక్కలు చేయకూడదు. కుటుంబాన్ని ముక్కలు చేయకూడదు. ఒక ముక్కగా జీవిచండం చాలా కష్టం అని కావ్య అంటుంది. ఏంటే ఈ ముక్కల గోల ఏంటే అని రాజ్ అంటే.. గోల కాదు జీవిత సత్యాలు. మీరు మీ కొత్త క్లైంట్‌తో మాట్లాడుకోండి. లేకుంటే ఫీల్ అవుతారు. నేను మధ్యలో వచ్చాను. మధ్యలోనే వెళ్తాను. అని చెప్పి కావ్య బయటకు వెళ్లిపోతుంది. ఈలోపు శ్వేత కాల్ చేస్తే.. లిఫ్ట్ చేస్తే.. ఇవాళ వస్తాను. నీతోనే ఉంటాను అని చెబుతాడు.
తర్వాత పెద్దమ్మ గీజర్ రిపేర్ చేసే టెక్నిషీయన్ కావాలన్నారు కదా. ఎన్నింటికి రమ్మంటారు అని కల్యాణ్ అడుగుతాడు. వద్దు కల్యాణ్. నేను రాజ్ తో చేయించుకుంటా అని అపర్ణ అంటుంది. అదేంటి పెద్దమ్మ నన్ను వేరేలా చూస్తున్నారా అని కల్యాణ్ అడుగుతాడు. ఇన్నాళ్లు నేను నా బిడ్డలాగే చూశాను. కానీ, కాదని నిన్నే అర్థమైందని అపర్ణ అంటుంది. ఈలోపు ధాన్యలక్ష్మి వచ్చి... నా కోడుకుని ఎందుకు అలా చూస్తున్నవ్ అని అడుగుతుంది. వాడికి భార్య వచ్చింది.. వాడిని చిన్నగా చూడటం నాకు ఇష్టం లేదు అని చెప్తుంది.
ఇక ధాన్యలక్ష్మి, అపర్ణ మధ్య పెద్ద యుద్దమే జరుగుతుంది. అధికారం అంతా నీ కొడుకే దగ్గరే ఉంటే.. నా కొడుకు ఏం చెప్పాలని అడుగుతుంది. ఇక వీరి గొడవను చూసి... ఇద్దరిపై ఇందిరాదేవి కోప్పడుతుంది. ఇటు రండి అని బయటకు తీసుకెళ్తుంది. ఇక బయటకు తీసుకువెళ్లినా అక్కడ కూడా గొడవపడుతారు. ఇక వారికి ఇందిరాదేవి క్లాస్ ఇస్తుంది. ఇన్నాళ్లు వేరు.. ఇప్పుడు నా కొడుక్కి పెళ్లైంది.. అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇక ఇందీరాదేవి వారికి సర్ధిచెప్తుంది.

అత్తలా కాదు ఒక తల్లిలా చెప్తున్నాను... ఇది ఓ రోజు ఉండి చుట్టాల్లా వెళ్లిపోయే ఇల్లు కాదు... ఈ ఇంట్లోనే ఉండాలి. తెల్లారితే మొహం చూసుకోవాలి. ఎడమొహం పెడ మొహం లేకుండా ఉండొద్దు. ఇద్దరు ఒకే మాట మీద ఉంటే చెప్పుడు మాటలకు దూరం కాము. అర్థమైందా అని ఇందిరాదేవి అంటుంది. దాంతో ఇద్దరూ సరే అంటారు. తర్వాతి ఎపిసోడ్ లో అపర్ణతో అత్తయ్య మన ఆఫీస్‌లో డిజైనర్‌గా జాయిన్ అవుదామనుకుంటున్నాను అని కావ్య చెబుతుంది. దాంతో అపర్ణ ఆలోచిస్తుంటే.. అనామిక, రుద్రాణి షాక్ అవుతుంది. దాంతో మా అక్క కావ్యను ఆఫీస్ కు వెళ్లొద్దని ఇల్లు చూసుకోమ్మని ఎప్పుడో చెప్పింది కదా. నీకు వంటిల్లే కరెక్ట్ స్థానం అని ధాన్యలక్ష్మీ అంటుంది. నా కోడలు ఎక్కడ ఉండాలో చెప్పడానికి నువ్వు ఎవరు. కావ్య నువ్ ఆఫీస్‌కు వెళ్లు అని అపర్ణ అంటుంది. దాంతో ధాన్యలక్ష్మీ షాక్ అవుతుంది. కల్యాణ్ చాలా సంతోషిస్తాడు.


Click it and Unblock the Notifications











