Brahmamudi January 27th స్వప్నపై రుద్రాణి, రాహుల్ మర్డర్ ప్లాన్... కలిసిపోయిన కావ్య, అపర్ణ!

నేటి బ్రహ్మముడి సీరియల్ జనవరి 27వ తేదీ ఎపిసోడ్ లో... అపర్ణ, ధాన్యలక్ష్మి గొడవకు... ఇందిరాదేవి బుద్ధి చెప్తుంది. ఇద్దరి కోడళ్లకు ఎలా ఉండాలో చెప్తుంది. కోడాళ్ల ముందు గౌరవం కోల్పోతారు.. ఇక నుంచి అలా ఉండకూడదని వార్నింగ్ ఇచ్చి పోతుంది. ధాన్యలక్ష్మి.. అపర్ణకు సారీ చెప్తుంది. ఇచ్చే విలువ ఇస్తే నేనెందుకు అలా అంటాను అని అంటుంది. ఇకనుంచి ఇచ్చే విలువ ఇస్తా. నీ జోలికి నేను రాను. నా జోలికే నేనే వస్తాను అని చెప్పేసి అపర్ణ వెళ్లిపోతుంది.

రుద్రాణి, రాహుల్ కలిసి... స్వప్నకు టాబ్లెట్స్ తీసుకువస్తారు. ఆ టాబ్లెట్స్ చూసి... స్వప్న వీడియో తీస్తుంది. ఇప్పుడు వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నావని రుద్రాణి అడుగుతుంది. అయినా ఆగకుండా స్వప్న వీడియో తీస్తుంది. ఇది ఎవరు తీసుకొచ్చారు అని స్వప్న అంటే.. నేను తీసుకొచ్చాను అని రాహుల్ అంటాడు. ఎవరికి చెప్పాను అని స్వప్న అంటే.. నాకు చెప్పావు అని రుద్రాణి అంటుంది. నేనే తీసుకొచ్చాను అని రాహుల్ చెబుతాడు. చూశారుగా. వీళ్లిద్దరు నా మీద మర్డర్ అటెంప్ట్ చేశారు. ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డర్. గౌరవనీయులైన జడ్జి గారు ఇది మీరు గమనించి ఈ నేరస్తులకు శిక్ష వేయండని వీడియోలో చెబుతుంది స్వప్న.

ఏ స్వప్న ఏంటిది.. మేము నిన్ను చంపాలనుకోవడం ఏంటని రుద్రాణి అడుగుతుంది. మీరు నాకు తెచ్చిన ట్యాబ్లెట్స్ ఎక్స్ పైర్ అయ్యాయని చెప్తుంది. నేను కోర్టుకు వెళ్తాను. ఇప్పుడు ఇంట్లో అందరి ముందు మీ బాగోతం బయటపెడతాను. మీడియా మిత్రులను పిలిచి మీ దరిద్రపు మొఖాలను 24 గంటలు చూపించేలా చేస్తాను అని స్వప్న వెళ్లేందుకు ప్రయత్నించగా... స్వప్నను ఆపుతుంది రుద్రాణి. వాడు ఏదో చూసుకోకుండా తెచ్చి ఉంటాడులే అని అంటుంది. నేను నిజంగానే చూసుకోకుండా తెచ్చా. ఇంకోసారి అలా చేయను.

January 27th 2024 Episode number 317 in Brahmamudi Telugu Serial

నేను ఇండియాలో అన్ని ప్లేసులకు వెళ్లాను గానీ, ఒక జైలుకు వెళ్లలేదు. వెళ్లాలని కూడా అనుకోవట్లేదని రాహుల్ అంటాడు. ఈ ఒక్కసారికి క్షమించమని రాహుల్ అంటాడు. దాంతో సరే అన్న స్వప్న ఇంకోసారి ఇలా చేస్తే మీ పని అంతే.. వీడియో కూడా ఉంది అని స్వప్న బెదిరిస్తుంది. పాత కక్షలను మనసులో పెట్టుకుని మాకు శిక్ష వేయించాలని అనుకోవడం కరెక్టా. నీకు ఏమైనా జరిగితే ముందు మా మీదే అనుమానం వస్తుందని ప్రతి బచ్చా గాడికి తెలుసు అని రుద్రాణి అంటుంది. అవును, మీ అంతా నీచులు, నికృష్టులు, మేకవన్నె పులులు లేరని ఈ ప్రపంచం మొత్తం తెలుసని స్వప్న అంటుంది. ఏం జరిగినా మీ మీదే అనుమానం వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండని స్వప్న హెచ్చరిస్తుంది.

మరోవైపు హాల్లో కావ్య వచ్చి ఏం టిఫిన్ చేయమంటారు. అందరికి ఒకటే చేయమని అపర్ణ అంటుంది. ఇక నుంచి మాకు ఏం కావాలో మేమే చేసుకుంటామని ధాన్యలక్ష్మి అంటుంది. దాంతో ఏమవుతుందో అని ప్రకాశం భయపడిపోతాడు. కావ్య నువ్ పెసరట్టే చేయి.. నచ్చినవాళ్లు తింటారు. లేకుంటే లేదు అని కావ్యకు సపోర్ట్ చేస్తుంది అపర్ణ. ఇదంతా పైనుంచి చూస్తున్న రాజ్, కల్యాణ్ మాట్లాడుకుంటారు. ఈ గొడవలో పడి పిన్ని మన మీద పడలేదు అని రాజ్ అంటాడు.

నేను అయితే వదినా చేసిందే తింటాను అని కల్యాణ్ అంటాడు. మరి పిన్నికి ఏం చెప్తావ్ అని రాజ్ అంటే.. పెద్దమ్మ మీద తోసేస్తానని చెప్తాడు. అంటే.. రెండు పులులు కొట్టుకుంటే మధ్యలో నక్క లాభం పొందినట్లు.. వాళ్ల గొడవను నీకు అడ్వాంటేజ్‌ గా తీసుకుంటున్నావన్న మాట అని రాజ్ అంటాడు. దాంతో ఆలోచించిన కల్యాణ్.. అవును.. వీళ్ల గొడవలతో వదినను ఆఫీస్‌కు పంపొచ్చు అని మనసులో అనుకుంటాడు. వావ్.. భలే ఐడియా ఇచ్చావ్ అన్నయ్య. నువ్ నిజంగా జీనియస్. ఒక జీవితాన్ని కాపాడావు అని కల్యాణ్ చెప్పి వెళ్లిపోతాడు.

నేను సామెతేగా చెప్పాను. ఇందులో ఐడియా ఏముందని రాజ్ ఆలోచిస్తుంటాడు. దాంతో కావ్య దగ్గరికి వెళ్లిన కల్యాణ్.. శ్వేతతో అన్నయ్యకు ఉన్న బంధం తెలియాలంటే ఆఫీస్‌ కు వెళ్లాలని చెబుతాడు. వాళ్లిద్దరి గొడవను మనం అడ్వాంటేజ్ తీసుకోవాలని కల్యాణ్ అంటాడు. మా అమ్మ మీద పెద్దమ్మకు ఉన్న కోపానికి మనం క్యాష్ చేసుకోవాలని కల్యాణ్ అంటాడు. ఈ సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా అన్నయ్యకు శ్వేత మధ్య ఉన్న రిలేషన్‌ ను తెలుసుకోవాలి అని కల్యాణ్ అంటాడు.

దీంతో ఏం కాదు వదినా రండి అని తీసుకెళ్తాడు. ధాన్యలక్ష్మీ దగ్గరగా ఉండి.. హమ్మయ్యా ఎవరు లేరు ఇక్కడ అని గట్టిగా అంటాడు కల్యాణ్. దాంతో వెనక్కివెళ్లి దాక్కుని దొంగచాటుగా వింటుంది ధాన్యలక్ష్మీ. తన ముందు ఆఫీస్‌ కు వెళ్లడం, డిజైన్స్ గీయడం వంటివి కావాలనే మాట్లాడుతూ కావ్య, కల్యాణ్ డ్రామా చేస్తారు . ఏంటే నా కొడుకుని అసమర్థుడిని చేసి నువ్ ఆఫీస్‌ కు వెళ్లి రాజ్యం ఏలుదామనుకుంటున్నావా.. ఎలా వెళ్తావో నేను చూస్తాననిని ధాన్యలక్ష్మీ అనుకుంటుంది.

మరోవైపు అప్పుకు తన ఫ్రెండ్ మధు ఉద్యోగం ఇప్పిస్తుంది. డెలివరి బాయ్ ఉద్యోగంలో చేరుతుంది. థ్యాంక్స్ మధు అని చెప్తుంది. లైఫ్ సెటిల్ అయ్యే అవకాశాన్ని వదిలేసుకుని వచ్చి ఇప్పుడు పరిస్థితి గురించి మాట్లాడుతున్నావా అని మధు అంటుంది. లైఫ్ సెటిల్ అయ్యే అవకాశామా అని అప్పు అడిగితే.. కల్యాణ్. నాకే అలాంటి బాయ్ ఫ్రెండ్ ఉంటే దీన్నే కొనేసి నా లాంటి వాళ్లకు ఉద్యోగం ఇచ్చేదాన్ని. మనలాంటి వాళ్లి ఫ్రెండ్‌ షిప్ చేసేది ఎందుకు టైమ్ వచ్చినప్పుడు పెళ్లి చేసుకునేందుకేగా అని మధు అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

తదుపరి ఎపిసోడ్ లో కావ్య.. డైనింగ్ టేబుల్ దగ్గర వడ్డిస్తూ... ఆఫీసుకు వెళ్తాను అత్తయ్య అంటుంది. దీంతో ధాన్యలక్ష్మి కావ్యను ఆఫీసుకుపోవద్దని వంటిళ్లు చూసుకోమని చెప్పింది కదా అని ధాన్యలక్ష్మి అంటుంది. నీకు వంటిళ్లే కరెక్ట్ ప్లేస్ అని అంటుంది. నా కోడలు ఎక్కడ ఉండాలో డిసైడ్ చేయడానికి నువ్వు ఎవరు.. నువ్వు ఆఫీసుకు వెళ్తున్నవ్ అని అపర్ణ అంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X