Brahmamudi January 29th ఒక్కటైపోయిన అత్తా కోడాళ్లు... కేజీఎఫ్ లెవెల్ ఎలివేషన్‌లో ఆఫీసుకు కావ్య ఎంట్రీ!
నేటి బ్రహ్మముడి సీరియల్ జనవరి 29వ తేదీ ఎపిసోడ్ లో కల్యాణ్ ను పెళ్లి చేసుకుని ఉంటే... లైఫ్ సెటిల్ అయ్యేదని అప్పు ఫ్రెండ్ నానా మాటలు అంటుంది. మన లాంటి అమ్మాయిలు.. అందుకే కదా ఇలాంటి డబ్బున్న ఫ్రెండులతో స్నేహం చేసేది.. కుదిరితే పెళ్లి చేసుకుంటాం లేదంటే.. సెటిల్ అయిపోతాం అంటూ మాట్లాడుతుంది. ఇక ఇదంతా విన్న అప్పు కోపంతో... నాకు ఆ ఉద్దేశ్యం లేదని చెప్తుంది. ఉద్యోగం ఇప్పించావ్ కాబట్టి నిన్ను ఏమనకుండా వదిలేస్తున్న అని చెప్పి వెళ్లిపోతుంది.
మరోవైపు దుగ్గిరాల ఇంట్లో టిఫిన్ కోసం ప్రకాశం... ఫన్నీగా మాట్లాడుతుంటూ ఉంటాడు. ఆకలి అవుతుందని కడుపులో ఎలుకలు, పిల్లలు రన్నింగ్ రేస్ పెట్టుకున్నాంటూ అందుకే కుక్కలా అరుస్తున్నట్లు చెప్తాడు. ఇంతలో బ్రెడ్ టోస్ట్ తీసుకొచ్చి ఇస్తుంది ధాన్యలక్ష్మీ. ఇది ఆరోగ్యానికి మంచిది అని చెప్తుంది. నాకు వద్దని చెప్తాడు. ఇక ధాన్యలక్ష్మి తింటుంది. కావ్య.. ప్రకాషంకు పెసరట్టు పెడుతుంది. బాగుందని అనుకుంటూ తింటాడు. అనామిక కూడా వద్దనడంతో.. మాడిపోయిన బ్రెడ్ టోస్ట్ తినాల్సి వస్తుంది.
ఇంతలో వదినా విషయం చెప్పు అని కల్యాణ్ అంటాడు. అత్తయ్య.. మీరు ఒప్పుకుంటే మన ఆఫీసుకు డిజైనర్ గా జాయిన్ అవ్వాలని అనుకుంటున్నానని కావ్య అంటుంది. సూపర్ వదినా. వంటింటికే పరిమితం కాకుండా నీ ప్రతిభను ఆఫీస్ దాకా తీసుకెళ్లాలనుకుంటున్నావ్ కదా అని కల్యాణ్ అంటాడు. ఇక ధాన్యలక్ష్మి ఆపమని చెప్తుంది. గదిలో పిచ్చి రాతలు రాసుకుంటున్న నాలోని కవిని గుర్తించి వాటిని అచ్చు వేయించి పుస్తకం చేసింద అది చదివేగా అనామిక నన్ను ప్రేమించింది అని కల్యాణ్ అంటాడు.

కావ్య ఆఫీసుకు పోవద్దని చెప్పిన వదిననే కావ్య అనుమతి అడుగుతుందని రుద్రాణి అంటుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వీళ్ల వంశంలోనే లేదు. మాట తప్పడం, మోసం చేయడం తప్పా వీళ్లకు ఏం చేతన అవుతుందిలే అని ధాన్యలక్ష్మీ అంటుంది. చిన్నత్తయ్య నేను ఆఫీసుకు వెళ్తానని చెప్పట్లేదు. అత్తయ్య పర్మిషన్ అడుగుతున్నానని కావ్య అంటుంది. కాసేపు ధాన్యలక్ష్మి, స్వప్న మధ్య వాదన జరుగుతుంది. కావ్యను మా అక్క ఆఫీసుకు వెళ్లొద్దని ఎప్పుడో చెప్పిందని ధాన్యలక్ష్మి అంటుంది.
ఆఫీసుకు వెళ్లి రాజ్యమేలుదామని చూస్తుందని అంటుంది. ఒక్కసారి వద్దని చెప్పాకా మళ్లీ నిన్ను ఎలా వెళ్లమంటుంది. నీకు వంటిల్లే కరెక్ట్ అని ధాన్యలక్ష్మీ చెప్తుంది. నా కోడలు ఎక్కడ ఉండాలో డిసైడ్ చేయడానికి నువ్వు ఎవరు. నా కోడలు వండి తగిలేయడానికి వంటమనిషిలా కనిపిస్తోందా. అయినా నువ్ ఏదో ఇంటిని ఏలే మహారాణిలా శాసనాలు మొదలుపెట్టావేంటీ. నీకు నీ కోడలుకు ఇంటి ముందు ముగ్గు వేయడం వచ్చా అని అపర్ణ మండిపడుతుంది. నా కోడలు వేసిన డిజైన్స్ కు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ వచ్చిందని చెప్తుంది.
ఏవండి కావ్య డిజైన్స్ కు ఏ కాంట్రాక్ట్ వచ్చిందండని అపర్ణ సుభాష్ ను అడుగుతుంది.. ఫారెన్‌లో ఉండే దేవలయాలకు ఉండే దేవత విగ్రహాలకు ఆర్నమెంట్స్ తయారు చేసే కాంట్రాక్ట్ అని సుభాష్ చెప్తాడు. కావ్య రుచిగా వండుతుందని వంట చేస్తుంది. అంతేకానీ వంటమనిషిలా చూస్తావేంటీ అని ఇందిరాదేవి కూడా అంటుంది. కావ్య నువ్ ఆఫీస్‌కు వెళ్లు. ఏడ్చే వాళ్లు ఏడవని నువ్వు, నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అపర్ణ చెప్తుంది. ఇవాళ నుంచి ఆఫీసుకు వెళ్లమని ఇందిరాదేవి చెప్తుంది. దాంతో కోపంగా ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంది.

గదిలో రాజ్ రెడీ అవుతుంటే... ఏవండి మీ జడ్జిమెంట్ మీద మీకు నమ్మకం ఉందా అని కావ్య అడిగుతుంది. రెండు చీరలు తీసుకువచ్చి.. ఇందులో ఒకటి సెలెక్ట్ చేయమంటుంది. రాజ్... రెడ్ అండ్ బ్లాక్ కట్టుకో అని చెప్తాడు. అది కాకుండా వేరేది కట్టుకుంటాను అని చెప్తుంది. మరి నన్ను ఎందుకు అడిగావ్ అంటే.. మీ జడ్జ్ మెంట్ మీద నాకు నమ్మకం లేదని చెప్తుంది. తర్వాత ఆఫీస్ కు వస్తున్నట్లు కావ్య చెబితే రాజ్ అస్సలు నమ్మడు. మా అమ్మకు ఏమైంది. ఇలాంటి వైపరిత్యాన్ని ఎలా ఒప్పుకుందని టెన్షన్ పడుతుంటాడు. నేను వస్తే మీకేంటి అడ్డు అని కావ్య అంటే.. శ్వేత రోజు ఆఫీస్ కు వస్తున్నట్లు తెలుస్తుంది కాబట్టి అని మనసులో అనుకుంటాడు రాజ్.
నేను ఆఫీస్‌కు వెళ్లేందుకు మీ అమ్మగారు ఒప్పుకున్నట్లు మీకు హాల్లో సాక్ష్యం చూపిస్తానని కావ్య అంటుంది. రాజ్ హాల్లోకి రాగానే ఒక్కడివే వస్తున్నావ్ కావ్య ఏదని అపర్ణ అడుగుతుంది. ఇంతలో కావ్య వచ్చి రెడీ అయ్యాను అని కావ్య అంటుంది. వంటలాగా ఇలా లేట్ చేస్తే బాగుండదు. ఇలాంటి చీరలే కట్టాలని అపర్ణ అంటుంది. దేవుడుకి దండం పెట్టుకుంటానని కావ్య వెళ్తుంది. ఏంటీ మమ్మీ నువ్ ఎలా ఒప్పుకున్నావని రాజ్ అంటే.. విధివశాత్తు ఒప్పుకోవాల్సింది నాన్నా. గుండె రాయి చేసుకో అని అపర్ణ అంటుంది.
ఒంటరిగా కావ్య
కావ్య వస్తుంది. రాజ్‌ను కదిలించకు. ఏడ్చేసేలా ఉన్నాడని అపర్ణ చెప్తుంది. అయ్యో ఏమైందని కావ్య అంటుంది. పదా అని రాజ్ అంటాడు. తర్వాత కారులో కావ్యను ఎక్కుంచుకోకుండా రాజ్ ఒక్కడే వెళ్లిపోతాడు. ఎప్పుడు లేనంతగా ఇంతలా ఇరిటేట్ అవుతున్నారంటే.. నా అనుమానమే నిజమా. వీళ్లకు ఆఫీసే వేదిక కానుందా అని కావ్య అనుకుంటుంది. మరోవైపు కల్యాణ్ అనామిక గురించి రాసుకుంటాడు. ఇంతలో అనామిక వస్తే.. అమ్మో అని పక్కకు పెడుతాడు. దాంతో అది చూసి ఇరిటేట్ అయిన అనామిక ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది. తను పట్టనట్లు ఉంటాడు కల్యాణ్. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.
బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్ లో ఆఫీస్ కు వెళ్లకుండా అక్కడ ఏం చేస్తున్నావ్ అని అపర్ణ కావ్యను అడుగుతుంది. క్యాబ్ కోసం చూస్తున్నాను అని కావ్య అంటుంది. షేర్ ఆటోలో వెళ్లడం నీకు అలవాటే కదా అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో కావ్య ఈ ఇంటి పెద్ద కోడలు. ఆటోలో వెళ్లాల్సిన కర్మ పట్టలేదు. నా కారు తీసుకుని వెళ్లు అను కారు కీస్ తీసుకుని ఇస్తుంది అపర్ణ. మరోవైపు ఆఫీస్ లో అంతా బొకేలతో ఉంటారు. అది చూసిన రాజ్ నాకు తెలియకుండా క్లైంట్స్ ఎవరైనా వస్తున్నారా అని రాజ్ అడుగుతాడు. మేడమ్ వస్తున్నారని సెక్రటరీ చెబుతుంది. ఇంతలో కారులోనుంచి కేజీఎఫ్ ఎలివేషన్ తో కావ్య దిగుతుంది. అది చూసి రాజ్ షాక్ అవుతాడు. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











