Brahmamudi January 2nd: భార్యకు సపోర్టుగా నిలిచిన రాజ్... దుగ్గిరాల కుటుంబాన్ని విడగొట్టేందుకు అనామిక ప్లాన్?
బ్రహ్మముడి, నువ్వునేను సీరియల్ మహా ఎపిసోడ్ ముగిసింది. గత రెండు వారాలుగా ఈ రెండు సీరియల్స్ అనామిక, కల్యాణ్ పెళ్లి కోసం ఒక్కటయ్యాయి. ఎట్టకేలకు కల్యాణ్, అనామిక పెళ్లి జరిగింది. ఇక అప్పు తన ప్రేమను బయటపెట్టి షాకిచ్చిన విషయం తెలిసిందే. ఇక కావ్య.. తన తండ్రి మూర్తితో ఆవేదనతో మాట్లాడుతుంది. మీకు అవమానం జరిగింది క్షమించు అమ్మా అంటూ కావ్య బాధపడుతుంది. ఇక మూర్తి కూడా.. మా వాళ్ల నువ్వు కూడా మాటలు పడ్డావు అంటూ ఎమోషనల్ అవుతాడు. నీ కాపురం గురించి ఆలోచించు.. మమ్మల్ని వదిలేయ్ అంటూ చెప్తాడు.
కనకం వెళ్లొస్తాం కావ్య అంటుంది. అప్పుడే ధాన్యలక్ష్మి వచ్చి... వెళ్లండి.. మళ్లీ రావొద్దని చెప్తుంది. ఇప్పటి దాకా మమ్మల్ని మోసం చేసింది చాలు.. ఇక మిమ్మల్ని ఏ వేడుకలకు పిలువరు. మీరు ఎవరు మా గడప తొక్కడానికి వీలు లేదు అంటూ ఫైర్ అవుతుంది. తప్పంతా నాదే.. మా అక్క చెప్తూనే ఉంది.. కానీ నేనే వినిపించుకోలేదు. నేను నిన్న నమ్మి.. మోసపోయాను అంటూంది ధాన్యలక్ష్మి. మాయలు, మోసాలు చేశారు అంటూ ధాన్యలక్ష్మి ఫైర్ అవుతుంది. ఇక కనకం, మూర్తి సారీ చెప్పి వెళ్లిపోతారు.

ఇక కళ్యాణ్, అనామికలకు కావ్య హారతి ఇవ్వడానికి వస్తుంది. ఇక కావ్య హారతి ఇవ్వడాన్ని ధాన్యలక్ష్మితో పాటు అపర్ణ, రుద్రాణి అడ్డుకుంటారు. అందరూ కావ్యను దోషిని చేసి... నానా మాటలు అంటారు. కానీ రాజ్ మాత్రం కావ్యకు సపోర్టుగా మాట్లాడుతాడు. కావ్య వ్యక్తిత్వాన్ని అందరికి అర్ధమయ్యేలా చెప్తాడు. రాజ్ మంచి మాటలు ఎవరికి నచ్చవు.. కానీ అనామిక తల్లిదండ్రులకు రాజ్ ఇస్తానన్న డబ్బులు గుర్తుకు వచ్చి ఆగిపోతారు. ఇక కావ్యనే హారతి ఇవ్వాలని చెప్తారు. ఇక కావ్య హారతి ఇస్తుంది.
అనామిక, కల్యాణ్ లోపలికి వస్తారు. ఇక అనామికను పక్కకు తీసుకుపోయి.. అనామిక పేరెంట్స్ మాట్లాడుతారు. కావ్యపై డైరెక్టు ఆటాక్ చేస్తావ్ ఏంటి అని అడుగుతారు. నాకు చాలా కోపంగా ఉంది అని చెప్తుంది. ముందు కల్యాణ్ ను కంట్రోల్ లో పెట్టుకో.. అప్పుడు నువ్వు ఏం చెప్పినా నడుస్తుంది.. అంటూ తల్లి అనామికకు చెప్తుంది. నువ్వు ఇంట్లో ముందు మంచి పేరును తెచ్చుకో ఆ తర్వాత వాళ్ల పని చెప్పు అంటూ క్లాస్ ఇస్తుంది.
ఇక హాల్ లో అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు. నమ్మలేకపోతున్నామని అనామిక పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. మీరు నమ్మినా నమ్మకపోయినా... అనామిక ఈ ఇంటి కోడలు అయిందని అపర్ణ చెప్తుంది. ఇక కోడలు అనుకోవడం కంటే.. కూతురు వచ్చిందని అనుకుంటున్నా అని ధాన్యలక్ష్మి చెప్తుంది. ఇక అంతా బాగానే జరిగింది కానీ.. ఆ అప్పు విషయం జరగకపోయి ఉంటే బాగుండేదని రుద్రాణి అంటుంది.
ఇక అనామిక, కల్యాణ్ శోభనానికి ముహుర్తం పెట్టిస్తామని అపర్ణ అంటుంది. మా అచారం ప్రకారం మొదటి మూడు రాత్రులు మా ఇంట్లో జరిపిస్తామని అనామిక తల్లి చెబుతుంది. కానీ మా అచారం ప్రకారం ఇక్కడే జరిపిస్తాం.. కావాలంటే మొదటి పండక్కీ తీసుకువెళ్లండని చెప్తుంది. దానికి అనామిక పేరెంట్స్ కాస్త డల్ అవుతారు. ఇక ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. తదుపరి ఎపిసోడ్ లో కుటుంబసభ్యుల కోసం వంట చేస్తుంది కావ్య. అందరికి వడ్డించాలని అనుకుంటుంది కానీ... కావ్య వడ్డిస్తే తిననని అపర్ణ అంటుంది.
నేనే వడ్డించుకుంటానని చెప్పి కావ్య మనసును గాయపరుస్తుంది. ధాన్యలక్ష్మికి వడ్డించడానికి కావ్య వెళ్లగా.... నాకు ఏం కావాలో తెలుసు...నీ సహాయం అక్కరలేదని చెప్తుంది. ఇన్నాళ్లు కావ్యను ఎవరైన ఏమైనా అంటే మెరుపుతీగలా సర్రున పరుగెత్తుకొచ్చేదానివి కదా అంటూ ధాన్యలక్ష్మిపై రుద్రాణి సెటైర్ వేస్తుంది. నాకు ఎవరిని ఎక్కడ ఉంచాలో ఆలస్యంగా అర్థమైందని చెప్తుంది ధాన్యలక్ష్మి. ఎవరిని జీవితంలో అతిగా నమ్మకూడదని కావ్యను చూస్తూ కావాలనే అంటుంది ధాన్యలక్ష్మి.
ధాన్యలక్ష్మి మాటలతో కావ్య బాధపడుతుంది. కావ్యను తన ఫ్యామిలీ మొత్తం ద్వేషిస్తున్నారని రాజ్ అర్థం చేసుకుని... ఆమెకు తాను సపోర్ట్‌గా ఉండాలని ఫిక్స్ అవుతాడు. కావ్య చేసిన వంటలను తెగ మెచ్చుకుంటాడు. ఆ సీన్ చూసి అపర్ణ, ధాన్యలక్ష్మి షాక్ అవుతారు.


Click it and Unblock the Notifications











