Brahmamudi January 30th మరోసారి శ్వేతతో అడ్డంగా దొరికిపోయిన రాజ్... కోడలికి అపర్ణ ఫుల్ సపోర్ట్!

నేటి బ్రహ్మముడి సీరియల్ జనవరి 30వ తేదీ ఎపిసోడ్ లో కల్యాణ్ కవితలు రాస్తూ బిజీగా ఉంటాడు. ఇంతలో అనామిక వచ్చి... నువ్వు కూడా ఆఫీసుకు వెళ్లాలి కదా అని అడుగుతుంది. ఆఖరికి ఆ కావ్య కూడా వెళ్తుంది... నువ్వు మాత్రం ఇంట్లోనే కూర్చుంటావా అని విసుగ్గా చెప్తుంది. తాను ఖాళీగా ఏం లేన‌ని, బుక్‌కు సెకండ్ పార్ట్ కంప్లీట్ చేసే ప‌నిలో ఉన్నాన‌ని అనామిక‌కు కల్యాణ్ సమాధానం చెప్తాడు. కవితలు కాదు.. ఆఫీసుకు వెళ్లాల్సిందే అని అనామిక పట్టుబడుతుంది. నా అవసరం లేదని కల్యాణ్ చెప్తాడు. నాది బిజినెస్ మైండ్ కాదని చెప్తాడు.

ఇక కావ్య అవసరం ఉంది కాబట్టి వెళ్తుంది.. నా అవసరం ఏముందని చెప్తాడు. మీ అమ్మ కూడా ఫీల్ అవుతుంది.. నీకే అందరూ ఇంటి పనులు చెప్తున్నారని... అర్ధం చేసుకోండని చెప్తుంది అనామిక. సరే ఆలోచిస్తాను అని కల్యాణ్ చెప్తాడు. మరోవైపు ఆఫీసుకు వెళ్లేందుకు కావ్య క్యాబ్ కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. కావ్యను పిలిచి ఏమందని అడుగుతుంది. క్యాబ్ గురించి అని చెప్తుంది. నీకు షేర్ ఆటోల్లో వెళ్ల‌డం అల‌వాటే క‌దా అంటూ కావ్య‌పై సెటైర్ వేస్తుంది ధాన్య‌ల‌క్ష్మి.

కావ్య‌ ఈ ఇంటి పెద్ద‌కోడ‌లు క్యాబ్‌ లు, ఆటోల్లో వెళ్లాల్సిన ఖ‌ర్మ త‌న‌కు ప‌ట్ట‌లేదు అంటుంది అపర్ణ. నా కారులో ఆఫీస్‌కు వెళ్ల‌మ‌ని కావ్య‌తో అంటుంది అప‌ర్ణ‌. ఆమె మాట‌ల‌తో ఇందిరాదేవి ఆనంద‌ప‌డుతుంది. కానీ అప‌ర్ణ కారు కీస్ తీసుకోవ‌డానికి కావ్య సంశ‌యిస్తుంటుంది. నువ్వు ఎందులోనూ, ఎవ‌రి ముందు త‌క్కువ‌గా ఫీల‌వ్వాల్సిన అవ‌స‌రం లేదు. ఈ ఇంటి వార‌సుడి భార్య హోదాలో ఆఫీసుకు వెళ్తున్నావ్ అని చెప్తుంది.

January 30th 2024 Episode number 319 in Brahmamudi Telugu Serial

ఖ‌రీదైన కార్ల నుండి దిగితేనే ఈ ఇంటికి గౌర‌వం ఉంటుంద‌ని కావ్య‌కు త‌న కారు కీస్ ఇస్తుంది అప‌ర్ణ‌. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంత‌కంటే ఖ‌రీదైన కారు నేను కొనిస్తాన‌ని అప‌ర్ణ అంటుంది. మొద‌టిరోజు సంతోషంగా, ద‌ర్జాగా వెళ్ల‌మ‌ని కోడ‌లిని ద‌గ్గ‌రుండి ఆఫీస్‌కు పంపిస్తుంది. ఆఫీస్‌కు వెళుతూ ఇందిరాదేవి, అప‌ర్ణ ఆశీర్వాదం తీసుకుంటుంది కావ్య‌. నిన్ను నువ్వు నిరూపించుకోవ‌డానికి దొరికిన చ‌క్క‌టి అవ‌కాశం ఇద‌ని ఇందిరాదేవి అంటుంది. నీ మీద ప్రేమ‌,ఆపేక్ష ఉండి ఇవ‌న్నీ చేయ‌డం లేదు. ఈ ఇంటి కోడ‌లి విలువ అది. అందుకే నీ కోసం ఇంత చేస్తున్నాన‌ని కావ్య‌తో అంటుంది అప‌ర్ణ‌.

అప‌ర్ణ మాట‌లను ధాన్య‌ల‌క్ష్మి జీర్ణించుకోలేక‌పోతుంది. గదిలోకి వెళ్లి... ప్రకాషం దగ్గరకు వెళ్లి అసలు విషయం చెప్తుంది. క‌ళ్యాణ్ ఆఫీస్ వ‌స్తేనే గానీ నేను రాన‌ని మీ అన్న‌య్య‌తో తెగేసి చెప్ప‌మ‌ని భ‌ర్త‌ను అడుగుతుంది. అప‌ర్ణ త‌న కొడుకు రాజ్‌ తో పాటు కోడ‌లు కావ్య‌కు కూడా ఆఫీస్‌ కు పంపిస్తుంద‌ని చెప్తుంది. కావ్య ఆఫీస్‌కు వెళ్లింద‌ని తెలిసి ప్ర‌కాషం సంతోషంగా ఫీల‌వుతాడు. త‌న‌పై పంతంతోనే కావ్య‌ను అప‌ర్ణ ఆఫీస్‌ కు పంపిస్తుంద‌ని ధాన్య‌ల‌క్ష్మి అంటుంది.

పంతం లేదు..అంతం లేదు...ఎప్ప‌టికైన మంచి గెలుస్తుంద‌ని ధాన్య‌ల‌క్ష్మికి క్లాస్ ఇస్తాడు ప్ర‌కాషం. కోడ‌లు రాగానే నీలో స్వార్థం బాగా పెరిగింద‌ని చెబుతాడు. అనామిక కూడా మ‌రో రుద్రాణిలా త‌యారైంద‌ని అంటాడు. కావ్య‌పై అసూయ ప‌డ‌టం మానుకోమ‌ని స‌ల‌హా ఇచ్చి ఆఫీస్‌ కు వెళ‌తాడు ప్ర‌కాషం. ఫుడ్ డెలివ‌రీ వ‌ర్క్‌ నుంచి వ‌చ్చిన కావ్య క‌ళ్యాణ్ ఆలోచ‌న‌ల‌తో భోజ‌నం కూడా చేయ‌కుండా నిద్ర‌పోతుంది. డ‌బ్బు కోస‌మే తాను క‌ళ్యాణ్‌ను ప్రేమించినాన‌ని స్నేహితులు అన్న మాట‌లు గుర్తుతెచ్చుకొని బాధ‌ప‌డుతుంది.

January 30th 2024 Episode number 319 in Brahmamudi Telugu Serial

రాజ్ ఆఫీస్‌ లో అడుగుపెట్ట‌గానే అంద‌రూ ఫ్ల‌వ‌ర్ బొకేలు ప‌ట్టుకొని క‌నిపించ‌డం చూసి ఆశ్చ‌ర్య‌పోతాడు. మ‌న ఆఫీస్‌కు కొత్త‌గా ఎవ‌రైనా క్ల‌యింట్స్ వ‌స్తున్నారా అని శృతిని అడుగుతాడు. కాదు మేడ‌మ్ వ‌స్తున్న‌రాని శృతి స‌మాధానం ఇస్తుంది. ఆ మేడ‌మ్ ఎవ‌రా అని రాజ్ వెన‌క్కి తిర‌గ్గానే అప‌ర్ణ ఇచ్చిన కారు నుంచి దిగుతూ కావ్య క‌నిపిస్తుంది. కావ్య ఆఫీస్‌ లో అడుగుపెట్ట‌గానే ఎంప్లాయ్‌లు అంద‌రూ పోటీప‌డి కావ్య‌కు కంగ్రాట్స్ చెబుతారు. అవ‌న్నీ చూసి రాజ్ ఫైర్ అవుతాడు.

శృతిని త‌న క్యాబిన్‌లోకి పిలిచి క్లాప్ ఇస్తాడు. కావ్య‌ వ‌స్తున్న‌ట్లు సుభాష్ సార్ చెప్పార‌ని, ఘ‌నంగా స్వాగ‌తం ప‌ల‌కాల‌ని అన్నార‌నే నిజాన్ని రాజ్ ముందు బ‌య‌ట‌పెడుతుంది శృతి. కావ్య అపాయింట్‌ మెంట్ ఆర్డ‌ర్ కూడా సుభాష్‌ ప్రిపేర్ చేశార‌ని, అది కూడా రాజ్ చేతుల మీదుగానే మీరు తీసుకోవాల‌ని కండీష‌న్ పెట్టార‌ని కావ్య‌తో అంటుంది. తాను ఇవ్వ‌న‌ని అంటాడు రాజ్‌. ఇవ్వ‌క‌పోతే సుభాష్‌ గారు ఫోన్ చేయ‌మ‌న్న‌ర‌ని చెప్తుంది. తండ్రి మాట‌ను కాద‌న‌లేక త‌న చేతుల మీదుగానే కావ్య‌కు అపాయింట్‌ మెంట్ ఆర్డ‌ర్ ఇస్తాడు రాజ్‌.

నేను ఎక్క‌డ కూర్చోవాలి అని రాజ్‌ ను అడుగుతుంది కావ్య‌. బ‌య‌ట ప్యూన్ ఛైర్‌ లో కూర్చొమ‌ని కావ్య‌పై సెటైర్ వేస్తాడు రాజ్‌. తాను ఎగ్జిక్యూటివ్ డిజైన‌ర్‌ న‌ని, ప్యూన్ ని కాదని చెప్తుంది కావ్య. ఎక్కడో ఓ చోట కూర్చమని చెప్తాడు రాజ్. అయితే మీ చైర్ లో కూర్చుంట లేమ్మని చెప్తుంది. దీంతో రాజ్ షాక్ అవుతాడు. ఇక తదుపరి ఎపిసోడ్ లో రాజ్ ఆఫీస్‌ లో బిజీగా ఉంటాడు. శ్వేత రాజ్ కు ఫోన్ చేయ‌డంతో కంగారుగా ఆమె ద‌గ్గ‌ర‌కు వెళ‌తాడు. రాజ్‌ ను కావ్య సీక్రెట్‌ గా ఫాలో అవుతుంది. నీ లైఫ్ నాది...నీకు ఏ క‌ష్టం రాకుండా తాను చూసుకుంటాన‌ని శ్వేత‌కు మాటిస్తాడు రాజ్‌.నీకు నేను ఎప్ప‌టికి తోడుగా ఉంటాన‌ని అంటాడు. వారిద్ద‌రి మాట‌ల్ని, అనుబంధాన్ని చాటు నుంచి చూసి కావ్య క‌న్నీళ్లు పెట్టుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X