Brahmamudi January 3rd: కొత్త కోడలి ముందే కావ్యకు అవమానం.. క్లాస్ ఇచ్చిన ఇందిరాదేవి!

ఈరోజు బ్రహ్ముముడి సీరియల్లో కల్యాణ్, అనామిక కార్యం గురించి అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. అనామిక పేరెంట్స్.. కార్యాన్ని మా ఇంట్లో జరిపిస్తామని చెప్తారు. వద్దు మా సంప్రాదాయం ప్రకారం ఇక్కడే జరిపిస్తామని అపర్ణ అంటుంది. అనామిక పేరెంట్స్ కాస్త డల్ అవుతారు. ఇక ఆ తర్వాత ఇందిరాదేవి మాట్లాడుతూ... అప్పట్లో అమ్మాయికి కొత్త కాబట్టి.. అమ్మవారింట్లో జరిపించేవారు... ఇప్పుడు కాలం మారింది.. అనామికకు అందరూ తెలిసినవారమే.. ఇక్కడే సత్యనారాయణ వ్రతం జరిపించాక కార్యం జరిపిస్తాని చెప్తుంది. ఇక అనామిక పేరెంట్స్ ఓకే అని చెప్తారు.

అనామికను కల్యాణ్ కు అప్పగించి బయలుదేరుతారు. వెళ్తూ వెళ్తూ రాజ్ కు ప్రత్యేక థ్యాంక్స్ చెప్తారు. ఇక అప్పు రావాల్సిన స్థానంలో అనామిక రావడం వల్ల... కావ్య ఏమైనా చేస్తుందా అని భయపడుతారు. దానికి రాజ్... మా కళవతి వల్ల ఏ ఇబ్బంది రాదు నేను మాటిస్తున్నాను అని అంటాడు. ఇక రాజ్ మాటతో భరోసాగా బయలుదేరుతారు. మరోవైపు కనకం ఇంట్లో మూర్తి, అన్నపూర్ణమ్మ.. కల్యాణ్ పెళ్లిలో జరిగిన గొడవలు తలుచుకుంటూ బాధపడుతారు.

January 3rd 2024 Episode number 295 in Brahmamudi Telugu Serial

ఇంతలో అప్పు బయటకు వచ్చి తన సైకిల్ కీస్ ఎక్కడ ఉన్నాయని అడుగుతుంది. ఎందుకు అని అడుగుతారు. చికెన్ తెచ్చుకోవాలి షాపుకు వెళ్తాను అని చెప్తుంది. చికెన్ తెచ్చుకోవాలి... చికెన్ తినాలనిపిస్తుందని చెప్తుంది. ఇక అప్పు ప్రవర్తన చూసి అందరూ షాక్ అవుతారు. ఆ బాధను మొహంలో కనబడనివ్వడం లేదేంటి... పైగా చికెన్ తింటా అంటుందేంటి అని మూర్తి అంటాడు. మరోవైపు కావ్య.. అనామిక అన్న మాటలు గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటుంది.

రాజ్ వచ్చి ఏంటి అని అడుగుతాడు. ఇంట్లో జరిగిన గొడవే కారణమా అని అడుగుతాడు. ఇక తనపై పడిన నింద గురించి బాధపడుతున్నట్లు రాజ్ కు చెప్తుంది. అప్పు ప్రేమ విషయం.. కల్యాణ్ పెళ్లికి ముందు తెలిసిందని చెప్తుంది. ఇక అనామిక తనను శత్రువుగా భావిస్తుందని చెప్తుంది. మీరు పొద్దున వెళ్లి రాత్రికి వస్తారు. మేం ఆడవాళ్లం కలిసే ఉండాలి. నేను ప్రతి రోజు యుద్ధమే చేయాలి.. నా సహనంతో, నా ఓర్పుతో.. అని కావ్య చెప్పి వెళ్లిపోతుంది.

ఈ కళావతి నా పెళ్లిలో తప్పు చేసింది కానీ.. కల్యాణ్ పెళ్లిలో చేయలేదు.. ఈ విషయం ఇంట్లో వాళ్లకు ఎప్పుడు అర్థం అవుతుందో అని రాజ్ అనుకుంటాడు. ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనాలు చేస్తూ ఉంటారు. కావ్య వడ్డిస్తూ ఉంటుంది. అపర్ణ చిరాకు పడి తన అన్నం తానే వడ్డించుకుంటూ ఉంటుంది. ధాన్య లక్ష్మి కూడా కావ్యపై ఫైర్ అవుతుంది. కొత్త కోడలు రాగానే పాత కోడలను పక్కన పడేశావ్.. ఇన్నాాళ్లు కావ్యను ఎవరైనా ఏమైనా అంటే సర్రును వచ్చేదానివి కదా అని రుద్రాణి అంటుంది. నాకు లేటుగా అర్థం అయిందని ధాన్య లక్ష్మి అంటుంది.

ఇక భార్యను నానా మాటలు అంటున్నాడు అని గ్రహించిన రాజ్... కావ్యను పిలిచి కర్రీ వేయించుకుంటాడు. కర్రీ సూపర్ గా ఉందని చెప్తాడు. ఇక కల్యాణ్ కూడా వేయించుకుని తింటాడు. ఇక అనామికను వేసుకొమ్మని తినమంటే.. నాకు ఈ కర్రీ నచ్చదు అని చెప్తుంది. ధాన్యలక్ష్మి, రుద్రాణి, అపర్ణ.. కావ్యపై చిరాకు పడటంతో ఇందిరాదేవి.. క్లాస్ ఇస్తుంది. కొత్త కోడలు ముందు ఎందుకు ఇవన్నీ అని అంటుంది. కొత్త కోడలకు అత్త మామలతో, భర్తతో ఎలా ఉండాలో నేర్పాలి అని చెప్తుంది. కావ్యను ఇందిరాదేవి మెచ్చుకుంటుంది. కమ్మగా వండిపెట్టి.. అందరి కడుపు నింపావు అమ్మ.. నీ చేతిలో అమృతం ఉందమ్మా అని చెప్తుంది. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

ఇక తదుపరి ఎపిసోడ్ లో కొత్త కోడలు అనామిక ఇంట్లో వారందరి కోసం... కాఫీ పెడుతుంది. ఇక రాజ్ మాట్లాడుతూ.. ఇన్ని రోజులు కావ్య చేతి కాఫీ తాగి బోర్ కొట్టింది.. అనామిక కాఫి తాగుదాం అని చెప్తాడు. తాగండి తాగండి.. నా చేతి కాఫీ వాల్యూ తెలుస్తుంది అని కావ్య మనుసులో అనుకుంటుంది. ఇక అందరికి అనామిక కాఫీ ఇస్తుంది. అందరూ తాగుతారు. ఇక ఆ కాఫీ బాలేదని వారి మొహంలో కనిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తదుపరి ఎపిసోడ్ లో చూసి తెలుసుకోవాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X