Brahmamudi January 4th బయటపడ్డ రాజ్ బండారం.. మరో అమ్మాయితో కావ్యకు అడ్డంగా దొరికిపోయాడుగా!
బ్రహ్మముడి ఎపిసోడ్ లో కావ్య అందరికీ పాయసం తీసుకువస్తుంది. అయితే ఆ పాయసాన్ని మాత్రం ధాన్యలక్ష్మి, రుద్రాణి తీసుకోరు. ధాన్యలక్ష్మిపై ప్రకాశం సెటైర్స్ వేస్తాడు. ధాన్యలక్ష్మిపై ఇందిరాదేవి కూడా ఫైర్ అవుతుంది. ఇక మీ అందరూ నా మీద యుద్ధం ప్రకటిస్తున్నారా.. మీ మనవరాలు వాళ్ల కుటుంబం ఏం చేసిందో మర్చిపోయారా అంటూ ధాన్యలక్ష్మి అంటుంది. ఇక స్వప్న ఎంటర్ అయి.. ఇప్పటి దాకా మా అత్త చాలించింది.. ఇప్పుడు మీరు మొదలు పెట్టారు అంటూ కావ్యకు సపోర్టుగా మాట్లాడుతుంది.
ఇదంతా దూరంగా ఉన్న రాజ్ గమనిస్తూ ఉంటాడు. అనామికను స్వీట్ తినమని కల్యాణ్ చెప్తాడు. ఇది కూడా ఓ పాయసమేనా అంత ఇష్టంగా తింటున్నారు నాకు నచ్చలేదని అనామిక చెప్తుంది. ఇక రాజ్ పాయసం తిని.. ఇది స్వీటా.. దీనికి ఇంకో పేరు ఉండాలి గుర్తుకు రావడం లేదు అంటాడు. రేయ్ కవి నువ్వు చెప్పురా.. అనగానే అమృతం అన్నయ్య అని కల్యాణ్ అంటాడు. ఆ.. యస్.. అమృతంలా ఉందని రాజ్ లొట్టలేసుకుని మరీ తింటాడు.

కళావతి అద్భుతంగా ఉందని తింటాడు రాజ్. ఇక రాజ్.. అపర్ణ దగ్గరకు వెళ్లి సూపర్ గా ఉంది.. తీసుకోకపోతే నువ్వు మిస్ అయిపోతావ్ అంటూ చెప్తాడు. ఇక అపర్ణ స్వీట్ తీసుకుంటుంది. ఇక ధాన్యలక్ష్మి దగ్గరకు వెళ్లి సంస్కారం నేర్పిందే మీరు.. అలాంటిది.. అని చెప్తుండగా.. ధాన్యలక్ష్మి కూడా తీసుకుంటుంది. ఇక ఇంట్లోని వారంతా ఆ స్వీట్ తీసుకుని తింటుంటారు. ఇక ఉమ్మడి కుటుంబం గురించి రాజ్ గొప్పగా చెప్పుకువస్తాడు. ఇక ఇందిరాదేవి నా వారాసుడు అంటే నువ్వే రా అంటుంది.
ఇక అందరం పడుకుందామని తినండి అని మాట్లాడుకుంటారు. ఇక కల్యాణ్, అనామికకు ఇంకా శోభనం జరగలేదు.. కాబట్టి వేరు వేరుగా పడుకోవాలని ఇందిరాదేవి అంటుంది. ఎవరి గదుల్లో పడుకోవాలని చర్చించుకుంటూ.. అందరం కలిసి హల్లోనే పడుకుందామని ప్రకాశం సలహా ఇస్తాడు. ఇక ఇది బాగుందని ఇందిరాదేవి కూడా అంటుంది. ఇక భర్తలు పరుపులు మోసుకువస్తే.. భార్యలు దిండు దుప్పటి మోసుకువస్తారు అని అపర్ణ అంటుంది.
మరోవైపు అప్పు చికెన్ వండుతుంది. ఇంట్లోని వారంతా షాక్ అవుతారు. ఏంటే ఇది.. మతిస్థిమితం తప్పలేదు కదా.. అని అన్నపూర్ణమ్మ అంటుంది. దానికి తప్పలేదు.. నాకు తప్పేలా ఉందని కనకం అంటుంది. ఏడుస్తూ కూర్చుంటుందని అనుకుంటే.. ఇలా వంట చేస్తూ షాకి ఇచ్చిందని చెప్తుంది. ఈలోపు చికెన్ వండి.. రండి తిందాం అని చెప్తుంది. ఇక అందరికీ వండిస్తుంది. టేస్ట్ చూసిన మంచిగానే ఉంది అని అప్పు చెప్తుంది. ఇక అప్పు ముద్ద కలిపి తిందాం అనుకునే లోపే.. కల్యాణ్ జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. ఇక అప్పు కంటి నుంచి కన్నీళ్లు వస్తాయి. తినకుండా పళ్లెంలోనే చేతులు కడిగి వెళ్లిపోతుంది. కనకం, అన్నపూర్ణమ్మ, మూర్తి బాధపడుతారు.
ఇక దుగ్గిరాల ఇంట్లో అందరూ పరుపులు వేసుకుని పడుకుంటారు. గుడ్ నైట్ అని చెప్తే.. కల్యాణ్ ఏదైనా గేమ్ ఆడుదామని అంటాడు. ఇక ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుదామని కల్యాణ్ అంటాడు. ఈ ఆట చాలా బాగుంది ఆడుదామని కావ్య, స్వప్న అంటారు. ఇక అందరూ కలిసి ఆడుదామని ఫిక్స్ అవుతారు. ఇక బాటిల్ తీసుకువచ్చి తిప్పుతారు. అది ఇందిరాదేవి దగ్గరకు వచ్చి ఆగుతుంది. ఇక ఆమెను సీతారామయ్య ప్రశ్న వేస్తాడు.

నీ జీవితంలో ఎప్పుడైనా భయపడావా అంటే.. ఇందిరాదేవి సమాధానం చెప్తుంది. తనకు ఇద్దరు బావలు ఉండే వారని.. పెద్ద బావకు ఇవ్వకుండా చిన్నబావకు ఇచ్చి చేస్తారని భయపడ్డాను అని చెప్తుంది. చివరకు నాకు ఇష్టమైన బావకు ఇచ్చి చేశారని అంటుంది. ఇక దీనికి ఇంట్లోని వారంతా నవ్వుతారు. ఇక నెక్ట్స్ అనామిక దగ్గర బాటిల్ ఆగుతుంది. ధాన్యలక్ష్మి ప్రశ్న అడుగుతుంది. మా అబ్బాయిని ఆస్తి ఉందని ప్రేమించావా.. అందం ఉందని ప్రేమించావా అని అడుగుతుంది.
దానికి అనామిక... నేను కల్యాణ్ కవితలను చూసి ప్రేమించాను అని చెప్తుంది. ఇక నెక్ట్స గేమ్ లో రాజ్ దగ్గరకు వచ్చి ఆగుతుంది. ట్రూత్ అంటే.. ఏం అడుగుతారో నని డేర్ అని చెప్తాడు. అప్పుడు కల్యాణ్ మాట్లాడుతూ... వదినకు ప్రపోజ్ చేసి... నుదిట మీద ముద్దు పెట్టాలి అని చెప్తాడు. దీనికి అపర్ణ అడ్డుపడుతుంది. కావాలంటే నువ్వు కళ్లు మూసుకో పెద్దమ్మ అని కల్యాణ్ అంటాడు. ఇక రాజ్ కు పువ్వు ఇచ్చి.. ప్రపోజ్ చేయమని చెప్తాడు. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.
ఇక తదుపరి ఎపిసోడ్ లో రాజ్ మీటింగ్ ఉందని చెప్పి బయటకు వెళ్తాడు. ఇక కావ్య ఆటోలో బయటకు వెళ్లగా అక్కడ రాజ్ ఓ అమ్మాయితో కనిపిస్తాడు. రాజ్ ఆ అమ్మాయి శ్వేతతో క్లోజ్ గా ఉంటాడు. ఇది చూసిన కావ్య షాక్ అవుతుంది. వెంటనే రాజ్ కు కాల్ చేస్తుంది. ఎక్కడ ఉన్నారు అని అడిగితే ఆఫీసులో ఉన్నాను అని అబధ్దం చెప్తాడు. మరి ట్రాఫిక్ సౌండ్స్ వస్తున్నాయని అడుగుతుంది. దానికి విండో తెరిచి మాట్లాడుతున్న అని చెప్తాడు. అబద్ధం చెప్తున్నాడు అనుకుని కావ్యకు తెలిసిపోతుంది. ఇక తదుపరి ఎపిసోడ్ లో ఏం జరగనుందో చూడాలి.


Click it and Unblock the Notifications










