Brahmamudi January 5th అర్దరాత్రి అడ్డంగా బుక్కైన కల్యాణ్ అనామిక... భార్యకు దొరికిపోయిన రాజ్!

నేటి బ్రహ్మముడి (జనవరి 5వ తేదీ) సీరియల్లో ఇంట్లోని వారంతా ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతారు. ఇక రాజ్ వంతు వచ్చే సరికి డేర్ అంటాడు. వదినకు ప్రపోజ్ చేయాలని కల్యాణ్ చెప్తాడు. ఇక రాజ్ పువ్వు తీసుకువచ్చి మరీ కావ్యకు ఐ లవ్ యూ అని చెప్తాడు. అంతే కాదు నుదుటి మీద ముద్దు కూడా పెడతాడు. ఇదంతా చూసి అపర్ణ తల పట్టుకుంటుంది. ఇక ఆ తర్వాత అందరూ పడుకుంటారు. అందరూ పడుకున్నాక కల్యాణ్ లేచి.. అనామికను లేపి పక్కకు తీసుకువెళ్తాడు.

ఇక డోర్ తీసి బయటకు వెళ్తారు. ఇక ఇంట్లోని వారంతా లేచి.. బయటకు వచ్చి అనామిక కల్యాణ్ మాటలు వింటూ ఉంటారు. ఇక కల్యాణ్ అనామిక మాట్లాడుకుంటుంటే.. వీళ్లు చాటుగా వింటుంటారు. కల్యాణ్.. రుద్రాణి మీద సెటైర్స్ వేస్తూ ఉంటాడు. ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందోనని ఇంట్లోని వారంతా అనుకుంటూ ఉంటారు. కల్యాణ్ అనామికను ముద్దు కావాలి అని అడుగుతాడు. మొహమాటం పడుతూ.. అనామిక ఓకే చెప్తుంది.

January 5th 2024 Episode number 297 in Brahmamudi Telugu Serial

ఇక అనామికకు ముద్దు పెట్టబోతుంటే.. త్వరగా కానివ్వురా అని రుద్రాణి అరుస్తుంది. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యి.. దుప్పటి తీసి చూస్తారు. ఇక అనామిక, కల్యాణ్ చూసే సరికి.. అందరు కనిపిస్తారు. ఇక రాజ్, అపర్ణ కల్యాణ్ ను ఆటపట్టిస్తారు. ఇక వీరు ఆగేట్టు లేరు.. త్వరగా శోభనం ముహూర్తం పెట్టాలని అనుకుంటారు. ఇక తర్వాతి ఉదయం కావ్య కిచెన్ లో ఉంటే.. అనామి వచ్చి కాఫీ పెడతాను అంటుంది.

ఇక నేను ఉన్నానుగా అని కావ్య అంటే.. యే నేను పెట్టకూడదా అని అనామిక కావ్యతో గొడవ పెట్టుకుంటుంది. ఇది చూసిన ధాన్యలక్ష్మి, అపర్ణ వచ్చి కొత్త కోడలికి సపోర్టుగా మాట్లాడుతారు. ఎవరికి భయపడకు అంటూ అనామికకు ధైర్యం చెప్తారు. ఇక కావ్యపై రుద్రాణి వ్యంగ్యంగా మాట్లాడితే.. ఆమెకు కౌంటర్ ఇచ్చింది కావ్య. ఇక కాఫీ పెడతాను అని అనామిక.. పాలలో టీ పౌడర్ కలిపి అదే కాఫీ అనుకుంటుంది. ఇక అందరికీ అదే తీసుకుపోతుంది.

January 5th 2024 Episode number 297 in Brahmamudi Telugu Serial

ఇక అందరికీ కాఫీ రెడీ అంటూ అనామిక టీ లాంటి కాఫీని పట్టుకువస్తుంది. ఈ కళావతి చేతి కాఫీ తాగి తాగి బోర్ కొట్టింది... అనామిక చేతి కాఫీ తాగుతాను అని రాజ్ అంటాడు. ఇక తాగండి తాగండి.. నా చేతి కాఫీ వాల్యూ తెలుస్తుంది అని కావ్య మనసులో అనుకుంటుంది. ఇక అనామిక ఫస్ట్ టైం కాఫీపెట్టాను అందరూ ఒకేసారి తాగండి అని చెప్తుంది. ఓకే అనామిక అని ఇందిరాదేవి చెప్తుంది. ఇక అందరూ కాఫీ తీసుకుని ఒకేసారి తాగుతారు.

ఇక ఆ కాఫీని తాగి అందరూ చిత్రవిచిత్రంగా ఫేసులు పెడుతారు. ఇక కావ్య రాజ్ దగ్గరకువచ్చి.. ఎలా ఉంది కాఫీ లాంటి టీ అని అడుగుతుంది. నా కాఫీ తాగి బోర్ కొట్టింది కదా తాగండి అని చెప్తుంది. ఎలా ఉంది అని అనామిక అడుగుతుంది. అఁదరూ బాగుంది బాగుందని చెప్తారు. ఇక ఇంతలోనే కల్యాణ్ వస్తాడు. అందరికీ ఇచ్చి నాకు ఇవ్వలేదు అని అడుగుతాడు. తీసుకుని తాగండి అని చెప్తుంది. ఇక కల్యాణ్ అది తాగి.. ఇది కాఫీయేనా అని అడుగుతాడు.

అవును అని అనామిక చెప్తుంది. దీని కంటే కాషాయం బాగుంటుందని చెప్తాడు కల్యాణ్. అందరూ బాగుందని చెప్పారని అనామిక అంటుంది. నువ్వు ఫీల్ అవుతావని అలా చెప్పి ఉంటారు అని కల్యాణ్ అంటాడు. లేదండి నేను బానే పెట్టాను అని కల్యాణ్ తాగిన కాఫీని తీసుకుని తాగుతుంది. ఏంటి ఇలా ఉఁంది అని అనామిక అనుకుంటుంది. అర్థమైందా అని కల్యాణ్ అంటాడు. అర్థం అయింది అని అనామిక అంటుంది. ఇంకేప్పుడు కిచెన్ లో అడుగుపెట్టకు అని కల్యాణ్ చెప్తాడు.

January 5th 2024 Episode number 297 in Brahmamudi Telugu Serial

ఇక సీతారామయ్య.. కావ్యను కాఫీ పెట్టుకురమ్మంటాడు. అనామిక ఫీల్ అవుతుంటే.. నువ్వేం ఫీల్ అవ్వకు అని రుద్రాణి అంటుంది. కావ్య, స్వప్నలు అంటే చిన్నప్పటి నుంచి పని వాళ్లలా పెరిగారు. నువ్వంటే మహారాణిలా పెరిగావు అని చెప్తుంది. అప్పుడే స్వప్న.. డబ్బులు లేకపోయినా నేను కూడా మహారాణిలా పెరిగాను అత్తయ్య అని స్వప్న అంటుంది.

ఒక్క మాట అనగానే కోపం వచ్చిందా అని రుద్రాణి అంటుంది. అందరి ముందు కోడల్ని తక్కువ చేయకూడదు అని మీకు తెలిసి ఉంటే నాకు ఎందుకు కోపం వస్తుంది అని స్వప్న అంటుంది. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. తదుపరి ఎపిసోడ్ లో కావ్య ఆటోలో వెళ్తుంటే... కావ్య శ్వేతతో కనిపిస్తాడు. కావ్య ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావ్ అని అడిగితే ఆఫీసులో ఉన్నాను పెట్టేయ్ అంటాడు. ఇక కావ్యకు రాజ్ మీద డౌట్ వస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X