Brahmamudi రాజ్, శ్వేత బాగోతాన్ని చూసిన కావ్య... కుటుంబాన్ని ముక్కలు చేసేందుకు అనామిక ప్లాన్

బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకు ఆసక్తి పెంచుతూ.. ట్విస్టులు సాగుతున్నాయి. ఇక ఈ వారంలో అనామిక, కల్యాణ్ పెళ్లి అవుతుంది. తాజా ఎపిసోడ్ లో స్వప్న తన అత్త రుద్రాణి సేవలు చేయాలని డిమాండ్ చేస్తుంది. ఇంట్లో వాళ్లంతా ఒప్పుకుంటారు. ఇక రుద్రాణి తనకు సేవలు చేయకపోతే.. నెత్తిన కుర్చీ వేసుకుని కూర్చుంటా అని స్వప్న చెప్తుంది. ఇక అత్తతో సేవలు చేయించుకుంటూ ఉంటుంది. మరోవైపు రాజ్, శ్వేత విడాకుల కోసం లాయర్ ను కలుస్తారు. ఎలాగైన విడాకులు ఇప్పించాలని అడుగుతారు.

దానికి లాయర్.. ఇలాంటి కేసుల్లో మొదట ఒప్పుకున్న తర్వాత వెనక్కి వెళ్తారు అని లాయర్ అంటాడు. అయితే దానికి రాజ్... మా ఇద్దరికి ఇష్టమే.. వెనక్కి తగ్గే ఉద్దేశం లేదని చెప్తాడు. ఒక్కసారి ఆలోచించు మనం ఏం తప్పు చేయడం లేదు కదా అని శ్వేత అడుగుతుంది. ఇదే పరిష్కరం తప్పదు అని రాజ్ అంటాడు. మరోవైపు కావ్య ఆ అమ్మాయి ఎవరు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆఫీసుకు వచ్చిన కావ్య.. రాజ్ శ్వేత మాట్లాడుకోవడం చూస్తుంది.

January 7th 2024 Episode number 299 in Brahmamudi Telugu Serial

ఇక శ్వేతతో క్లోజ్ గా మాట్లాడుతూ రాజ్ వెళ్తాడు. దాన్ని కావ్య చూస్తుంది. ఇక ఆ తర్వాత కావ్యను చూసి రాజ్ షాక్ అవుతాడు. ఎందుకు వచ్చావ్ అని అడుగుతాడు. టిఫిన్ తీసుకువచ్చాను అని చెప్తుంది. ఒక్కరోజు తినకపోతే ఏం అవుద్ది.. బయట తినేవాడిని కదా అని చెప్తాడు రాజ్. మీకు బయట తిండి పడదు అనుకున్నాను.. ఇప్పుడు అలవాటు పడ్డారని తెలియదు అంటూ కావ్య చెప్తుంది. ఇక రాజ్ కూడా షాక్ అవుతాడు. ఆ తర్వాత కావ్య వెళ్లిపోతుంది.

మరోవైపు అప్పు దీనంగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. ఇంతలో కల్యాణ్ కాల్ చేస్తాడు. ధాన్య లక్ష్మి మాటలు గురుకువచ్చి... ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇక కల్యాణ్ కాల్ చేయడం చూసి.. డౌటుగా అనామిక అడుగుతుంది. మన బ్రోకే కాల్ చేశాను అని అంటాడు కల్యాణ్. ఇక అనామిక.. కల్యాణ్ కు క్లాస్ ఇస్తుంది. ఇప్పుడు నా భర్తవి... ఏ వైఫ్ అయినా నా భర్త తనకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటుంది.. అని చెప్తుంది. నేను నిన్ను అనుమానించడం లేదు.. ఆ అప్పు మీద నమ్మకం లేదని చెప్పి వెళ్తుంది అనామిక.

మరోవైపు అప్పు ధీనంగా నడుచుకుంటూ వెళ్తూ.. కావ్య వస్తున్న ఆటోకు ఎదురుగా వస్తుంది. ఆ ఆటో వాడు అప్పును తిడతాడు. ఇక కావ్య చూసి.. అప్పును ఇంటికి తీసుకుపోతుంది. అప్పు ఇలా ఉండటం ఏం బాలేదని చెప్తుంది. ఈ బాధ ఇప్పట్లో పోదు కానీ.. టైం పడుతుందని కావ్య అంటుంది. నాకేం బాధ లేదు.. అని అప్పు చెప్తుంది. కనకం, అన్నపూర్ణ, కావ్య... అప్పును ఓదార్చుతారు. కనకం ఎమోషనల్ అవుతుంది. ఇక కావ్య తనకు ఆకలి వేస్తుంది అనగానే.. అన్నం తీసుకువస్తా అని కనకం వెళ్తుంది.

స్వప్న.. రుద్రాణితో ఓ గేమ్ ఆడుకుంటూ ఉంటుంది. అత్తా అని పిలిచి... తన గదికి రప్పించుకుంటుంది. ఎందుకు ఇంత లేట్ అయిందని అడుగుతుంది స్వప్న. ఇప్పుడే కదా పిలిచావ్ వస్తునే ఉన్నాను అని చెప్తుంది రుద్రాణి. సరే కానీ నాకు జ్యూస్ కావాలి అని అడుగుతుంది. పక్కనే ఉంది కదా అని రుద్రాణి అంటుంది. ఎవరు ఇస్తారు మీ తాతనా అని స్వప్న ఎదురుచెప్తుంది. ఇక రుద్రాణి ఆ గ్లాస్ తీసి.. స్వప్నకు ఇస్తుంది. ఆ తర్వాత స్వప్న తాగే వరకు ఉండి గ్లాస్ తీసుకుపోతుంటే... మళ్లీ అత్తా అని స్వప్న పిలుస్తుంది.

ఏసీ ఆన్ చేయమని చెప్తుంది. ఆన్ చేసి వెళ్తుంది రుద్రాణి. మళ్లీ అత్తా అని పిలుస్తుంది స్వప్న. అప్పుడే రాహుల్ ఎదురు వస్తాడు. నీ పెళ్లాం పిలుస్తుంది వెళ్లు అని చెప్తుంది. దానికి రాహుల్ ఫోన్ రాకపోయినా... ఫోన్ వచ్చినట్లు యాక్ట్ చేసి... హాలో ఫైర్ స్టేషన్ ఇక్కడ కాలిపోతుంది.. అంటూ మాట్లాడుతాడు. రుద్రాణి స్వప్నను బయటకు పంపేందుకు ఇంకో ప్లాన్ వేయాలి అనుకుంటుంది. వద్దు తల్లి అని రాహుల్ చెప్తాడు.

మరోవైపు కావ్యకు కనకం అన్నం తినిపిస్తూ ఉంటుంది. మూర్తి చూసి ఎందుకు వచ్చావ్ అని అడుగుతాడు. అందరూ షాక్ అవుతారు. ఇక్కడికి ఎపిసోడ్ అయిపోతుంది. తదుపరి ఎపిసోడ్ లో కావ్య తన ఇంటికి వెళ్తుంది. అక్కడ అత్త అపర్ణ.. ఎందుకు లేట్ అయిందని అడుగుతుంది. దానికి అప్పు కనిపిస్తే పుట్టింటికి వెళ్ళాను అని చెప్తుంది. ఇక దానికి ధాన్యలక్ష్మి, అపర్ణ సిరీయస్ అవుతారు. దానికి కావ్య సమాధానం చెప్తుంది. దీంతో అనామిక కూడా పెద్దవాళ్లను ఎదిరించి మాట్లాడుతారా అంటూ డ్రామా స్టార్ట్ చేస్తుంది. ఇక ఆమె మాటలకు అపర్ణ నీకు ఉన్న బుద్ది ఆమెకు లేదు అని చెప్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X