Brahmamudi January 9th కల్యాణ్ లుక్ మార్చేసిన అనామిక... అప్పుకు పెళ్లి చేయాలని నిర్ణయం!

నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ లో కావ్య.. రాజ్ గురించి ఆలోచిస్తూ కూర్చొంటుంది. ఈలోపు రాజ్ వస్తాడు. ఇక కోపంగా టిఫిన్ తెచ్చిన క్యారెజ్ ఏది అని అడుగుతుంది. మర్చిపోయాను అని రాజ్ అంటాడు. కాసేపు టామ్ అండ్ జెర్రీలా మాట్లాడుకుంటారు. కాఫీ తాగుతారా.. లేదా బయట తాగారా అని అడుగుతాడు. ఏమైందే నీకు అని రాజ్ అడుగుతాడు. జ్ఞానదంతం వచ్చిందని చెప్పి కావ్య వెళ్లపోతుంది. జ్ఞానవంతం రావడానికి, ఇది సీరియస్ గా ఉండటానికి లింకేంటి అని ఆలోచిస్తూ ఉండగా.. మళ్లీ కావ్య వచ్చి సీరియస్ గా చూస్తుంది. ఆ తర్వాత టవల్ ఇచ్చి వెళ్లిపోతుంది కావ్య.

ఇక మరోవైపు కల్యాణ్ రెడీ అవుతూ ఉంటాడు. ఎలాఉందని అనామికను అడుగుతాడు. నువ్వైమైన అంకుల్ వా... ఎప్పుడూ చూసిన పేల్ కలర్ డ్రెస్సులు వేసుకుంటావ్ అని అడుగుతుంది. అప్పుకు ఇలాగే ఉంటే నచ్చుతుందని అంటాడు. ఇక సీరియస్ గా అనామిక వెళ్లిపోతుంటే.. అనామిక చేయిని పట్టుకుని ఆపుతాడు కల్యాణ్. ఇక కాసేపు వారి మధ్య ప్రేమ మాటలు మొదలు అవుతాయి. తనకు నచ్చినట్లు నడుచుకుంటాను అని కల్యాణ్ చెప్తాడు.

January 9th 2024 Episode number 301 in Brahmamudi Telugu Serial

ప్రామిస్ వేయమని అడుగుతుంది. దానికి కల్యాణ్ ముద్దు పెట్టడానికి వస్తాడు. బయటవాళ్లైతే చేతిలో చేయి వేసి ముద్దు పెట్టాలి.. అదే లవర్ అయితే ఇలాగే ప్రామిస్ చేయాలి అని కల్యాణ్ అంటాడు. నేను నీ భార్యను అని చెప్తుంది. ఏ డ్రెస్సు వేసుకోవాలి అని అడిగితే ఈరోజు నేనే నిన్ను రెడి చేస్తాను అని చెప్తుంది. మరోవైపు రాజ్ కూర్చొని ఉంటే.. కావ్య కాఫీ తీసుకుని వచ్చి ఇస్తుంది. మళ్లీ టామ్ అండ్ జెర్రీలా పోట్లాడుకుంటారు.

మరోవైపు కల్యాణ్ ను అనామిక రెడీ చేస్తుంది. చినిగిపోయిన ప్యాంట్ వేసి.. హెయిర్ స్టైల్ మార్చి.. చెవికి రింగ్ పెట్టి... మార్చుతుంది. ఇక కల్యాణ్ అద్దంలో చూసుకుని ఇలా ఉన్నాను అని ఆశ్చర్యపోతాడు. ఇదే మోడ్రన్ అని చెప్తుంది అనామిక. ఇక వైరల్ అయ్యేలానే ఉన్నాను అని కల్యాణ్ అంటాడు. ఎలా నడవాలో చెప్తుంది. హీరోలా ఉన్నావ్ అని అంటుంది. ఇంట్లో వాళ్లు చెప్పాలి అని కల్యాణ్ అంటాడు. ఇక ఫైనల్ టచ్ అప్ ఇస్తే వాళ్లే అంటారు అని అనామిక అంటుంది.

మరోవైపు అప్పు బ్యాగ్ సర్దతూ ఉంటుంది. కనకం, అన్నపూర్ణమ్మ, మూర్తి వచ్చి ఎక్కడికి అని అడుగుతారు. పిజ్జా డెలవరికి అని చెప్తుంది. చదువు కూడా మానను అని చెప్పి వెళ్తుంది. ఇక పాత అప్పులానే ఉంటాను చెప్తుంది. ఇక అప్పుకు పెళ్లి చేయాలని అనుకుంటారు. ఇంకా గాయం మానలేదు.. ఇప్పుడే వద్దు అని మూర్తి అంటాడు. మరోవైపు ఇంట్లో వాళ్లకు అన్నం వడ్డిస్తూ ఉంటుంది కావ్య. వెరైటీలు ఏమి లేవా అని రాజ్ అంటాడు. బయటవాళ్లను పిలిపించి వడ్డించమని చెప్పాలా.. వెరైటీగా ఉంటుందని కావ్య అంటుంది.

January 9th 2024 Episode number 301 in Brahmamudi Telugu Serial

ఇక ఇంట్లోని వారంతా షాక్ అవుతారు. రాజ్ బయట ఫుడ్ తినడు అని అపర్ణ చెప్తుంది. కరెక్టుగా చెప్పారు అత్తయ్య అని కావ్య అంటుంది. ఇక రాజ్.. దీనికి ఏమైందని ఆలోచిస్తూ ఉంటాడు. ప్రకాశం ఏదో అర్ధం లేని మాటలు చెప్తాడు. మరోవైపు అనామిక, కల్యాణ్ తినడానికి వస్తారు. వాళ్లను చూసి ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. కొడుకు గెటప్ మారిపోయిందని ప్రకాశం అంటాడు. వచ్చి కూర్చొ అని ప్రకాశం చెప్తాడు. డ్రెస్ అదిరిపోయిందని రాజ్ అంటాడు.

ఎలా ఉందని కల్యాణ్ అనగా.. అందరూ కొత్త గెటప్ బాగుందని చెప్తారు. పెళ్లాం రాగానే లుక్ మార్చేసింది.. ముందు ముందు ఏం మార్చుతుందో అని రుద్రాణి అంటుంది. భార్య కోసం లుక్ మారితే పర్వాలేదు.. క్యారెక్టర్ మారితేనే ప్రాబ్లం అని కావ్య అంటుంది. దీనికి రాజ్ కూడా కరెక్టే అని అంటాడు. ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్యలా ఉంటేనే ప్రాబ్లమ్ అని కావ్య అంటుంది. ఇక కల్యాణ్ గురించి గొప్పగా చెప్తుంటే.. ధాన్యలక్ష్మి కావ్య మీదకు రివర్స్ అవుతుంది. దానికి అపర్ణ కూడా సపోర్ట్ ఇస్తుంది. ఇక సుభాష్ అడ్డుకుని తినమని చెప్తాడు.

మరోవైపు గదిలో రాజ్.. కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అని ఆలోచిస్తూ ఉండగా.. కావ్య వస్తుంది. ఇక కావ్యను నిలదీస్తాడు. ఏమైంది ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నవ్ అని అడుగుతాడు. నేను చేసిన తప్పేంటి అని రాజ్ నిలదీస్తాడు. క్లారీటి వచ్చాక అడుగుతాను.. అప్పటి వరకు ప్రశాంతంగా పడుకోండని చెప్పి కావ్య పడుకుంటుంది. ఇక ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. తదుపరి ఎపిసోడ్ లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటుంటే.. దీపపు కుందెను రుద్రాణి పడేసి.. కావ్యపై వేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X