ప్రియుడి చిత్రహింసలు... బెడ్ నిండా రక్తం, గాయాలతో నటి షాకింగ్ పోస్ట్.. కాపాడాలంటూ

మనకు వినోదాన్ని పంచే నటీనటుల వ్యక్తిగత జీవితాలు తెరపై కనిపించేలా అద్భుతంగా, అందంగా ఉండవు. వారు కూడా మనలాంటి మామూలు మనుషులే. కష్టాలు, కన్నీళ్లు, విషాదాలు వాళ్లకు కూడా ఉంటాయి. కానీ వాటన్నింటిని పంటి బిగువ భరిస్తూ.. కెమెరా ముందుకు రాగానే నవ్వుతూ, నవ్విస్తూ, ఏడిపిస్తుంటారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఒక్కొక్కరిది ఒక్కో ఆవేదన. తాజాగా తన ప్రియుడి చేతుల్లో చిత్రహింసలు, తాను అనుభవిస్తున్న బాధను పంచుకుంది ఓ నటి.

మలయాళ బుల్లితెర ఇండస్ట్రీలో స్టార్‌గా వెలుగొందుతున్నారు జసీలా పర్వీణ్. అందం, అభినయంలో తిరుగులేదని నిరూపించుకున్నారు ఈ ముద్దుగుమ్మ. థీనమ్ వయంబుం సీరియల్‌తో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైన జసీలా.. ఆ తర్వాత సీత, ఆలియంబుల్ ధారావాహికలతో తన స్థానాన్ని ఆమె సుస్థిరం చేసుకున్నారు. ఇక స్టార్ మేజిక్ అనే టీవీ షోలోనూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. 2024లో మోహన్‌లాల్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్‌బాస్ మలయాళం 6లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు జసీలా. ఈ షోతో ఆమె మరింత పాపులర్ అయ్యారు. బుల్లితెర ఇండస్ట్రీలో స్టార్‌గా వెలుగొందుతున్న జసీలాకు మోడలింగ్‌ రంగం నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గాను సక్సెస్ అయ్యారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు దాదాపు 114K ఫాలోవర్స్ ఉన్నారు.

Jaseela Parveen shocking allegations on her ex-partner Don Thomas

అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే.. తన ప్రియుడి చేతుల్లో దారుణంగా చిత్రహింసలు అనుభవిస్తున్నానని కన్నీటి పర్యంతమయ్యారు జసీలా. డాన్ థామస్ అనే వ్యక్తితో జసీలా రిలేషన్‌లో ఉన్నారు. అతనికి అన్ని వ్యసనాలు ఉన్నాయని.. దీనికి తోడు విపరీతమైన కోపం ఉంది. ఈ ఏడాది నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా ఇద్దరికీ గొడవ జరిగింది. ఇంతలోనే పట్టరాని కోపంతో ఊగిపోయిన డాన్.. తనను కడుపులో తన్నాడు, నా తల నేలకేసి బాది జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లాడని జసీలా తెలిపారు. చేతికి ఏది దొరికితే దానితో నన్నుచితకబాదాడని తెలిపింది.

ఈ పెనుగులాటలో నా పెదవికి తీవ్రగాయమై.. రక్తస్రావమైంది. భయంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లమని వేడుకున్నా వినలేదని.. పోలీసులకు సమాచారం ఇస్తానని భయపడి నా ఫోన్ లాక్కున్నాడు. ఈ బాధను పంటి బిగువున భరిస్తూ కూర్చొన్నా.. ఆ కాసేపటికి డాన్ నన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. మెట్లపై నుంచి జారి పడిపోయానని డాక్టర్లకు అబద్ధం చెప్పాడు.. నేను నటిని కావడంతో ముఖం చాలా ముఖ్యం. అందుకే గాయాలు కనిపించకుండా ఉండటానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా ఇంత జరిగినా అతనిలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదని జసీలా చెప్పారు.

అతనిని ఇక భరించలేను.. అందుకే పోలీసుకు ఫిర్యాదు చేశా. ప్రస్తుతం కేసు నడుస్తోంది.. లాయర్‌ను పెట్టుకుని పోరాడే శక్తి, డబ్బు నా దగ్గర లేవు. అందుకే కోర్టుకు వెళ్లి నా ఆవేదన చెప్పుకోవాలని అనుకుంటున్నా.. కానీ అక్కడ నాకు మాట్లాడే అవకాశం దొరకడం లేదని జసీలా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోరాటంలో నాకు ఏం చేయాలో తెలియడం లేదని.. ఎవరైనా సాయం చేయాలని జసీలా అభ్యర్థించింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు, వీడియోలు మలయాళ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.

More from Filmibeat

Read more about: movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X