Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ముసలాడితో రాసలీలలు.. ఆయనతో నేను పడుకోలేదు అంటున్న గాయని!
Recommended Video
కండల వీరుడి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున బిగ్ బాస్ 12 సీజన్ ఆదివారం రోజు ప్రారంభమైంది. మరిన్ని సంచలనాలు చోటుచేసుకునేలా ఈ షోని నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఈ సారి విభిన్నంగా జంటలని హౌస్ లోకి పంపారు. శ్రీశాంత్ లాంటి మాజీ క్రికెటర్ ఎంట్రీ గురించి కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా ఓ జంటని చూస్తుంటే మాత్రం ఇదెక్కడి విడ్డూరం అని అనిపించక మానదు. ఆధ్యాత్మిక పాటలు పాడే సింగర్ జలోట, అతడి గర్ల్ ఫ్రెండ్ జస్లీన్ జంటగా బిగ్ బాస్ షో లో పాల్గొంటున్నారు. జలోత వయసు 65 ఏళ్ళు, జస్లీన్ వయసు 27 ఏళ్ళు. ఇక్కడే అసలు చిక్కంతా వచ్చింది.
మూడేళ్ళ నుంచి
వీరిద్దరూ గత మూడేళ్ళ నుంచి సహజీవనం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వీరి పై ట్రోలింగ్ తారాస్థాయికి చేరుతోంది. జలోటని అయితే నెటిజన్లు ఒక ఆట ఆడుకుంటున్నారు. ముసలాడివి నీకు గర్ల్స్ ఫ్రెండ్ అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు.
నేను పడుకోవడం లేదు
ఇదిలా ఉండగా వీరిద్దరి రిలేషన్ షిప్ గురించి ఓ మీడియా సంస్థ హౌస్ లోకి ఎంటర్ కాక ముందు ప్రశ్నించగా.. జస్లీన్ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. నేనేం అతడితో పడుకోవడం లేదు అంటూ సమాధానం ఇచ్చిందట. బిగ్ బాస్ హౌస్ లో కూడా ఆమె సింగిల్ బెడ్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆమె పక్క బెడ్ లోనే జలోట పడుకుంటున్నాడు.
చీప్ పబ్లిసిటీ
వారిద్దరి రిలేషన్ గురించి జస్లీన్ తండ్రి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్, విమర్శలు నేను పట్టించుకోను. నా కుమార్తె గుర్తింపు పొందిన సింగర్. చీప్ పబ్లిసిటి కోసం ఇలాటి వ్యాఖ్యలు చేసే వారిని తాను పరిగణలోకి తీసుకోనని జస్లీన్ తండ్రి అన్నారు.
విజేతగా రావాలి
నా కుమార్తె బిగ్ బాస్ హౌస్ నుంచి బయట వచ్చే వరకు జలోటతో ఉన్న సంబంధం గురించి మాట్లాడను. ఆమె విజేతగా తిరిగి వచ్చాక వీరిద్దరి రిలేషన్ గురించి మాట్లాడతా అని జస్లీన్ తండ్రి అన్నారు. ఇండియాలో సూపర్ సక్సెస్ అవుతున్న బిగ్ బాస్ షోని ఈ 12 వ సీజన్లో మరింత మసాలా కోసం జంటలతో ప్లాన్ చేశారు.