For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Siri Hanmath కి కరోనా పాజిటివ్.. అయినా ఇంటికి వద్ద జస్వంత్ పడాల హల్‌చల్

  |

  ప్రస్తుతం భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనేక మంది సినీ సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లలో ఒకరిగా నిలిచిన సిరి కూడా ఈ మధ్య కరోనా బారిన పడింది. అయితే ఆమె తన సొంత ఇంట్లో ఐసోలేషన్ లో ఉంటుంది. ఇప్పటి వరకు ఆమె ప్రియుడు కూడా ఆమెను కలిసిడో లేదో తెలియదు కానీ బిగ్ బాస్ హౌస్ లో మంచి స్నేహితుడిగా మారిన జెస్సీ మాత్రం ఆమెను కలిసేందుకు గోవా నుంచి వచ్చాడు. కలిసిన తర్వాత ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే...

  మరింత పేరు సంపాదించి

  మరింత పేరు సంపాదించి

  సినీ నటి గా మారాలి అని ఎన్నో ఆశలతో హైదరాబాద్ లో అడుగుపెట్టిన విశాఖపట్టణానికి చెందిన సిరి హనుమంతు అనేక ప్రయత్నాల తర్వాత యూట్యూబ్ లో నటిగా మంచి ఆఫర్లు సంపాదించింది.. ఆ తర్వాత నెమ్మదిగా సీరియల్స్ లో కూడా ఆమెకు అవకాశాలు దక్కాయి. అంతేకాక నరసింహ పురం లాంటి కొన్ని సినిమాల్లో కూడా ఆమె హీరోయిన్ గా నటించింది. అయితే ఇవన్నీ ఆమెకు తీసుకువచ్చిన పేరు కంటే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ఆమె కంటెస్టెంట్ గా పాల్గొని మరింత పేరు సంపాదించింది.

  ఎమోషనల్ బాండింగ్ పెరిగి

  ఎమోషనల్ బాండింగ్ పెరిగి

  నిజానికి బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్లే సమయానికి ఆమె శ్రీహాన్ అనే వ్యక్తి తో లివింగ్ రిలేషన్ లో ఉండేది. వీరిద్దరూ ఒక బాబుని కూడా దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. అయితే హౌస్ లోపలికి వెళ్ళిన తర్వాత షణ్ముఖ్ జస్వంత్ తో సిరి కి ఎమోషనల్ బాండింగ్ పెరిగింది. హౌస్ లోపల వీళ్లిద్దరూ హగ్గులు ఇచ్చుకోవడం ఒకరినొకరు ముద్దులు పెట్టుకోవడం చూసి చాలా మందికి మీరు చేస్తున్న పనులు నచ్చలేదు. మధ్యలో శ్రీహాన్ ఒకసారి హౌస్ లోపలికి వచ్చి నన్ను వదిలేస్తున్నావా సిరి అని అడగడం ప్రేక్షకులందరికీ కంటతడి పెట్టించింది.

  విడిపోయే ప్రేమ కాదు వాళ్ళ

  విడిపోయే ప్రేమ కాదు వాళ్ళ


  అయితే బిగ్ బాస్ ముగిసిన తర్వాత ఒక్కసారి కూడా శ్రీహాన్ సిరి గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించిన దాఖలాలు లేవు. మరోపక్క దీప్తి సునైనా అయితే ఏకంగా షణ్ముఖ్ జస్వంత్ కి బ్రేకప్ కూడా చెప్పింది. అయితే ఈ బ్రేక్ అప్ కి తానే కారణమని వస్తున్న విమర్శలను మీద విశాఖపట్నం వెళ్ళిన సిరి స్పందించింది. అదంతా నిజం కాదని నా వల్ల వాళ్ళిద్దరు విడిపోవడం అనేది జరగదు అని చెప్పుకొచ్చింది. ఒక వంద రోజుల షో చూసి విడిపోయే ప్రేమ కాదు వాళ్ళది అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

  వీడియో తీసి

  వీడియో తీసి

  ఇక కొద్ది రోజుల క్రితం తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. చాలామంది ఆమె త్వరగా కోలుకోవాలని పోస్టులు పెట్టారు కానీ ఆమె ప్రియుడు శ్రీ హాన్ మాత్రం సోషల్ మీడియా వేదికగా స్పందించిన పరిస్థితి కనిపించలేదు. సిరి ప్రస్తుతం హైదరాబాదులో ఉండగా శ్రీహరి మాత్రం నార్త్ ఇండియా ట్రిప్ లో ఉన్నాడు. తాజాగా సిరి ఇంటికి వెళ్ళిన జశ్వంత్ అక్కడి నుంచి ఒక వీడియో తీసి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.

  కాసేపు హల్చల్

  కాసేపు హల్చల్


  తన స్నేహితురాలు సిరి ఇంటిలో పని ఉందని, తను 'పొట్టి'కి కరోనా వచ్చినదని చెబుతూ ఆమెకు కాస్త ధైర్యం చెప్పే మాటలు చెబుతూ కనిపించాడు. సిరి ఇంటి లోపల ఉండగా జశ్వంత్ బయట నుంచి గట్టి గట్టిగా మాట్లాడుతున్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరో వ్యక్తి పక్కనుంచి వాళ్ళ స్నేహం తట్టుకోలేకపోతున్నాను రా బాబు అని కూడా వీడియో లో ఎవరో అనడం వినిపిస్తోంది. మొత్తం మీద జయశ్వంత్ సిరి ఇంటికి వెళ్ళడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వెళ్లి అక్కడ కాసేపు హల్చల్ చేశాడు. ఆ తర్వాత తన ఇంటికి తిరిగి వచ్చాడు. అంతకు ముందే గోవా నుంచి జస్వంత్ హైదరాబాద్ చేరుకున్నాడు

  English summary
  Jaswanth Jessie hulchul near Siri Hanmanth house after knowing she is corona positive.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X