twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 10th Week Elimination:నామినేషన్‌లో లేని కంటెస్టెంట్ అవుట్..ఇంటి సభ్యులకు షాకిచ్చిన బిగ్‌బాస్

    |

    బిగ్‌బాస్ తెలుగులో ఎవరూ ఊహించని విధంగా ఎలిమినేషన్ జరిగిపోయింది. పదోవారం ఎలిమినేషన్ ప్రక్రియ సందర్భంగా బిగ్‌బాస్ భారీ ట్విస్ట్ ఇచ్చారు. అయితే ఈ వారం ఇంటి నుంచి నామినేషన్‌లో ఉన్న ఆర్జే కాజల్ గానీ, లేదా మానస్ గానీ ఇంటి నుంచి వెళ్లిపోతారనే అందరూ ఊహించారు. కానీ ఈ సారి నామినేషన్‌లోని లేని వ్యక్తి ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఇంటి నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యారంటే..

     నామినేషన్‌లోని ఐదుగురు వీరే..

    నామినేషన్‌లోని ఐదుగురు వీరే..

    బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో పదో వారం ఇంటిలోని సభ్యుల్లో ఐదుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. యాంకర్ రవి, మానస్, వీజే సన్నీ, ఆర్జే కాజల్, సిరి హన్మంతు పదోవారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు. ఈ వారం టాప్ కంటెస్టెంట్లు ఎలిమినేషన్ బరిలో ఉండటంతో అభిమానులు భారీగా ఓటింగ్ వేశారు. అయితే చివరిస్థానాల్లో నిలిచిన కాజల్, మానస్‌లో ఎవరో ఒకరు వెళ్లిపోతారనే ఊహించారు.

     జస్వంత్ పడాలకు వీడ్కోలు అంటూ

    జస్వంత్ పడాలకు వీడ్కోలు అంటూ

    అయితే ఎలిమినేషన్ ప్రక్రియకు ఒక రోజు ముందే జస్వంత్ పడాలను ఇంటి నుంచి పంపిస్తారని ఊహగానాలు మొదలయ్యాయి. అనారోగ్య కారణాల కారణంగా ఇంటి నుంచి చికిత్స కోసం బయటకు వెళ్లిన జెస్పీని క్వారంటైన్ పీరియడ్ కోసం సీక్రెట్ రూమ్‌లో ఉంచారు. అయితే అనారోగ్యం మెరుగు పడకపోవడంతో గౌరవప్రదంగా ఇంటి నుంచి వీడ్కోలు చెప్పడానికి బిగ్‌బాస్ నిర్వాహకులు ప్లాన్ చేశారు. వారాంతంలో నాగ్ వచ్చే వరకు జస్వంత్‌ను సీక్రెట్ రూమ్‌లో ఉంచడం తెలిసిందే. వారాంతంలో

     అనారోగ్యం కారణాల వల్ల జెస్సీని గౌరవంగా

    అనారోగ్యం కారణాల వల్ల జెస్సీని గౌరవంగా

    అనారోగ్య కారణాల రీత్యా జస్వంత్‌ను ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నాం అంటూ బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు షాకిచ్చినట్టు సమాచారం. దాంతో నామినేషన్‌లో ఉన్నవాళ్లు ఓవైపు ఊపిరి పీల్చుకోగా, మరోవైపు తమ సహచరుడు అనారోగ్య కారణంగా బయటకు వెళ్లడంతో ఇంటి సభ్యులు మరోసారి కంటతడి పెట్టాల్సి వచ్చింది.

     గతంలోను ఇలాంటి సంఘటనలు

    గతంలోను ఇలాంటి సంఘటనలు

    గతంలో ఇంటి నుంచి అర్ధాంతరంగా బయటకు వెళ్లిన వారిలో సంపూర్ణేష్ బాబు, గంగవ్వ, నోయల్ సీన్ ఉన్నారు. ప్రస్తుతం వారి ఆ జాబితాలో జస్వంత్ పడాల కూడా చేరడం గమనార్హం. సీక్రెట్ రూమ్‌లో ఉంటే ఇంటిలోకి వస్తాడని అభిమానులు ఎదురు చూస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో జెస్పీని ఇంటి నుంచి పంపిచాల్సి వచ్చిందనేది గమనార్హం.

    Recommended Video

    Bigg Boss Telugu 5 : Sunny Vs Siri, Shannu | Anne Nagini Dance || Filmibeat Telugu
    ఎలిమినేషన్ ఉంటుందా? ఉండదా?

    ఎలిమినేషన్ ఉంటుందా? ఉండదా?

    అయితే పదోవారం ఇంటిలో ఎలిమినేషన్ ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. జెస్సీతోపాటు ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా మరొకరిని ఇంటి నుంచి పంపిస్తారా? లేదా అనేది వేచి చూడాల్సింది. పదో వారం అనూహ్యం పరిస్థితుల్లో ఎవరూ ఊహించని విధంగా జెస్పీ ఇంటి నుంచి బయటకు వెళ్లడం బాధకరంగా మారింది.

    English summary
    Bigg Boss 5 Telugu Elimination Today: Jessie Out Of Nagarjuna Show:
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X