Jaswanth Padalaకు క్షీణించిన ఆరోగ్యం.. మెరుగైన చికిత్స కోసం బయటకు.. తీవ్ర విషాదంలో ఇంటి సభ్యులు!

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో అందరూ ఊహించినట్టుగానే జెస్సీ అలియాస్ జస్వంత్ పడాల ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు దిగజారడంతో బిగ్‌బాస్ అనూహ్యమైన నిర్ణయం తీసుకొన్నారు. జెస్సీ ఇంటి నుంచి అర్ధాంతరంగా బయటకు రావడం ప్రేక్షకులనే కాకుండా ఇంటి సభ్యులను కంటతడి పెట్టించేలా మార్చింది. తాజా ప్రోమోలో జెస్సీ బిగ్‌బాస్ నుంచి చికిత్స కోసం బయటకు రావడం కనిపించింది. తాజా ప్రోమో ప్రకారం..

గతంలో నూతన్ నాయుడు, నోయల్ సీన్

గతంలో నూతన్ నాయుడు, నోయల్ సీన్

గత బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షోలో కొన్ని ఆరోగ్య, ఇతరత్రా కారణాల వల్ల ఇంటి సభ్యులు బయటకు వెళ్లడం తెలిసిందే. గతంలో నూతన్ నాయుడు, అలాగే నోయల్ సీన్ లాంటి వాళ్లు అర్ధాంతరంగా చికిత్స కోసం బయటకు వెళ్లిన విషయం ప్రేక్షకులకు తెలిసిందే. తాజాగా వారి దారిలోనే జెస్సీ వెళ్లాల్సి రావడం బిగ్‌బాస్ అభిమానులకు ఆవేదన కలిగిస్తున్నది.

వైద్యుడి పరీక్షల అనంతరం

వైద్యుడి పరీక్షల అనంతరం

సోమవారం రాత్రి ప్రసారమైన బిగ్‌బాస్ షోలో జెస్సీని వైద్యుడు పరీక్షించడం కనిపించింది. వెర్టిగో అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న జెస్సీని వైద్యుడు పరీక్షించి సరిగా మాత్రలు వాడుతున్నావా? సమయానికి ఆహారం తీసుకొంటున్నావా అంటూ ప్రశ్నించడం కనిపించింది.

జస్వంత్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో

జస్వంత్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో

ఇలాంటి పరిస్థితుల్లో ఇంటిలో చికిత్స పొందుతున్న జెస్సీ ఆరోగ్య మరింత క్షీణించడంతో బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. జస్వంత్ పరిస్థితి ఇంకా మెరుగుపడటం లేదనే విషయం తెలుసు అని బిగ్‌బాస్ అంటే.. అవును అని జస్వంత్ సమాధానం ఇచ్చాడు. దాంతో ఇంటి నుంచి బయటకు రావాల్సి ఉంది. మీరు మెయిన్ గేట్ నుంచి బయటకు రండి అంటూ బిగ్‌బాస్ ఆదేశించాడు.

షణ్ముఖ్, యాంకర్ రవి బాధలో

షణ్ముఖ్, యాంకర్ రవి బాధలో

బిగ్‌బాస్‌తో మాట్లాడిన తర్వాత థ్యాంక్యూ చెప్పి కన్ఫెషన్ రూమ్‌ను బయటకు వచ్చిన జెస్సీ.. గయ్స్.. నేను ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాను అని చెప్పగానే షణ్ముఖ్ షాక్ తిన్నాడు. నమ్మలేని నిజాన్ని వింటున్నట్టు ముఖంలో బాధ కనిపించింది. సిరి వెంటనే వచ్చి కౌగిలించుకొని కన్నీరు మున్నీరైంది. అయితే బాధలో ఉన్న జెస్సీని ఓదార్చుతూ.. నీవు ఫైటర్‌వు. నీవు స్ట్రాంగ్‌గా ఉండాలి అంటూ మనోధైర్యాన్ని యాంకర్ రవి నింపే ప్రయత్నం చేశాడు.

సిరి హన్మంతు కన్నీరుమున్నీరు

సిరి హన్మంతు కన్నీరుమున్నీరు

జస్వంత్ బయటకు వెళ్తున్నాడనే వార్తతో షణ్ముఖ్ భోరున విలపించాడు. ఇంటి సభ్యులందరూ విషాదంలో మునిగిపోయారు. జెస్సీని పట్టుకొని సిరి, షణ్ముఖ్ కంటతడి పెట్టారు. ఐ మిస్ యూ అంటూ జస్వంత్ అనడంతో అందరి బాధ కట్టలు తెంచుకొన్నది. ఇంటి సభ్యులందరూ విషాద వదనంతో జెస్సీకి వీడ్కోలు ఇచ్చారు. సిరి హన్మంతు జెస్సీ నుదుటిపై ముద్దుపెట్టి ఏడుపులో మునిగిపోయింది.

Recommended Video

Bigg Boss Telugu 5 : ఈ వారం ట్విస్ట్ ఇదే..!! || Filmibeat Telugu
ఇంటి సభ్యుల్లో విషాదం ఛాయలు

ఇంటి సభ్యుల్లో విషాదం ఛాయలు

బాధాతప్త హృదయంతో జెస్సీ బయటకు వెళ్లడం చూసి ఇంటిలో విషాద ఛాయలు అలుముకొన్నాయి. ఓ పక్కన కూర్చొని షణ్ముఖ్, సిరి హన్మంతు కన్నీరుమున్నీరు అవుతూ కనిపించారు. అప్పటి వరకు ఆనందంలో ఉన్న ఇంటి సభ్యులందరూ జెస్సీ అర్ధాంతరంగా షో నుంచి వెళ్లిపోవడంతో బాధలో మునిగిపోయారు. అయితే ట్రీట్‌మెంట్ తీసుకొని జెస్సీ మళ్లీ వస్తాడా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X