ప్రేమలో పడ్డ బిగ్ బాస్ జెస్సీ.. నేరుగా స్టేజ్ మీదే ఆ పని చేయడంతో!
తెలుగులో ప్రసారం అవుతోన్న సక్సెస్‌ఫుల్ షోలలో బిగ్ బాస్ ఒకటి. దీని ద్వారా ఎంతో మంది పరిచయం లేని వాళ్లు కూడా సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో ఐదో సీజన్ కంటెస్టెంట్ జస్వంత్ పడాల అలియాస్ జెస్సీ ఒకడు.
మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన అతడు.. బిగ్ బాస్ తర్వాత ఎన్నో టాలెంట్లను చూపించి సత్తా చాటుతున్నాడు. ఇలా వరుసగా ఆఫర్లను అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ షోలో జస్వంత్ తన ప్రియురాలిని పరిచయం చేశాడు. స్టేజ్ మీదనే ఆమెకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఆ సంగతులు మీరే చూసేయండి!

వాళ్లతో కలిసి హైలైట్‌గా: బిగ్ బాస్ ఐదో సీజన్‌లో పరిచయం లేకుండానే వచ్చి సెన్సేషన్ అయ్యాడు ప్రముఖ మోడల్ జస్వంత్ పడాల అలియాస్ జెస్సీ ఒకడు. ఆరంభంలోనే అతడు తనదైన వ్యవహార శైలితో బాగా హైలైట్ అయ్యాడు. ఆ తర్వాత షణ్ముఖ్, సిరితో కలిసే ఉంటూ త్రిమూర్తుల్లో ఒకడిగా పేరు తెచ్చుకుని రచ్చ చేశాడు. దీంతో జెస్సీకి తెలుగు రాష్ట్రాల్లో ఫాలోయింగ్ భారీగానే పెరిగిపోయింది.

బిగ్ బాస్ తర్వాత ఫుల్: బిగ్ బాస్ హౌస్‌లో జస్వంత్ పడాల వ్యవహార శైలి పరంగా ఎలా ఉన్నా.. ఆరోగ్య సమస్యలు వెంటాడినా ఏమాత్రం తగ్గకుండా పోరాటం చేశాడు. అయితే, వర్టిగో అనే వ్యాధితో బాధ పడడంతో జెస్సీని కొన్ని రోజులు సీక్రెట్ రూమ్‌లో ఉంచారు. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు పంపేశారు. అయినా అతడికి ఆఫర్లు మాత్రం వచ్చాయి. ఇలా దీని తర్వాత సత్తా చాటుతున్నాడు.
ఆ మూవీలో హీరోగానూ: బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జస్వంత్ పడాలకు చాలా షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లలో అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఏకంగా అతడు హీరోగా ఓ సినిమాను కూడా చేసేశాడు. 'ఎర్రర్ 500' అనే టైటిల్‌తో తెరకెక్కిన ఇందులో జస్వంత్ పడాల ఫుల్ యాక్షన్ అండ్ అగ్రెసివ్ రోల్ చేస్తున్నాడు. సందీప్ మైత్రేయ దీనికి దర్శకత్వం వహించాడు.

ప్లేబాయ్‌లా.. ఆ షోలలో: బిగ్ బాస్ షో సమయంలో పెద్దగా పరిచయం లేని జస్వంత్ పడాల.. బయటకు వచ్చిన తర్వాత మాత్రం సెలెబ్రిటీగా మారాడు. దీంతో తనలోని ప్లేబాయ్ యాంగిల్‌ను బయటకు తీసి అమ్మాయిలతో కలిసి రచ్చ చేసేశాడు. అలాగే, 'ఢీ'లో సందడి చేశాడు. అలాగే, ఇటీవలే 'ఢీ సెలెబ్రిటీ స్పెషల్'లో కంటెస్టెంట్‌గానూ పాల్గొంటూ కూడా క్రేజీ కామెడీని పండించేవాడు.
గర్ల్‌ఫ్రెండ్‌ను చూపిస్తూ: ఈ మధ్య కాలంలో తెలుగు బుల్లితెరపై వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటోన్న జస్వంత్ పడాల.. తాజాగా 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో పాల్గొన్నాడు. ఇందులో 'ఉమెన్స్ డే స్పెషల్' ఎపిసోడ్ నిర్వహించారు. వచ్చే ఆదివారం ఇది ప్రసారం కాబోతుంది. ఈ షోలో జస్వంత్ తన ప్రియురాలిని పరిచయం చేశాడు. ఈ ప్రోమోను ఈటీవీ వాళ్లు తాజాగా విడుదల చేశారు.
బాగా చూసుకుంటాను: తాజాగా వచ్చిన 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రోమోలో జస్వంత్ పడాల ఓ అమ్మాయితో స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత ఆమెతో డ్యాన్స్ చేసి ఓ గిఫ్టును అందించాడు. ఆ సమయంలో 'కచ్చితంగా నిన్ను బాగా చూసుకుంటాను. ఆ మాట మాత్రం చెప్పగలను' అని ప్రామిస్ చేశాడు. దీంతో ఆ అమ్మాయి ఆనందంతో మురిసిపోయింది. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











