Don't Miss!
- News తెర మీదకు వివేకానందరెడ్డి రెండో భార్య..వీడియో వైరల్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
‘ఫర్ఫెక్ట్ మొగుడు’ కోసం.. మెట్టుదిగిన జయప్రద
80, 90 దశకాల్లో టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వెండితెరను ఏలేసింది. కృష్ణ, ఎన్టీఆర్, కృష్ణంరాజు, చిరంజీవి, అమితాబ్, జితేంద్ర, అగ్ర నటులతో జతకట్టి మెప్పించింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి బిజీగా మారింది. తాజాగా హిందీ భాషలో బుల్లితెరపై అత్త పాత్రలో కనిపించనున్నది. వివరాల్లోకి వెళితే..
ఫర్ఫెక్ట్ పతి కోసం
హిందీ టెలివిజన్ రంగంలో ఫర్ఫెక్ట్ పతి అనే సీరియల్లో జయప్రద కీలకపాత్రను పోషిస్తున్నారు. టెలివిజన్ సీరియల్ జయప్రద నటించడం ఇదే తొలిసారి. ఈ సీరియల్లో నేటితరం అత్త పాత్రను పోషించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
డైనమిక్ అత్త పాత్రలో
ఇప్పటి వరకు టెలివిజన్ సీరియల్స్‌లో కనిపించే అత్త పాత్రలకు భిన్నంగా నా రోల్ ఉంటుంది. కాన్ఫిడెంట్‌గా, డైనమిక్‌గా ఉండే రాజ్యశ్రీ రాథోడ్ అనే పాత్రలో కనిపిస్తాను. ఇంటి బాధ్యతలు, సామాజిక సేవ, వ్యాపార వ్యవహారాలు చూసుకొనే ఇంటి పెద్ద పాత్రలో కనిపిస్తాను అని జయప్రద వెల్లడించింది.
నిర్ణయాన్ని ప్రేక్షకులకే వదిలాను
టెలివిజన్ సీరియల్లో అత్త పాత్రలో నటించే ఆఫర్ వచ్చినప్పుడు చాలా రోజులు తటపటాయించాను. కానీ నా ముందు ఉన్న కఠినమైన నిర్ణయానికి ఆలోచించి ఓకే చెప్పాను. నా నిర్ణయం తప్పా? రైటా అనేది ప్రేక్షకులే తీర్పు ఇస్తారు అని జయప్రద పేర్కొన్నారు.
నిజంగా అదృష్టంగానే
ఆధునిక భావాలు ఉన్న అత్త పాత్ర నాకు ముందుకు రావడం నిజంగా అదృష్టమే. నా ప్రొఫెషనల్ జీవితంలో మరో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతున్నది. ఆ పాత్రను ఎలా రిసీవ్ చేసుకొంటారనే విషయం నాలో ఆసక్తిని రేపుతున్నది అని ఓ ప్రశ్నకు జయప్రద సమాధానం ఇచ్చారు.
సెప్టెంబర్ 3న విడుదల
ఫర్ఫెక్ట్ పతి సీరియల్ రాజస్థాన్ బ్యాక్‌డ్రాప్‌గా ఉంటుంది. భిన్నంగా ఉండే విధిత (సయాలి సంజీవ్), పుష్కర్ (ఆయుష్ ఆనంద్) అనే వ్యక్తుల మధ్య వైరుధ్యంగా సాగుతుంది. పుష్కర్ తల్లిగా నేను నటిస్తున్నాను. ఈ సీరియల్ సెప్టెంబర్ 3న ప్రారంభం కానున్నది.