మంచి భర్తలు లేనే లేరు.. సమాజం దారుణంగా విఫలం.. జయప్రద సెన్సేషనల్ కామెంట్స్
సీనియర్ నటి, అందాల తార జయప్రద దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో తన ముద్ర వేసుకొని సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎంపీగా సేవలందించింది. అటు సినిమాలు, ఇటు రాజకీయాలకు కొంత గ్యాప్ ఇచ్చేసి ప్రస్తుతం టెలివిజన్ రంగంపై దృష్టిపెట్టింది. అండ్ టెలివిజన్‌లో ప్రసారమవుతున్న ఫర్‌ఫెక్ట్ పతి సీరియల్స్‌లో రాజ్యశ్రీ రాథోడ్ అనే తల్లిపాత్రలో కనిపించింది. ఈ పాత్ర గురించి చెబుతూ...

కొడుకును చంపే తల్లి పాత్రలో జయప్రద
ఫర్‌ఫెక్ట్ పతి సీరియల్స్‌లో తన కోడలికి న్యాయం చేసేందుకు కన్న కొడుకునే చంపేస్తుంది. మహిళల హక్కుల కోసం, మహిళ మనోభావాలకు అండగా నిలిచే రాజ్యశ్రీ పాత్రను పోషించింది. ఈ పాత్రకు మంచి పేరు వచ్చేలా కనిపిస్తున్నది. టెలివిజన్ రంగంలో కూడా తన ప్రభావాన్ని చూపే అవకాశం కనిపిస్తున్నది.

ఫర్‌ఫెక్ట్ పతి అనే సీరియల్ ద్వారా
ఫర్‌ఫెక్ట్ పతి అనే సీరియల్ ద్వారా టెలివిజన్ రంగంలోకి ప్రవేశించడం చాలా ఆనందంగా ఉంది. సానుకూలమైన తల్లి, అత్త పాత్రను పోషించాను. పిల్లల మనస్తత్వాన్ని, ప్రవర్తనను అర్ధం చేసుకొనే తల్లిగా, అలాగే కొడుకు తప్పులను గుర్తించే పాత్రలో నటించాను.

సమాజం విఫలమైందని
అమ్మాయిలను మంచి భార్యలుగా తయారు చేయడానికి భారతీయ సమాజం వేల సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నది. అదే సమయంలో మంచి భర్తలను తయారు చేయడంలో ఈ సమాజం విఫలమైంది. భర్తలను ఎలా ఉన్నా అంగీకరించాలనే అభిప్రాయాన్ని మహిళలపై బలంగా రుద్దుతున్నదీ సమాజం అని జయప్రద అభిప్రాయపడింది.

పర్‌ఫెక్ట్ పతి సీరియల్‌పై
ఫర్‌ఫెక్ట్ పతి చిత్రం అండ్ టీవీలో ప్రసారం అవుతున్నది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటల సమయంలో ప్రదర్శిస్తున్నారు. ఈ సీరియల్‌పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. రానున్న రోజుల్లో జయప్రద బుల్లితెర ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణను మూటగట్టుకొంటుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











