twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అభాగ్యుల కోసం కూలీలుగా.. దోశెలు వేసిన రకుల్.. బంక్‌లో అనుష్క.. సెలూన్‌లో నాగశౌర్య

    మేముసైతం అనే టెలివిజన్ కార్యక్రమం ద్వారా సినీతారలు ముందుకొస్తున్నారు. గతంలో విజయవంతమైన టెలివిజన్ కార్యక్రమానికి రెండో ఎడిషన్‌గా ఈ కార్యక్రమం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఆ కార్యక్రమ విశేషాల

    By Rajababu
    |

    ఆర్థిక ఇబ్బందులు, సమస్యలతో జీవనం సాగిస్తున్న కుటుంబాలకు, అనాథలకు, నిస్సహాయులకు కొండంత అండగా నిలువడానికి మేముసైతం అనే టెలివిజన్ కార్యక్రమం ద్వారా సినీతారలు ముందుకొస్తున్నారు. గతంలో విజయవంతమైన టెలివిజన్ కార్యక్రమానికి రెండో ఎడిషన్‌గా ఈ కార్యక్రమం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఆ కార్యక్రమ విశేషాలు మీకోసం..

    రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్

    రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్

    రీల్ లైఫ్‌లో సమస్యలపై పోరాటం చేసే సినీ తారలు రియల్ లైఫ్‌లో సామాన్యులు ఎదుర్కొనే సమస్యల పట్ల ఎంత బాధ్యతగా స్పందిస్తారో తెలియజెప్పే కార్యక్రమం మేము సైతం.

    మేము సైతంలో సెలబ్రిటీలు

    మేము సైతంలో సెలబ్రిటీలు

    మేము సైతం కార్యక్రమంలో నాగార్జున మోహన్‌బాబు, రానా, అఖిల్, సాయిధరమ్ తేజ్, జయప్రద, పోసాని కృష్ణమురళీ లాంటి సినీతారలు పాల్గొన్నారు.

    సీజన్2లో అనుష్క, రకుల్ ప్రీత్

    సీజన్2లో అనుష్క, రకుల్ ప్రీత్

    కొందరు అభాగ్యుల జీవితాలను చిగురించేలా చేసేందుకు మరికొందరు తారలు మేముసైతం సీజన్2‌లో అనుష్క, రకుల్ ప్రీత్, నాగశౌర్య, జయసుధ లాంటి వాళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
    అనుష్క పని ఇలా..

    అనుష్క పని ఇలా..

    అంధులకు సేవ చేస్తున్న ఓ సేవాతత్పురుడి కోసం అందాల తార అనుష్క పెట్రోల్ బంకులో ఒకరోజు పనిచేసి అతడికి ఆర్థిక సహాయం అందించనున్నారు. అనుష్క చేసిన సేవాగుణానికి మంచి స్పందన లభించిందట.

     రకుల్ ప్రీత్ దోశలు

    రకుల్ ప్రీత్ దోశలు

    ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన నిస్సహాయుడిగా మారిన ఆటో డ్రైవర్ కోసం రకుల్ ప్రీత్ దోశలు అమ్మే పనిని భుజాన వేసుకొన్నది.

     సెలూన్‌లో నాగశౌర్య

    సెలూన్‌లో నాగశౌర్య

    అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకొన్న ఓ రైతు కుటుంబాన్ని ఆదుకోవడానికి నాగశౌర్య ముందుకు వచ్చారు. వారికి ఆర్థిక సహాయం అందించడానికి నాగశౌర్య సెలూన్ నడుపనున్నారు. ఒకరోజు చేసిన పనికి వచ్చే డబ్బును వీరందరూ బాధితులకు అందించనున్నారు.

     బీటెక్ విద్యార్థికి జయసుధ సహాయం

    బీటెక్ విద్యార్థికి జయసుధ సహాయం

    పక్షవాతానికి గురైన బీటెక్ విద్యార్థి సహాయం అందించేందుకు జయసుధ ముందుకొచ్చారు. జయసుధ ఓ రోజు మెస్ నడుపనున్నారు. తన వంతుగా కృషిగా సహాయం చేయడానికి జయసుధ స్పందించారు.

    మంచులక్ష్మీ వ్యాఖ్యాతగా

    మంచులక్ష్మీ వ్యాఖ్యాతగా

    ఇలాంటి స్పూర్తివంతమైన కార్యక్రమం మేముసైతం టెలివిజన్ షోకు మంచు లక్ష్మీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. జెమిని టీవీ
    , మంచు టెలిఫిల్మ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించనున్నాయి.

    ఫిబ్రవరి 18న

    ఫిబ్రవరి 18న

    ఫిబ్రవరి 18న ఆదివారం రాత్రి 8.30 గంటలకు ప్రారంభమయ్యే మేముసైతంను తప్పకుండా చూడాలని మంచులక్ష్మి, ఇతర తారలు కోరుతున్నారు. అభాగ్యులకు సహకరించాలని వేడుకొన్నారు.

    English summary
    Memu Saitham season 1 was a successful attempt to fill the lights of hope into the lives of unfortunate and vulnerable people of the society. Stars of the Telugu film Industry help the most unfortunate families of the society Portrayal of Roles in season 2 are Sweety Anuskha turns to be a daily coolie in a petrol pump in order to help a family to set up a blind school. Similarly another young Star Rakul Preeth works in a mobile canteen to save the family of an Auto driver family.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X